వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశమంతా తిరగనివ్వండి, బాధ్యత ఉంది: కోర్టుకు జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 YS Jagan
హైదరాబాద్: తనకు దేశవ్యాప్త పర్యటనలకు షరతులను సడలించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా, ఓ నియోజకవర్గ పార్లమెంటు సభ్యుడిగా ప్రజలకు సేవలందించాల్సి బాధ్యత ఉందని తెలిపారు.

తనపై నేరం ఇంకా రుజువు కానందున నియోజకవర్గానికి, పార్టీకి సేవలు అందించే హక్కులను కాలరాయరాదని కోరారు. ఇందుకు సంబంధంచి జగన్ రెండు పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ గురువారం విచారణకు వస్తుంది.

పర్యటనకు రెండు రోజుల ముందు సమాచారాన్ని అందచేయాలన్న షరతును సడలించాలని కోరుతూ జగన్ రెండో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కూడా కోర్టు ఈ రోజు విచారణ చేపట్టనుంది.

మరోవైపు ఈ నెల 8వ తేది నుండి 11 వరకు కడపకు వెళ్తున్నట్లుగా జగన్ కోర్టుకు సమాచారం అందించారు. ఆస్తుల కేసులో ఉన్న విజయ సాయి రెడ్డి అదే రోజు బెంగళూరు వెళ్లనున్నట్లు మెమో దాఖలు చేశారు.

కోర్టుకు తన పర్యటన విషయమై తెలిపిన జగన్ ఈ రోజు రాత్రి రైలులో హైదరాబాదు నుంచి కడపకు వెళ్లనున్నారు. వ్యక్తిగత కార్యక్రమాలతో పాటు, పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy filed two petitions with the special court for CBI cases on Wednesday requesting for relaxation of bail conditions so as to allow him to leave the state and review its condition that he should inform it two days in advance before a state tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X