• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పోలవరంలో జగన్ ఏరియల్ వ్యూ-టార్గెట్ 2023 ఖరీఫ్- త్వరలో ప్రత్యేకాధికారులు

|

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని తెలుసుకునేందుకు సీఎం జగన్ ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద ఏరియల్ వ్యూ ద్వారా హెలికాఫ్టర్ నుంచే సీఎం జగన్ పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో ఆయన కీలక ఆదేశాలు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుల పనుల్ని 2023 ఖరీఫ్ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం... ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. అయితే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో రాకపోవడంతో కొన్ని ఇబ్బందులు ,తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పనుల్ని ఇవాళ పరిశీలించిన సీఎం జగన్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారికి కీలక ఆదేశాలు ఇచ్చారు.

సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న అధికారులు.. పోలవరం స్పిల్‌వే పనులు దాదాపుగా పూర్తిచేశామని తెలిపారు. 48 గేట్లలో 42 గేట్లు అమర్చామని, మిగిలిన గేట్లను కూడా త్వరలోనే బిగిస్తామని సీఎంకు తెలిపారు. జర్మనీ నుంచి సిలెండర్లు వచ్చాయని, ఎగువ కాఫర్‌డ్యాంలో ఇదివరకు ఉన్న ఖాళీలను పూర్తిచేశామని వెల్లడించారు. దిగువ కాఫర్‌డ్యాం పనులు పరిస్థితిని కూడా సీఎంకు వారు వివరించారు. ఎర్త్‌కం రాక్‌ఫిల్‌డ్యాం(ఈసీఆర్‌ఎఫ్‌)పనులపై అధికారుల నుంచి సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాఫర్‌ డ్యాంలో ఖాళీలు కారణంగా గతంలో వచ్చిన వరదలకు ఈఎస్‌ఆర్‌ఎఫ్‌ ప్రాంతం దెబ్బతిందని... దీనిపనులు ఎలా చేయాలన్నదానిపై డిజైన్లు కూడా ఖరారు అవుతాయని అధికారులు తెలిపారు.

ys jagan aerial tour in polavaram project- 2023 kharif target for completion of works

2022 జూన్‌కల్లా లైనింగ్‌తో కలుపుకుని రెండు కాల్వలకు లింకు పనులు పూర్తికావాలని, టన్నెల్‌పనులు, లైనింగ్‌పనులు పూర్తికావాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ డిసెంబర్‌ కల్లా తవ్వకం పనులు పూర్తవుతాయని, ఆతర్వాత మిగిలిన పనులు పూర్తిచేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. పోలవరం ఆర్‌ అండ్‌ ఆర్‌ పైనా సీఎం సమీక్ష నిర్వహించారు. మొత్తం 90 ఆవాసాల్లో ఆగస్టు నాటికి 48 ఆవాసాలనుంచి నిర్వాసితులను తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎంకు వారు వివరించారు.

ys jagan aerial tour in polavaram project- 2023 kharif target for completion of works

పోలవరం ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులన్నీ పూర్తి నాణ్యతతో ఉండాలని జగన్ అధికారులకు సూచించారు. ఏదో కట్టాం కదా? అన్నట్టు పునరావాస కాలనీలు కట్టకూడదని తెలిపారు. కచ్చితంగా నాణ్యత ఉండాలని వారిని ఆదేశించారు. ఇంతపెద్ద ఎత్తున పునరావాస కాలనీలు కడుతున్నప్పుడు.. సహజంగానే ఎక్కడోచోట అలసత్వం కనిపించే అవకాశాలు ఉంటాయని, అలాంటి అలసత్వానికి తావు ఉండకూడదన్నారు. నాణ్యత కచ్చితంగా ఉండాలన్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ పనుల్లో నాణ్యత కచ్చితంగా పాటించేలా ఒక అధికారిని నియమించాలని సీఎం సూచించారు. ఆ అధికారి ఇచ్చే ఫీడ్‌ బ్యాక్‌ను తప్పకుండా అధికారులు పరిగణలోకి తీసుకోవాలన్నారు. తప్పులు ఉన్నాయని చెప్పినప్పుడు కచ్చితంగా వాటిని సరిదిద్దుకోవాలన్నారు. వేగంగా నిర్మించాలని, లక్ష్యాలను త్వరగా చేరుకోవాలన్న ప్రయత్నంలో అక్కడక్కడా తప్పులు జరిగే అవకాశాలు ఉంటాయని, అలాంటి సందర్భాల్లో వాటిని సరిదిద్దే ప్రయత్నాలు తప్పకుండా జరగాలని జగన్ సూచించారు.

ys jagan aerial tour in polavaram project- 2023 kharif target for completion of works

ఆర్థికంగా రాష్ట్రానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాసరే... పునరావాస పనులకు సంబంధించిన బిల్లులు ఎక్కడా పెండింగులో పెట్టడంలేదని సీఎం తెలిపారు. ఇకపైకూడా ఆర్‌ అండ్‌ ఆర్‌ బిల్లులను పెండింగులో పెట్టకుండా చూడాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులను వేగంగా చేసుకుంటూ ముందుకు పోవాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి దాదాపుగా రూ.2300 కోట్లు రావాల్సి ఉన్నా... పనులకు ఎక్కడా ఆటంకం రాకుండా రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులను ఇస్తోందన్నారు. సుమారు ఆరు నెలలుగా ఈ బిల్లులు పెండింగులో ఉన్నాయని అధికారులు చెప్పగా... వాటిని సకాలంలో తెచ్చుకునేలా దృష్టిసారించాలన్నారు.

English summary
andhrapradesh chief minister ys jagan on today visited polavaram project by aerial view and review the works progress also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X