విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెదబాబు పర్మిషన్.. చినబాబుకు కమిషన్..: కబ్జాకోరులంటూ జగన్ నిప్పులు

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు విశాఖ భూములపై కన్ను పడిందని ఆరోపించారు. అంతేగాక, చంద్రబాబు గజానికో కబ్జాకోరును తయారు చేశారని ధ్వజమెత్తారు.

గాంధీ జయంతి రోజు నుంచే నిరుద్యోగ భృతి అమలు: చంద్రబాబు, ఎంతంటే?గాంధీ జయంతి రోజు నుంచే నిరుద్యోగ భృతి అమలు: చంద్రబాబు, ఎంతంటే?

పెదబాబు పర్మిషన్.. చినబాబుకు కమిషన్..

పెదబాబు పర్మిషన్.. చినబాబుకు కమిషన్..

255వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సబ్బవరంలో జరిగిన బహిరంగసభలో జగన్ ప్రసంగించారు. అక్రమాలకు పెదబాబు పర్మిషన్ ఇస్తే.. చినబాబు కమిషన్ వసూలు చేసుకుంటాడని చంద్రబాబు, లోకేష్‌లనుద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు. పెందుర్తిలో పేదవాడి అసైన్డ్ భూములను లాక్కున్నారని మండిపడ్డారు.

రైతుల భూములు లాక్కుని.. తిరిగి వారికే..

రైతుల భూములు లాక్కుని.. తిరిగి వారికే..

అమ్మకానికి వీలులేని అసైన్డ్ భూములను చంద్రబాబు బినామీలతో తక్కువ ధరకే కొనుగోలు చేయించారని జగన్ ఆరోపించారు. అనంతరం ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల దగ్గర నుంచి భూములను లాక్కుని ప్రభుత్వానికి ఇచ్చారని అన్నారు. మళ్లీ అవే భూముల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 బాబు, లోకేష్ అండదండలు వారికే..

బాబు, లోకేష్ అండదండలు వారికే..

భూదందాలు చేస్తున్న నాయకులకు చంద్రబాబు, లోకేష్‌ల అందదండలు దండిగా ఉన్నాయని జగన్ అన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న అన్ని స్కాముల్లోనూ ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, పెదబాబు, చినబాబుల పాత్ర ఉందని ఆరోపించారు.

ఇలాంటి సీఎం అవసరమా?

వైయస్ చొరవతోనే సబ్బవరంలో దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీ ఏర్పాటైందని జగన్ తెలిపారు. పెందుర్తి నియోజకవర్గంలో మహిళపై దాడులు జరిగినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని జగన్ మండిపడ్డారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అసవరమా? అని జగన్ ప్రశ్నించారు.

English summary
YSRCP president YS Jaganmohan Reddy on Wednesday fired at Andhra Pradesh CM Chandrababu Naidu and Nara Lokesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X