వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంత దారుణమా?: ఆశ్చర్యపోయిన జగన్, అసంతృప్తి, సీనియర్లకు క్లాస్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర నేతలకు క్లాస్ పీకారని తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర నేతలకు క్లాస్ పీకారని తెలుస్తోంది. అలాగే వైయస్సార్ కుటుంబానికి నామమాత్రపు స్పందన లభించిన జిల్లా నేతల పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతి రైతులకు బంపరాఫర్: సింగపూర్‌కు 100 మంది, ఎందుకంటే, ఖర్చు ఇలా..అమరావతి రైతులకు బంపరాఫర్: సింగపూర్‌కు 100 మంది, ఎందుకంటే, ఖర్చు ఇలా..

టిడిపికి ధీటుగా వైసిపి

టిడిపికి ధీటుగా వైసిపి

ఇటీవలై వైసిపి.. వైయస్సార్ కుటుంబం పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. టిడిపి ఇంటింటికి తెలుగుదేశం పార్టీతో దూసుకెళ్తుంటే, వైసిపి వైయస్సార్ కుటుంబం పేరుతో జనాల్లోకి వెళ్తోంది. కానీ దీనికి కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్పందన లేదంటున్నారు. దీనిపై జగన్ ఆశ్చర్యపోయారు.

ఉత్తరాంధ్రలో తక్కువ

ఉత్తరాంధ్రలో తక్కువ

పదకొండు రోజుల్లై వైయస్సార్ కుటుంబంకు 50 లక్షల రిజిస్ట్రేషన్లు వచ్చాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో ఇది ఐదు శాతం లేదా అంతకంటే తక్కువగా ఉంది. ఇప్పటి వరకూ ప్రకాశం జిల్లా టాప్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇక్కడ సంతృప్తి

ఇక్కడ సంతృప్తి

అలాగే, తూర్పు గోదావరి, కర్నూలు, పశ్చిమ గోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో వైయస్సార్ కుటుంబం రిజిస్ట్రేషన్లు అధినేతకు కొంత సంతృప్తిని ఇచ్చాయి. కానీ ఉత్తరాంధ్ర, రాజధాని ప్రాంతం ఉన్న కృష్ణా జిల్లాలు మాత్రం ఆయనకు అసంతృప్తిని కలిగించాయని సమాచారం.

బొత్స, ధర్మానలకు జగన్ క్లాస్

బొత్స, ధర్మానలకు జగన్ క్లాస్

ప్రధానంగా ఉత్తరాంధ్రలో ఆశించిన విధంగా స్పందన లేకపోవడంపై జగన్ పార్టీ ముఖ్య నేతలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద రావు వంటి వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

రెండో ఫేజ్‌పై జగన్ దృష్టి

రెండో ఫేజ్‌పై జగన్ దృష్టి

వైయస్సార్ కుటుంబం రెండో ఫేజ్‌లో టార్గెట్ అందుకునేలా చూడాలని జగన్ ఉత్తరాంధ్ర నేతలకు సూచించారు. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర ఉంది. ఇలాంటి సమయంలో అన్ని జిల్లాల్లో పార్టీ బలంగా ఉండాలని జగన్ భావిస్తున్నారు.

English summary
YSR Congress’ latest initiative, YSR Kutumbham has garnered a poor response in registrations in Uttarandhra i.e., north coastal districts of the state. The party claims YSR Kutumbam got nearly 50 lakh registrations in 11 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X