వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'జగన్ సొమ్ము రూ.2 లక్షల కోట్లకు పైగానే, శాశ్వతంగా జైలు తప్పదు'

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టిడిపి నేతలు మంగళవారం నాడు దుమ్మెత్తిపోశారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టిడిపి నేతలు మంగళవారం నాడు దుమ్మెత్తిపోశారు. జగన్ తన తండ్రి పదవిని అడ్డు పెట్టుకొని దోచుకున్న సొమ్ము రూ.2లక్షల కోట్లకు పైగానే ఉంటుందని మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు.

<strong>వెంకయ్య ఎఫెక్ట్, అటు నుంచి నరుక్కొస్తున్న బాబు!: బీజేపీపై 'ముందస్తు' ప్లాన్</strong>వెంకయ్య ఎఫెక్ట్, అటు నుంచి నరుక్కొస్తున్న బాబు!: బీజేపీపై 'ముందస్తు' ప్లాన్

డబ్బు ఉందనే అహంకారంతో..

డబ్బు ఉందనే అహంకారంతో..

మంగళవారం చిత్తూరు జిల్లాలో అమర్నాథ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్బంగా మాట్లాడారు. డబ్బు ఉందనే అహంకారంతోనే జగన్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. అలాగే జిల్లాలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా గ్రామాలకు 2 వేల కి.మీ రోడ్డు నిర్మించిన ఘనత టిడిపి ప్రభుత్వానిదే అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

శాశ్వతంగా జైలుకు

శాశ్వతంగా జైలుకు

వైయస్ జగన్‌కు శాశ్వతంగా జైలు తప్పదని రాష్ట్ర ఆర్ధిక, శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. 11 చార్జిషీట్లతో ఏ-1గా ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యం, చంద్రబాబు గురించి మాట్లాడడం విడ్డూరం అన్నారు.

ఓర్వలేకనే

ఓర్వలేకనే

ఈ కేసుల్లో నేరం రుజువైతే జగన్‌కు శాశ్వతంగా జైలే అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే చంద్రబాబుపై జగన్ విమర్శలు చేస్తున్నారన్నారు. త్వరలోనే యూత్ పాలసీ తీసుకువచ్చి 12 లక్షల మందికి నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. కోటిపల్లి - నార్సాపూర్ రైల్వే లైన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున నిధులను సమకూరుస్తామని మంత్రి తెలిపారు.

దేవినేని ఆగ్రహం

దేవినేని ఆగ్రహం

రాష్ట్ర అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. టిడిపి హయాంలోనే రాళ్ల సీమ అనంతపురం రతనాలసీమగా మారుతుందని చెప్పారు.

English summary
Minister Amarnath Reddy on Tuesday said that YSR Congress Party chief YS Jaganmohan Reddy's assets more than rs 2 lakh crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X