వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందుకే కష్టాలు వస్తాయని అబ్దుల్ కలాం చెప్పారు: జగన్

|
Google Oneindia TeluguNews

విజయవాడ: దివంగత, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా బుధవారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు.

అబ్దుల్ కలాం ఆలోచనలు, దూరదృష్టి భారత దేశానికి ఉపయోగపడ్డాయని, అతని ఆలోచనలు ఇంకా సజీవంగా ఉన్నాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వైయస్ జగన్ కూడా అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు.

YS Jagan and Chandrababu in twitter on Abdul Kalam's death anniversary

క‌లాం చెప్పిన మాటలను జ‌గ‌న్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా గుర్తు చేసుకున్నారు. మనలను మ‌నం మ‌రింత శ‌క్తిమంతులుగా రూపుదిద్దుకోవ‌డం కోసమే కష్టాలు వస్తాయని క‌లాం చెప్పేవార‌న్నారు. క‌లాం త‌న‌ ఆలోచనలు, చర్యలతో భార‌త్‌ని బలోపేతం చేశార‌న్నారు. క‌లాం న‌డిచిన బాట‌లోనే మ‌నం న‌డిస్తే అది ఆయ‌న‌కు మ‌న‌మిచ్చే ఉత్తమమైన శ్రద్ధాంజలి అన్నారు.

కాగా మిస్సైల్‌ మ్యాన్‌గా పేరొందిన అబ్దుల్‌ కలాం గతేడాది జులై 27న షిల్లాంగ్‌లోని ఐఐఎంలో ప్రసంగిస్తూ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన వర్ధంతి సందర్భంగా ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.

English summary
YS Jagan and Chandrababu in twitter on Abdul Kalam's death anniversary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X