'ఏపీపై కేంద్రానికి జగన్ ఫిర్యాదు, ఆగిపోయిన నిధులు, నిజం తెలిసింది'
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి పొందుతున్న కూలీల పొట్టగొట్టేలా వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారని టిడిపి ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు.
కడప: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి పొందుతున్న కూలీల పొట్టగొట్టేలా వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారని టిడిపి ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు.

అనివాశ్ రెడ్డి ద్వారా కేంద్రానికి ఫిర్యాదు
ఈ పథకం కింద దేశంలోనే ఎక్కడా లేనంతగా ఏపీలో పనులు చేపడుతుంటే అవకతవకల పేరిట వాటిని అడ్డుకునేందుకు, తన బంధువులైనా ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డిలతో కేంద్రానికి జగన్ ఫిర్యాదు చేయించారని ఆయన ఆరోపించారు.

నాలుగు నెలలుగా కూలీలు ఆగిపోయాయి, నిజం తెలిసింది
దీంతో గత నాలుగు నెలలకుగాను రాష్ట్రంలో కూలీలకు చెల్లించాల్సిన వేతనాలు సుమారు రూ.1100 కోట్లు ఆగిపోయాయని సీఎం రమేష్ తెలిపారు. వైసిపి ఎంపీల ఫిర్యాదుపై కేంద్రం విచారణ జరిపి ఏపీలో అవకతవకలు జరగలేదని తేల్చిందని అన్నారు.

త్వరలో విడుదల
త్వరలోనే రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల కానున్నాయని ఎంపీ సీఎం రమేష్ చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్ రైతులకు నీరివ్వడాన్ని జగన్ ఏమాత్రం ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు.

ఆళ్లగడ్డపై అఖిలప్రియ
ఆళ్లగడ్డను కల్చరల్ కేంద్రంగా తీర్చిదిద్దుతామని, అహోబిలంను టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేస్తామని మంత్రి అఖిలప్రియ కర్నూలులో చెప్పారు. వచ్చే నెల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, పర్యాటక శాఖలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, నవ్యాంధ్రను టూరిజం హబ్‌గా మారుస్తామన్నారు.
-
అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!! -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications