కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముస్తాక్‌కు ఘన నివాళి: చంద్రబాబు చిన్న చూపు చూశారన్న జగన్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: సియాచిన్ ఘటనలో వీరమరణం పొందిన జవాన్ ముస్తాక్ అహ్మద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు రాకపోవడం విచారకరమని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఆరోపించారు. కర్నూలు జిల్లాలోని పార్నపల్లె సైనికుడు ముస్తాక్ అహ్మద్ అంత్యక్రియల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.

దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఘనత ముస్తాక్ అహ్మద్‌ది వైయస్ జగన్ కొనియాడారు. ముస్తాక్‌కు దేశ ప్రజలంతా ఘనంగా నివాళి అర్పించారని చెప్పారు. ఏపీలో మాత్రం చంద్రబాబు ముస్తాక్ మరణంపై చిన్న చూపు చూశారని మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబుకు జ్ఞానోదయం కలగాలని కోరారు.

తొలుత ముస్తాక్ కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా మాత్రమే ప్రకటించారని, కర్ణాటకలో హనుమంతప్ప కుటుంబానికి రూ. 25 లక్షలు, ఇల్లు, పొలం, ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించడంతో ఆలస్యంగా స్పందించిన చంద్రబాబు ముస్తాక్ కుటుంబానికి రూ. 25 లక్షలు అందించారని వైయస్ జగన్ పేర్కొన్నారు.

YS Jagan and YSRCP Leaders attend Kurnool Jawan Mushtaq Ahmed Funerals

ముస్తాక్ మరణానికి నివాళిగా ఏపీలో ఒకరోజు సెలవు దినంగా ప్రకటించాలని జగన్ కోరారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం తరుపున ముస్తాక్ అంత్యక్రియలకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పాల్గొన్నారు. ముస్తాక్ భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముస్తాక్ మృతి తనను కలచివేసిందన్నారు.

ముస్తాక్ అహ్మద్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల స్థలంలో ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. వీరమరణం పొందిన జవాన్ కుటుంబానికి రూ.25 లక్షల చెక్కును అందించారు. ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి, గంగుల ప్రభాకర్‌రెడ్డి , ఎన్ఎమ్‌జీ ఫరూఖ్, కేఈ ప్రతాప్ సహా కలెక్టర్ విజయ్ మోహన్ కూడా ముస్తాక్‌కు నివాళులర్పించారు.

English summary
YS Jagan and YSRCP Leaders attend Kurnool Jawan Mushtaq Ahmed Funerals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X