గతంలో చంద్రబాబు వ్యభిచారులన్నారు, తలసానిని అన్నావుగా..: జగన్, గవర్నర్‌కు ఫిర్యాదు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్‌ను కలవనున్నారు.
హైదరాబాద్/విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. మంత్రివర్గంలోకి వైసిపి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకోవడంపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
తాము గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేశామని చెప్పారు. గతంలో పార్టీ మారిన వారిని రాజకీయ వ్యభిచారులు అని చంద్రబాబు అన్నారని, ఈ వ్యాఖ్యలను తాము గవర్నర్‌కు గుర్తు చేశామన్నారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారితో చంద్రబాబు విమర్శలు చేశారని గుర్తు చేశారు.

ఇప్పుడు అదే చంద్రబాబు ఇంకో పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు పదవులు ఇచ్చారన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు సమంజసం కాదన్నారు. తలసాని విషయంలో గగ్గోలు పెట్టిన చంద్రబాబుకు ఇప్పుడు అది గుర్తుకు లేదా అని నిలదీశారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో భూమా అఖిలప్రియ, సుజయ కృష్ణ రంగారావు, అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డిలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు.
వీరికి ఆదివారం నాడు జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో చంద్రబాబు చోటు కల్పించారు. వైసిపి నుంచి పోటీ చేసి, పార్టీ మారిన వారికి పదవి ఎలా ఇస్తారని జగన్, వైసిపి నేతలు నిన్ననే ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఈ రోజు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications