• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాకిచ్చిన జగన్..ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ లో 6 వేలకు పైగా ఇళ్ళ రద్దు జీవో జారీ

|

ఏపీలో అధికారంలో ఉన్న వైసిపి సర్కార్ చంద్రబాబు నాయుడికి మరో షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబుఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం క్రింద నిర్మించతలపెట్టిన పక్కా గృహాలను రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం చాలా నియోజకవర్గాల్లో నిరుపేదలకు గృహ నిర్మాణాలు చేపట్టింది. ఇక వాటి నిర్మాణానికి సరిపడా స్థలం లభించకపోవడంతో జగన్ సర్కార్ వాటిని రద్దు చేస్తూ జీవో జారీ చేసింది.

 రాష్ట్రవ్యాప్తంగా 6032 ఇళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

రాష్ట్రవ్యాప్తంగా 6032 ఇళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అనేక పథకాలకు చెల్లుచీటీ పడింది. ఇక తాజాగా నిరుపేదల కోసం నిర్మించతలపెట్టిన ఇళ్లను సైతం రద్దు చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం అటు టీడీపీ నేతలకే కాదు, ఇటు ప్రజలను సైతం షాక్ కి గురి చేస్తుంది. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 6032 ఇళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రజలకు సైతం షాక్ ఇస్తూ నిర్ణయం తీసుకున్న వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద రూ.100 కోట్లతో నియోజకవర్గంలో మంజూరైన 2 వేల ఇళ్లను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

పవన్ షాకింగ్ డెసిషన్: వైసీపీ సోషల్ మీడియాపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు..లీగల్ నోటీసులు?

చంద్రబాబు నియోజక వర్గ ప్రజలకు భారీ షాక్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం .. కుప్పంలో 2వేల ఇళ్ళు రద్దు

చంద్రబాబు నియోజక వర్గ ప్రజలకు భారీ షాక్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం .. కుప్పంలో 2వేల ఇళ్ళు రద్దు

ఇక అంతే కాదు కుప్పం తో పాటుగా కృష్ణాజిల్లాలోని కురుమద్దాలిలో 96 ఇళ్ళు, విశాఖ జిల్లా చోడవరం లో 3936 ఇళ్ళు కలిపి , మొత్తం రాష్ట్రంలో 304 కోట్ల విలువ చేసే ఇళ్ల నిర్మాణ పనులను రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో వెలువరించింది. ఇక కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు కేటాయించిన రెండు వేల ఇళ్ల నిర్మాణంలో భాగంగా ఇప్పటికే పరమాలపల్లె వద్ద 354 ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఇందులో చాలా వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్లను నాలుగు మండలాల్లో ఎక్కడ స్థలం దొరికితే అక్కడ మంజూరు చేసుకుంటూ పోయారు గత ప్రభుత్వంలోని అధికారులు . మరికొందరు లబ్ధిదారులకు వారి సొంత స్థలంలోనే ఇళ్లిచ్చారు. సార్వత్రిక ఎన్నికలకు కొద్దినెలల ముందు చంద్రబాబు ప్రభుత్వం సామూహిక గృహ ప్రవేశాలను సైతం నిర్వహించింది. అలాగే కుప్పం మండలంలోనే 2 వేల ఇళ్లకు పరిపాలనాపరమైన అనుమతులు కూడా ఇచ్చింది.

 స్థలం లేదని చెప్పి రద్దు... కొత్త ఇల్లు ఇస్తామని దరఖాస్తుల స్వీకరణ .. మండిపడుతున్న టీడీపీ

స్థలం లేదని చెప్పి రద్దు... కొత్త ఇల్లు ఇస్తామని దరఖాస్తుల స్వీకరణ .. మండిపడుతున్న టీడీపీ

ఇళ్ళ నిర్మాణం కోసం ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన గత సర్కార్ స్థల లభ్యత తక్కువగా ఉండటంతో జీ ప్లస్ టూ తరహాలో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

దీంతో ఒక్కో ఇంటి వ్యయాన్ని రూ.4.5 లక్షలుగా పేర్కొంది. దీనితో పాటు ప్రతి ఇంటికీ మౌలిక సదుపాయాలకు మరో రూ. 50 వేలు కేటాయించింది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల వంతున మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.100 కోట్లకు చేరింది. ఒక కుప్పం నియోజకవర్గంలోనే వందకోట్ల నిర్మాణ పనులను చేపట్టిన నేపథ్యంలో నిర్మాణానికి తగిన స్థలం లేదని రద్దు చేస్తున్నట్లు జీవోలో పేర్కొంది. ఇక ఇల్లు లేని నిరుపేదలకు కొత్తగా ఇళ్లను మంజూరు చేస్తామంటూ మళ్లీ దరఖాస్తులు తీసుకుంటోంది గృహనిర్మాణశాఖ. గత ప్రభుత్వం కేటాయించిన ఇళ్లను రద్దుచేసి తిరిగి కొత్తగా మంజూరు చేస్తామని చెప్పడంతో ప్రజలు షాక్ కు గురవుతున్నారు. ఇళ్లు లేని పేదవారందరికీ ఇళ్లను మంజూరు చేసి, ఉగాది నాటికి ఇంటి పత్రాలు జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.

అయితే నిరుపేదల ఇళ్ళ విషయంలోనూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

English summary
YCP government gave gave another shock to Chandrababu, . Jagan govt has issued a statewide cancellation of houses built under the ChandrababuNTR housing scheme. Prior to the last general election, the Chandrababu government took up housing for the poor in most constituencies. Jagan government canceled them and G.O issued them as they did not have enough space for their construction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X