వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై జగన్ అక్కసు: మారని సీమాంధ్ర నేతల తీరు

శని, ఆదివారాల్లో నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ‘అమరావతి’ నగరం వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/ అమరావతి: నాయకులెవరైనా.. ఎటువంటి పరిస్థితుల్లోనైనా.. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఏర్పాటైన పార్టీలు.. వాటి నాయకులకు తెలంగాణపై ఉన్న అక్కసు, వ్యతిరేకత బయటపెట్టుకుంటూనే ఉంటారు. దానికి ఆంధ్రప్రదేశ్ సీఎం - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడైనా.. విపక్ష నాయకుడు - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి వరకూ.. సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ నేతలైనా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కోస్తాంధ్ర నాయకులైనా.. ఆఖరుకు కమ్యూనిస్టు పార్టీలైనా తెలంగాణ అంటే అంత మంట మరి.

జాగ్రత్త! బాబును జగన్ తిట్టమంటున్నారు: రోజాకు వేదిక పైనే ఇలా.. (వీడియో)జాగ్రత్త! బాబును జగన్ తిట్టమంటున్నారు: రోజాకు వేదిక పైనే ఇలా.. (వీడియో)

శని, ఆదివారాల్లో నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని 'అమరావతి' నగరం వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. తన తండ్రి - ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే తెలంగాణ రాష్ట్ర విభజన సాధ్యమేనా? అని ప్లీనరీ వేదికగా వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆవిర్భవించి మూడేళ్లు దాటినా.. ఆంధ్రప్రదేశ్ విపక్ష నాయకుడు మరోసారి తెలంగాణ పట్ల వ్యతిరేకతను బయటపెట్టుకున్నారు.

2004 తర్వాత మారిన వైఎస్ వైఖరి

2004 తర్వాత మారిన వైఎస్ వైఖరి

గమ్మత్తేమిటంటే 1999లో వరుసగా రెండోసారి తెలుగుదేశం పార్టీ గెలుపొందిన తర్వాత.. చంద్రబాబు దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు దివంగత ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డే.. అది అధికార దండం చేపట్టేందుకు తెలంగాణ నినాదాన్ని ముందుకు తెచ్చిన ఘనత సాధించిన సంగతి ఆయన తనయుడు - ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డికి తెలిసి ఉండక పోవచ్చు. తెలంగాణ ప్రాంతాల ఎమ్మెల్యేలతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ ఇప్పించిన నేపథ్యం గల వైఎస్ రాజశేఖరరెడ్డి.. 2004లో ప్రస్తుత తెలంగాణ సీఎం - టీఆర్ఎస్ అదినేత కేసీఆర్, వామపక్షాలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన తర్వాత స్వరం మార్చారు.
క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వద్ద పరపతి పెంచుకుంటూ తెలంగాణ వాదాన్ని నీరుగార్చడానికి విశ్వ ప్రయత్నాలు సాగించారు. వివిధ సందర్భాల్లో తాను తెలంగాణకు అడ్డమూ కాదు నిలువూ కాదు అని వెటకారం చేస్తూ అడుగడుగునా తెలంగాణ ఏర్పాటుకు అడ్డం పడ్డ సంగతి అందరికీ తెలిసిందే. మరోవైపు తెలంగాణ సిద్ధాంతకర్తగా ప్రొఫెసర్ జయశంకర్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఢిల్లీ పెద్దలకు వివరించడంతో పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చిందన్న సంగతి ఇటు తెలంగాణ వాసులకూ.. అటు సీమాంధ్ర నేతలకూ తెలియని విషయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. తర్వాత జరిగిన పరిణామాల్లో వైఎస్ మరణం.. కేసీఆర్ దీక్ష... తదనంతరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.

