వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ సవాల్: ఆ ఎమ్మెల్యేలపై వేటేసి ఎన్నికలకు వెళ్ళండి, ఆ తీర్పును రెఫరెండంగా భావిస్తాం

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయంగా భావిస్తే పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ఎన్నికలకు వెళ్ళాలని వైసిపి అధినేత జగన్ టిడిపి అధినేత చంద్ర

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపును ముఖ్యమంత్తి చంద్రబాబునాయుడు విజయంగా భావిస్తే పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ఎన్నికలకు వెళ్ళాలని , ఆ ఎన్నికల ఫలితాలను తాము రెఫరెండంగా స్వీకరిస్తామని ఆయన ప్రకటించారు.

వైఎస్ఆర్ సిపి నుండి విజయం సాధించి టిడిపిలో చేరిన 21 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ఎన్నికలకు వెళ్ళాలని, ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను తాము రెఫరెండంగా భావిస్తామని జగన్ ప్రకటించారు. ఈ సవాల్ కు టిడిపి సిద్దమేనా అని ఆయన ప్రశ్నించారు.

ys jagan challenged to tdp chief chandrababu naidu

ఎంపిటిసి, జడ్ పి టి సి సభ్యులను కొనుగోలు చేసి చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆయన విమర్శించారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు కోట్లాది రూపాయాలను ఖర్చు చేశారని చెప్పారు. ఒక్కో ఎంపి టీసి , జడ్ పి టి సి సభ్యుడికి 20 నుండి 30 లక్షల రూపాయాలను వెచ్చించి కొనుగోలు చేశారని జగన్ ఆరోపించారు.

ప్రజా ప్రతినిధులను ప్రలోభపెట్టి విజయం సాధించారని చెప్పారు. దీన్ని తమ ఘనతగా చెప్పుకొంటున్నారని చెప్పారు.అక్రమ మార్గాల్లో గెలవడం ప్రజల అభిప్రాయామా, ఈ ఎన్నికల ద్వారా ప్రజల్లోకి ఏ రకమైన సందేశాన్ని పంపుతారని ఆయన ప్రశ్నించారు.

చంద్రబాబుకు అవినీతి గురించి మాట్లాడే హక్కులేదన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయాయన్నారు. బడ్జెట్ లో కేటాయింపులకు ఖర్చులకు పొంతన లేదన్నారు.

English summary
ys jagan challenged to tdp chief chandrababu naidu on monday.he demanaded to disqualify 21 mlas who joined in tdp from ysrcp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X