విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ రోజు నాపై మాట్లాడలేదే, ఎవరింట్లోనే ఐటీ దాడులతో నీకేం భయం బాబూ! నీ ఇంట్లో..: జగన్

|
Google Oneindia TeluguNews

చీపురుపల్లి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం తీవ్రంగా మండిపడ్డారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని బహిరంగ సభలో మాట్లాడారు. ఐటీ సోదాలను రాష్ట్రంపై దాడిగా చెబుతున్న చంద్రబాబుకు తనపై సీబీఐ దాడులు జరిగినప్పుడు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.

చదవండి: జనసేనలో నాకూ అధికారంలేదు, బాధ్యతలు అప్పగిస్తే అలాగా, మీదే తప్పు: పవన్ ఆవేదన

సీబీఐ దాడులు జరిగినప్పుడు రాష్ట్రంపై దాడిగా కనిపించలేదా

సీబీఐ దాడులు జరిగినప్పుడు రాష్ట్రంపై దాడిగా కనిపించలేదా

అయ్యా చంద్రబాబూ, కాంగ్రెస్ పార్టీతో కలిసి నాపై కేసులు పెట్టినప్పుడు, తనపై సీబీఐ దాడులు జరిగినప్పుడు రాష్ట్రంపై దాడిగా కనిపించలేదా అని నిలదీశారు. తనను అరెస్ట్ చేసినప్పుడు కేంద్రం గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఐటీ సోదాలు జరిగితే కేబినెట్ మీటింగ్ పెట్టి మరీ చర్చించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ఎవరి మీదో ఐటీ దాడులు జరిగితే చంద్రబాబుకు భయమేంటి

ఎవరి మీదో ఐటీ దాడులు జరిగితే చంద్రబాబుకు భయమేంటి

అసలు ఎవరి మీదో ఐటీ దాడులు జరిగితే రాష్ట్రంపై యుద్ధంగా ఎందుకు చిత్రీకరిస్తున్నారో చెప్పాలని చంద్రబాబును జగన్ నిలదీశారు. గతంలో తనపై కుట్రపూరితంగా సీబీఐ కేసులు నీకు కనిపించలేదా అన్నారు. ఎవరింట్లోనో సోదాలు జరిగితే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. టీడీపీ నేతలు, ఎల్లో మీడియా కేంద్రంపై పోరాడుతున్న యోధుడిగా చంద్రబాబును చూపించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

Recommended Video

మంత్రి వర్గ సహచరులతో చంద్రబాబు అత్యవసర సమావేశం
తీగలాగితే చంద్రబాబు డొంక కదులుతుందనే

తీగలాగితే చంద్రబాబు డొంక కదులుతుందనే

ఏపీలో ఇసుక, భూములు అన్నింటా దోపిడీయే అని జగన్ అన్నారు. ైటీ సోదాలు జరిపితే దోపిడీ చేసిన నాలుగు లక్షల కోట్లు బయటకు వస్తాయని చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. ఎవరి కార్యాలయాల్లోనే ఐటీ రైడ్స్ జరిగితే చంద్రబాబు శివాలెత్తుతున్నారని, ఎందుకంటే తీగలాగితే చంద్రబాబు ఇంట్లో డొంక కదులుతుందని ఆయనకు భయం అన్నారు. ఆయన ఎందుకు వణికిపోతున్నారన్నారు.

కంప్యూటర్‌తోను అబద్దాలు

కంప్యూటర్‌తోను అబద్దాలు

పేదవాడి కోసం తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఒక అడుగు ముందుకేస్తే తాను రెండు అడుగులు వేస్తానని జగన్ చెప్పారు. తాను అధికారంలోకి వచ్చాక ఎన్ని లక్షలు ఖర్చయినా, అన్ని జబ్బులను ఆరోగ్యశ్రీ కిందకు తీసుకు వస్తానని చెప్పారు. అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థ ప్రక్షాళణ ఒక్క జగన్ వల్ల కాదని, అందుకు ప్రజల సహకారం కావాలన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను తక్కువ రేటుకు వేలం వేయడానికి బ్రోకరింక్ కోసం అమర్ సింగ్‌తో మంతనాలు జరిపిస్తారని విమర్శించారు. చంద్రబాబు కంప్యూటర్‌తోను అబద్దాలు చెప్పిస్తారన్నారు.

English summary
YSR Congress party chief YS Jagan counter to Chandrababu Naidu over IT raids, satire on 108 ambulance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X