వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నలుగురు నలుగురు పెళ్లాలు!: పవన్‌పై జగన్ తీవ్ర వ్యాఖ్యలు, ‘బాబు చేయని కుట్రలేదు’

|
Google Oneindia TeluguNews

Recommended Video

నలుగురు నలుగురు పెళ్లాలు!: పవన్‌పై జగన్ తీవ్ర వ్యాఖ్యలు

తూర్పు గోదావరి: ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ చేసిన ఏపీ బంద్‌ విజయవంతంగా జరిగిందని, ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా ఏపీ ఆకాంక్ష అని అన్నారు.

ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా అతి దారుణంగా ఏపీ బంద్‌ను చంద్రబాబు సర్కారు అణచివేయాలని చూసిందని ఆయన మండిపడ్డారు. ఏపీ బంద్‌ సక్సెస్‌ నేపథ్యంలో ఆయన తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని బంద్‌ను విజయవంతం చేశారని జగన్ చెప్పారు. ఇందుకు ఆయన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

దుర్గారావు మృతికి బాబే కారణం

దుర్గారావు మృతికి బాబే కారణం

ఏపీ బంద్‌లో భాగంగా వైయస్సార్‌సీపీ కార్యకర్త దుర్గారావు గుండెపోటుతో చనిపోయారని, ఆయన మరణానికి చంద్రబాబే కారణమని వైయస్‌ జగన్‌ అన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటాలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఏపీ బంద్‌ను విఫలం చేసేందుకు చంద్రబాబు చేయని కుట్రలు లేవని జగన్ మండిపడ్డారు. బంద్ ఆపేందుకు అన్ని ప్రయత్నాలు చేశారని అన్నారు. అన్ని జిల్లాల్లోనూ వందలాది మందిని అరెస్టులు చేశారని జగన్ చెప్పారు. బలవంతంగా బస్సులను నడిపేందుకు పోలీసులు ప్రయత్నించారని తెలిపారు.

చంద్రబాబుకు సిగ్గుశరం ఉంటే..

చంద్రబాబుకు సిగ్గుశరం ఉంటే..

తమ నాయకులు, కార్యకర్తలు పోలీసులు కాల్ పట్టుకుని ఈడ్చుకెళ్లారని జగన్ చెప్పారు. మహిళలను, విద్యార్థినులను కూడా ఈడ్చుకెళ్లారని మండిపడ్డారు. ఒకేసారి 25ఎంపీలు రాజీనామా చేస్తే హోదా వచ్చేదని, ప్యాకేజీ ఒప్పుకున్న చంద్రబాబు.. హోదా పోరాటాన్ని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు సిగ్గుశరం ఉంటే ఇప్పటికైనా హోదా పోరాటంలో కలిసి రావాలని అన్నారు. భావితరాలకు చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని అన్నారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.

బాబు ఒకవేళ స్వాతంత్ర్యం రాకముందు పుట్టివుంటే..

బాబు ఒకవేళ స్వాతంత్ర్యం రాకముందు పుట్టివుంటే..

చంద్రబాబు వేసే ప్రతి అడుగులోనూ రాజకీయ దురుద్దేశమే ఉందని జగన్ ఆరోపించారు. స్వాతంత్ర్యం రాకముందు చంద్రబాబు ఉండకపోవడం తమ అదృష్టమని లేదంటే.. స్వాతంత్ర్యం ఎందుకు? అని ప్రశ్నించేవారని జగన్ ఎద్దేవా చేశారు. బీజేపీకి మొట్టమొదటి నుంచి వ్యతిరేకంగా మాట్లాడుతున్నది తామేనని అన్నారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా పోరాడుతుంటే.. చంద్రబాబు ఎన్నికల ముందు బీజేపీ నుంచి వైదొలిగి ఇప్పుడు హోదా అంటున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు ఒకేసారి బీజేపీ, కాంగ్రెస్ లతో చెలిమి చేయగల సమర్థుడని ఎద్దేవా చేశారు.