ఏపీలో సీఎంగా చంద్రబాబు ఇలా

ఏపీలో సీఎంగా చంద్రబాబు ఇలా

తెలంగాణ ఆవిర్బావం తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చాయి. ఆంద్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం విపక్షాల పట్ల అనుచిత వైఖరి ప్రదర్శిస్తూ అణచివేతకు పూనుకుంటున్నారు. అప్పుడూ చంద్రబాబు, కే చంద్రశేఖర్ రావు అధికారం చేపట్టి మూడేళ్లవుతున్నది. మరో ఏడాది దాటితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల వాతావరణమే ముందుకు వచ్చేస్తుంది. ఈ క్రమంలో అమరావతికి శివారుల్లో నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన వైఎస్సార్‌ సీపీ ప్లీనరీ విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో పార్టీ నేతలు శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని రేకెత్తించారు. దీనికి తోడు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వంటి వారి రాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆశా కిరణం వంటిదని చెప్తున్నారు.

Recommended Video

Ysrcp Sitting MLA's Anxity For Tickets In 2019 Elections
బాబును ఢీ కొట్టడం తేలికేం కాదు

బాబును ఢీ కొట్టడం తేలికేం కాదు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహనరెడ్డి ప్లీనరీ ప్రారంభం నుంచి ముగిసే వరకూ వివిధ సందర్భాల్లో మాట్లాడుతూ ప్రజా పోరాటాలపై పార్టీ శ్రేణులకు అధినేత దిశానిర్దేశం చేశారు. అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమం కోసం తొమ్మిది పథకాలు అమలు చేయనున్నట్టు హర్షాతిరేకాల మధ్య ప్రకటించారు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన రాజకీయ చాణక్యం ముందు నిలబడటం అంత తేలికేం కాదన్న సంగతి గుర్తెరిగి వ్యవహరిస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

పాదయాత్రతో ప్రజల కష్టాలు తెలిసే చాన్స్

పాదయాత్రతో ప్రజల కష్టాలు తెలిసే చాన్స్

ప్రజల నాడి తెలుసుకునేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరే జగన్ పూనుకున్నారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో పాదయాత్ర చేయనున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. కడప జిల్లాలోని ఇడుపుల పాయ నుంచి మొదలయ్యే ఈ పాదయాత్ర.. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగుస్తుందని ప్రకటించారు. ఆరు నెలల పాటు సాగే ఈ పాదయాత్రజననేత పాదయాత్రలో పార్టీ శ్రేణుల బాగోగులు తెలుసుకోవడంతోపాటు ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. ఆనందోత్సాహాలు వ్యక్తం చేశాయి. వైఎస్‌ జగన్‌ తల్లి విజయమ్మ, ఆయన సోదరి షర్మిల రెండో రోజు ప్లీనరీకి హాజరయ్యారు. వారి ప్రసం‍గాలు పార్టీ నేతలు, కార్యకర్తలను ఆకట్టుకున్నాయి.

వైఎస్ మరణంపై విజయమ్మ ఇలా

వైఎస్ మరణంపై విజయమ్మ ఇలా

వైఎస్ జగన్ సోదరి వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ మాట తప్పడం తమ రక్తంలో లేదని, అబద్ధాలు ఆడటం తమకు చేతకాదని ఆమె చేసిన ప్రసంగం కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. '35 ఏళ్లు కాంగ్రెస్‌ పార్టీకి సేవ చేస్తే వారు ఏం చేశారో అందరికీ తెలుసు. రాజశేఖర్‌ రెడ్డి చలువతో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆయన చనిపోయిన తర్వాత మా కుటుంబం పట్ల కాంగ్రెస్‌ పార్టీ కఠినంగా వ్యవహరించింద'ని వైఎస్‌ విజయమ్మ చేసిన ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది. 'ఇప్పుడే ఎన్నికలు వచ్చాయని భావించి ప్రతి ఒక్కరూ పార్టీకోసం పనిచేసి రాజన్న స్వర్ణయుగం తేవాల'ని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు.

