కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ జగన్ ఆర్నెల్లలో 35 వేల కోట్ల అప్పు చేశారు, లక్షా యాభైవేల కోట్ల ఆదాయం పోయింది, వైజాగే దూరం..

|
Google Oneindia TeluguNews

సీఎం జగన్ రాసిచ్చినా స్క్రిప్ట్ మీరు చదువుతారా అని బీసీజీ కమిటీని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. మూడు ముక్కలు అని జగన్ చెబితే.. మీరు ఆడతారా అని మండిపడ్డారు. అలాగే రాష్ట్రానికి 2.25 లక్షల కోట్ల అప్పు ఉందని అసత్యాలు వల్లెవేశారని చెప్పారు. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం 6 నెలల్లోనే 35 వేల కోట్ల అప్పు చేసిందన్నారు. మళ్లీ అప్పుచేద్దామనుకుంటే పుట్టడం లేదని చెప్పారు. ఎవరికైనా ఆదాయం వస్తే అప్పు ఇస్తారు. లేదంటే ఎవరిస్తారు అని అడిగారు.

బోస్టన్ కమిటీ నివేదిక తప్పుల తడక, అసత్యాల పుట్ట, ప్రభుత్వం చెప్పిందే బొంకింది: చంద్రబాబుబోస్టన్ కమిటీ నివేదిక తప్పుల తడక, అసత్యాల పుట్ట, ప్రభుత్వం చెప్పిందే బొంకింది: చంద్రబాబు

భవనాలు లేవా..?

భవనాలు లేవా..?

అమరావతి నిర్మించేందుకు ఎక్కువ ఖర్చవుతోందని ప్రభుత్వ పెద్దలు అసత్యాలు చెప్తున్నారు. లక్షా 10 వేల కోట్లు అవసరమవుతాయని లెక్కలు వేస్తున్నారు...అమరావతిలో సచివాలయం లేదా, అసెంబ్లీని చూడలేదా, హైకోర్టు కనిపించడం లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. మళ్లీ కొత్తగా నిర్మించాల్సిన అవసరం ఏముందని అడిగారు.

నిర్మాణాలు లేవా..

నిర్మాణాలు లేవా..

లక్షా 10 వేల కోట్ల సాగునీటి ప్రాజెక్టులకు పెడితే సరిపోతుందని ప్రతిపాదించారు. రాజధాని అమరావతిలో రూ.10 వేల కోట్ల పనులు చేసింది కనిపించలేదా అని అడిగారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అగ్రిమెంట్ చేసిన సంగతి మరచిపోయారా అని నిలదీశారు.

కుట్రపూరితంగా..

కుట్రపూరితంగా..


అమరావతి రాజధాని ఏర్పటయ్యాక ఎస్ఆర్ఎం, విట్, అమిటీ, స్కూళ్లు, హోటళ్లు, ఆస్పత్రులు వచ్చాయని చంద్రబాబు గుర్తుచేశారు. రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వం కూడా భాగస్వామ్యమైందని.. కానీ వారిని పంపించేసి, కుట్రపూరితంగా రాజధాని మార్పు చేపట్టబోతున్నారని పేర్కొన్నారు. సౌతాఫ్రికా, జర్మనీకి మూడు రాజధానులు ఉన్నాయని చెప్పడం హ్యాస్యాస్పదమని చెప్పారు.

సరికాదు.

సరికాదు.

ఏపీ ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్టుకు గుడ్డిగా సంతకం పెట్టారని, ఇదీ మంచి పద్ధతి కాదని బీసీజీ కమిటీకి చంద్రబాబు సూచించారు. తమ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.74 వేల కోట్ల కేటాయించామన్నారు. అమరావతి నిర్మాణానికి 40 ఏళ్లు పడుతుందని అసత్యాలు చెప్పారని.. హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి 25 ఏళ్లు పట్టిందనే సంగతి మరచిపోయారా అని అడిగారు. అమరావతిలో 32 వేలకు స్క్వేర్ ఫిట్ పలికిందని, ప్రభుత్వ భూమికి లక్షా యాభై వేల కోట్ల ఆదాయం వచ్చేదని, రాజధాని రైతుల నోట్ల మట్టి కొడతారా అని ఆగ్రహాం వ్యక్తం చేశారు.

విశాఖ దూరం

విశాఖ దూరం

ఏపీ సీఎం జగన్ ప్రతిపాదించే రాజధాని అందరికీ దూరం అని చంద్రబాబు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలే విశాఖ కన్నా దగ్గర అని పేర్కొన్నారు. కర్నూలు నుంచి 915 కిలోమీటర్ల దూరం అని, అదే కుప్పం నుంచి 950 కిలోమీటర్లు అని పేర్కొన్నారు. తన నియోజకవర్గ ప్రజలు వైజాగ్ వెళ్లడం కన్నా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్లడమే ఈజీ అని చెప్పారు. కడప జిల్లాకు 730 కిలోమీటర్ల దూరం అని, పులివెందుల 795 కిలోమీటర్లు అని చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు. తన సొంత జిల్లా, నియోజకవర్గంపై కూడా జగన్ జాలీ చూపించలేదన్నారు. దీనిని తిక్క అనకుంటే ఏం అంటాం అని మండిపడ్డారు.

English summary
ys jagan govt take lend 35 thousand crores tdp chief chandrababu naidu said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X