వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడేళ్ల తర్వాత.. పరిణితి, కానీ రివర్స్!: జగన్ 'వ్యూహాత్మకం' దెబ్బతీసిందా?

వైయస్ జగన్మోహన్ రెడ్డి గరగపర్రు పర్యటన ఆయనకు కొత్త చిక్కులు తీసుకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. గరగపర్రు పర్యటనలో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గరగపర్రు పర్యటన ఆయనకు కొత్త చిక్కులు తీసుకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. గరగపర్రు పర్యటనలో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

చదవండి: అడవిలో.. బురదలో నడిచి: ఆ యాత్రలో జగన్ పెద్ద రిస్క్ ఇలా..!

కానీ ఇప్పుడు దానినే పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు. గరగపర్రులో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు దళితులను కొందరు అగ్రవర్ణాలు వెలివేసిన విషయం తెలిసిందే. ఇది వివాదానికి దారి తీసింది. జగన్ ఇటీవల ఆ గ్రామంలో పర్యటించారు.

మూడేళ్లకు భిన్నంగా.. వ్యూహాత్మకంగా మాట్లాడిన జగన్

మూడేళ్లకు భిన్నంగా.. వ్యూహాత్మకంగా మాట్లాడిన జగన్

గరగపర్రులో మాట్లాడిన జగన్ ఆచితూచి మాట్లాడారు. గత మూడేళ్లకు భిన్నంగా రాజకీయ చాతుర్యం ప్రదర్శించారనే వాదనలు వినిపించాయి. ఇటు అగ్రవర్ణాలను, అటు దళితులను దూరం చేసుకోకుండా వ్యూహం ప్రదర్శించారని అంటున్నారు. ఆయన మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచిందని అంటున్నారు.

ఇలా చాకచక్యంగా..

ఇలా చాకచక్యంగా..

గ్రామంలో పర్యటించిన జగన్ ఇటు అగ్రవర్ణాలను, అటు దళితులను ఆకట్టుకునేలా మాట్లాడారని అంటున్నారు. ఓ వైపు దళితులకు అండగా ఉంటానని, వారి వైపు నిలబడుతానని చెప్పారు. మరోవైపు, ఒకరిద్దరు చేసిన పనికి అందరినీ తప్పుపట్ట వద్దని మాట్లాడారు. తద్వారా అగ్రవర్ణాలు అందరినీ తప్పుబట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు.

గతం కంటే భిన్నంగా.. రాజకీయ పరిణితి..

గతం కంటే భిన్నంగా.. రాజకీయ పరిణితి..

ఏపీలో వైసిపి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత జగన్ అతి జాగ్రత్తగా, మంచి వ్యూహాత్మకంగా వ్యవహరించిన వాటిల్లో ఇది ఒకటి అని అంటున్నారు. ఇరువర్గాలను దూరం చేసుకోకుండా.. అందరు మెచ్చేలా మాట్లాడారనే అభిప్రాయం వ్యక్తమయింది. ఇక్కడ జగన్ రాజకీయ పరిణితి కనబరిచారనే వ్యాఖ్యలు వినిపించాయి. మొత్తానికి తన గరపగర్రు పర్యటన.. వైసిపిపై ఇరువర్గాలకు ఆగ్రహం తెప్పించకుండా మసలుకున్నారని, ఇంకా చెప్పాలంటే ఇరువర్గాలను ఆకట్టుకునేలా మాట్లాడారని అంటున్నారు.

ఇక్కడ ట్విస్ట్.. నిలదీసిన మాజీ ఎంపీ

ఇక్కడ ట్విస్ట్.. నిలదీసిన మాజీ ఎంపీ

గరపగర్రులో జగన్ తీరు పట్ల కాంగ్రెస్, మరికొందరు పార్టీ నేతలకు రుచించినట్లుగా కనిపించడం లేదంటున్నారు. అందుకు మాజీ ఎంపీ హర్ష కుమార్ వ్యాఖ్యలే నిదర్శనం అంటున్నారు. జగన్ గరపుగర్రులో పర్యటించినప్పటికీ నిరాశపరిచారని, సంఘటనను ఆయన ఎందుకు ఖండించలేదని, ఇది సరికాదని హర్ష కుమార్ వ్యాఖ్యానించారు. అలాగే, రాజకీయం కోసం ఇరువర్గాలను సంతృప్తిపరిచే మాటలు మాట్లాడే తప్ప ఆయన పర్యటన వల్ల ఒరిగేదేమీ లేదనే వారు కూడా ఉన్నారు.

English summary
Former MP Harsha Kumar has questioned YSR Congress Party chief YS Jaganmohan Reddy's attitude in Garapagarru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X