ప్లీనరీకి అతి తక్కువ బందోబస్తు

ప్లీనరీకి అతి తక్కువ బందోబస్తు

రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై పోలీసుల పక్షపాతం మరోసారి బయట పడింది. ప్లీనరీ సమావేశాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతారనే సమాచారం నిఘా వర్గాల ద్వారా ద్వారా ప్రభుత్వ పెద్దలకు అందింది. దీంతో ప్లీనరీ సక్రమంగా జరుగకూడదదనే కుట్రతో పోలీసు బందోబస్తును పూర్తి స్థాయిలో తగ్గించేశారు. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ పట్టించుకోకుండా, ప్లీనరీకి హాజరయ్యే జనాన్ని అదుపు చేయకుండా పూర్తిగా వదిలేశారన్న విమర్శలు వచ్చాయి. ప్లీనరీకి వేల మంది జనం హాజరు కావడంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కిక్కిరిశాయి. పోలీసులు మనకు సహకరించరని, మనమే క్రమశిక్షణతో మెలిగి ప్లీనరీని విజయవంతం చేసుకోవాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.

నాయకుల భద్రత గాలికి..

నాయకుల భద్రత గాలికి..

వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్లీనరీకి రెండు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, కార్యకర్తలు, భారీ స్థాయిలో హాజరవుతారనే సమాచారం ఉన్నా పోలీసులు అధికార పార్టీ నేతల ఆదేశాలతోనే భద్రతను గాలికొదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 7వ తేదీన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ జరుగుతున్న ప్రాంతానికి పక్కనే మాదిగల కురుక్షేత్ర మహాసభకు మందకృష్ణ మాదిగ పిలుపునివ్వడం, దాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని పోలీసు వాహనాన్ని సైతం దహనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ జాతీయ స్థాయి ప్లీనరీకి ప్రతిపక్ష నేత వైఎస్ .జగన్‌మోహన్‌రెడ్డి, ఆరుగురు ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడు, 47 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ముఖ్య నేతలు హాజరవుతారని తెలిసినా నామమాత్రంగా బందోబస్తు నిర్వహించారు. రాజధానిలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులకు భద్రత కల్పించాల్సిన పోలీసులే పక్షపాత ధోరణి అవలంభిస్తుండడం శోచనీయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

విశాఖ మహానాడుకు భారీ బందోబస్తు

విశాఖ మహానాడుకు భారీ బందోబస్తు

అధికార టీడీపీ ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమానికి డీజీపీ, అడిషనల్‌ డీజీపీ, ఐజీ, ఎస్పీలు వంటి ఉన్నత స్థాయి పోలీసు అధికారులతో పాటు, సుమారు 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొనే మహానాడుకు బందోబస్తు కొంచెం అధికంగా ఏర్పాటు చేసినా దానిని వైఎస్సార్‌సీపీ నేతలు ఎవరూ తప్పుబట్టలేదు. గత ఏడాది వైఎస్సార్‌సీపీ ప్లీనరీ జరిగిన ప్రాంతంలోనే చేనేత గర్జన జరగడం.. అందులో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సభకు సుమారు 300 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్లీనరీకి అతి తక్కువ మంది పోలీసులను కేటాయించడం చూస్తుంటే ప్రతిపక్షంపై వీరు ఏ స్థాయిలో కక్షపూరిత ధోరణి అవలంబిస్తున్నారో అర్ధమవుతోంది. ఆ వచ్చిన కొద్ది మందీ దూరంగా చెట్ల కింద కూర్చొని కబుర్లు చెప్పుకునేందుకే పరిమితం అయ్యారు. ప్లీనరీకి భారీగా జనం తరలి రావడంతో దీనిపై సమాచారం సేకరించేందుకు మాత్రం భారీ స్థాయిలో ఇంటిలిజెన్స్‌ పోలీసులను మఫ్టీలో మోహరించడం గమనార్హం.

English summary
Andhra Pradesh opposition leadear YS Jaganmohan Reddy expressed anti - Telangana Stance once YSR Congress Party pleenary in Amaravati. YSR Congress Party leaders also expressed to desire to get power. YS Sharmila & YS Vijayamma speeches are inspiration to YSR Congress party cadre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X