వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కావాలంటే 'సాక్షి'పై చెక్ చేయండి: 'ఈనాడు'ను లాగిన జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌కు చెందిన సాక్షి పత్రికలో వాటాలను అధిక ధరలకు అమ్ముకున్నారని, దీనిద్వారా ఆయన వందల కోట్లు లాభపడ్డారని టిడిపి సభ్యులు సభలో ఆరోపించారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌కు చెందిన సాక్షి పత్రికలో వాటాలను అధిక ధరలకు అమ్ముకున్నారని, దీనిద్వారా ఆయన వందల కోట్లు లాభపడ్డారని టిడిపి సభ్యులు సభలో ఆరోపించారు. దీనిపై జగన్ ఘాటుగా స్పందించారు.

<strong>కడప ఓటమి ఎఫెక్ట్, జగన్-వైసిపి ఢీలా: 'టిడిపిలోకి వైసిపి ఎమ్మెల్యేలు.. టచ్‌లో'</strong>కడప ఓటమి ఎఫెక్ట్, జగన్-వైసిపి ఢీలా: 'టిడిపిలోకి వైసిపి ఎమ్మెల్యేలు.. టచ్‌లో'

సాక్షి అనే సంస్థ నేడు దేశంలోనే నంబర్ ఎనిమిదో స్థానంలో ఉన్న సంస్థ అని, కావాలంటే ఐఆర్ఎస్, ఏబీసీ రికార్డులు చెక్ చేసుకోవాలన్నారు. ఈనాడు అనే సంస్థ రూ.వంద షేరును రూ. 5 లక్షలా ఇరవై ఆరు వేల రూపాయలకు అమ్మారన్నారు.

ఈనాడు సంస్థపై..

ఈనాడు సంస్థపై..

రూ.1,800 కోట్ల ఆస్తులతో ఈనాడు సంస్థ ఉందని,. అటువంటి పరిస్థితుల్లో ఈనాడు వాల్యుయేషన్ కన్నా సగం ధరకే సాక్షి సంస్థ ఇన్వెస్టర్లకు షేర్లను ఇచ్చిందని, ఎక్కడా దీనిలో స్కాము లేదని జగన్ చెప్పారు.

అందరూ మంచోళ్లే

అందరూ మంచోళ్లే

ఇన్వెస్ట్ చేసిన వాళ్లంతా మంచోళ్లని తెలిపారు. ఇన్వెస్ట్ చేసిన వాళ్లంతా లాభాల్లోనే పయనిస్తున్నారన్నారు. ఈనాడులో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు నష్టపోలేదని, సాక్షిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు నష్టపోవాలా అని ప్రశ్నించారు. రికార్డులన్నీ మార్చుకునే ప్రయత్నం చేయాలని, తప్పుదోవ పట్టించే ప్రయత్నమే చేస్తున్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీ వల్లే బెయిల్

కాంగ్రెస్ పార్టీ వల్లే బెయిల్

జగన్ ఆస్తులపై ఏపీ అసెంబ్లీలో ర‌గ‌డ చెల‌రేగింది. అయిదేళ్లలో జ‌గ‌న్‌కు ఇన్ని ఆస్తులు ఎలా వ‌చ్చాయ‌ని మంత్రి అచ్చెన్నాయుడు అడిగారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని జ‌గ‌న్ అక్ర‌మంగా సంపాదించార‌ని ఆయ‌న ఆరోపించారు. ప‌దిహేడు నెల‌లు జైలులో ఉన్న జ‌గ‌న్ కు కాంగ్రెస్ పార్టీయే బెయిలు ఇప్పించింద‌న్నారు.

సోనియా ఇప్పించారు

సోనియా ఇప్పించారు

సోనియా గాంధీకి పాదాభివంద‌నం చేయ‌డం వ‌ల్లే జ‌గ‌న్‌కు బెయిల్ వ‌చ్చింద‌ని అచ్చెన్నాయుడు అన్నారు. అది నిజ‌మో కాదో జ‌గ‌న్ చెప్పాల‌ని నిలదీశారు. జ‌గ‌న్ కార‌ణంగా అధికారులు జైలుకెళ్లాల్సి వ‌చ్చింద‌ని మండిప‌డ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి హ‌యాంలోనే ఐఏఎస్‌లు చ‌ట్ట‌విరుద్ధ‌చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డార‌న్నారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy has dragged Eenadu after TDP leaders targetting Sakshi Daily.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X