పవన్‌పై తీవ్రంగా..

పవన్‌పై తీవ్రంగా..

ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పైనా జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమకు కూడా ఓ పది మంది ఎమ్మెల్యేలు ఉండి ఉంటే.. జగన్ మోహన్ రెడ్డిలా అసెంబ్లీ నుంచి పారిపోయేవాడిని కాదని, అసెంబ్లీని స్తంభింపజేసేవాడినని మూడు రోజుల క్రితం విజయవాడలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై జగన్ తీవ్రంగా స్పందించారు.

ఏపీని పొడిచేసిన ఆ ముగ్గురు..

ఏపీని పొడిచేసిన ఆ ముగ్గురు..

‘మన కర్మ ఏంటంటే.. ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడుతున్నా మనం వినాల్సి వస్తోంది. నిజంగా, ఇది మన కర్మే. నాలుగేళ్లు ఇదే పెద్దమనిషి చంద్రబాబునాయుడుతో, బీజేపీతో.. వాళ్లిద్దరితో కలిసి కాపురం చేశాడు. ఎన్నికలకు ఆరు నెలల ముందు టీడీపీ, బీజేపీల నుంచి పవన్ కళ్యాణ్ బయటకొచ్చి తాను పతివ్రతను అని గట్టిగా చెబుతున్నాడు. ఈ ముగ్గురూ కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని పొడిచేశారు. పొడిచిన తర్వాత నాలుగేళ్లు గమ్మున ఉన్నారు. కలిసికట్టుగా సంసారం చేశారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు బయటకొచ్చి ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారు. తప్పు చేసింది తాను కాదంటే తాను కాదని చెబుతున్నారు ' అని జగన్ మండిపడ్డారు.

నలుగురు నలుగురు పెళ్లాలు.. కార్లు మార్చినట్లు..

అంతేగాక, ‘పవన్ కళ్యాణ్ ఆరు నెలలకోసారి బయటకొస్తాడు. ఓ రోజు ఓ ట్వీట్ ఇస్తాడు. లేదంటే ఓ ఇంటర్వ్యూ ఇస్తాడు.. పోతాడు.. నాలుగేళ్లుగా మనం చూసింది అంతే. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో మాట్లాడటం మొదలు పెడితే.. దానికి మనం సమాధానం చెప్పాలంటే..ఎక్కడున్నాయి విలువలు?. విలువల గురించి పవన్ మాట్లాడతాడు.. నిజంగా తనకు ఎక్కడున్నాయి విలువలు? నలుగురు.. నలుగురు పెళ్లాలు. కొత్త కారును మార్చినట్టుగా పెళ్లాన్ని మారుస్తాడు. నాలుగేళ్లకోసారో ఐదేళ్లకోసారో పెళ్లాన్ని మారుస్తాడు. మీరో, నేనో ఈ పని చేస్తే.. ‘నిత్యపెళ్లికొడుకు' అని బొక్కలో వేస్తారా? లేదా? ఇది పాలీగామీ కాదా? ఇలాంటి వాళ్లు ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు బయటకొచ్చి.. తానేదో సచ్ఛీలుడను అని మాట్లాడతారు. ఇలాంటి వాళ్ల గురించి మనం సీరియస్‌గా తీసుకుని, వాళ్ల గురించి విశ్లేషించుకునే పరిస్థితికి రావడమంటే నిజంగా రాజకీయాల్లో ఇటువంటి పరిస్థితులు చూసినప్పుడు బాధేస్తుంది' అని జగన్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాగా, పవన్‌పై జగన్ ఈ స్థాయిలో విమర్శలు గుప్పించడం ఇదే తొలిసారి.

English summary
YSRCP president YS Jaganmohan Reddy on Tuesday fired at Andhra Pradesh CM Chandrababu Naidu and Janasena President Pawan Kalyan on special status issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X