కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఊరపంది ఆలోచన, అందుకే మోడీకి నోటీసు: జగన్‌పై ఆదినారాయణ దారుణ వ్యాఖ్యలు, వీడియోపై..

|
Google Oneindia TeluguNews

కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత ఆదినారాయణ రెడ్డి శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ దగుల్బాజీ ఆలోచనల వల్ల ప్రధాని నరేంద్ర మోడీకి నోటీసులు వచ్చాయని విమర్శించారు.

రామసుబ్బారెడ్డికి, నాకు చెరీ సగం, బాబే పంచుకోమన్నారు: ఆదినారాయణ వీడియో ప్రకంపనలు రామసుబ్బారెడ్డికి, నాకు చెరీ సగం, బాబే పంచుకోమన్నారు: ఆదినారాయణ వీడియో ప్రకంపనలు

జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి చేతులు కట్టుకొని శుక్రవారం కోర్టుకు వెళ్తున్నారని మండిపడ్డారు. అదే సమయంలో తనపై వచ్చిన వీడియో ఆరోపణలను కూడా ఆయన తీవ్రంగా ఖండించారు.

మోడీని ఇంటర్నేషనల్ కోర్టుకు లాగిన జగన్: ఏమిటీ ఇందూ టెక్, జగన్‌కు రూ.కోట్లు?మోడీని ఇంటర్నేషనల్ కోర్టుకు లాగిన జగన్: ఏమిటీ ఇందూ టెక్, జగన్‌కు రూ.కోట్లు?

వీడియోపై ఆదినారాయణ ఘాటుగా

వీడియోపై ఆదినారాయణ ఘాటుగా

చంద్రబాబు నాయుడు తమను పనుల్లో చెరో అర్ధరూపాయి చొప్పున పంచుకోమని చెప్పారని ఆదినారాయణ రెడ్డి చెప్పినట్లుగా ఉన్న వీడియో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వైసీపీ, జగన్ పత్రిక సాక్షిలో అయితే.. చంద్రబాబు అవినీతి చేసుకోమన్నారని రాశారు. దీనిపై ఆదినారాయణ ఘాటుగా స్పందించారు.

 అంత నీచంగా కనిపిస్తున్నామా

అంత నీచంగా కనిపిస్తున్నామా

తాను, రామసుబ్బా రెడ్డి ఎలాంటి ప్రతిపాదనలు పెట్టినా ముఖ్యమంత్రి అంగీకరిస్తామని చెప్పారని ఆదినారాయణ రెడ్డి అన్నారు. కానీ వాటాల గురించి మాట్లాడలేదని అభిప్రాయపడ్డారు. తాము వాటాలు పంచుకునేంత నీచంగా కనిపిస్తున్నామా అని ప్రశ్నించారు.

ప్రలోభపెట్టి జగన్ ఐఏఎస్‌లను ముంచాడు

ప్రలోభపెట్టి జగన్ ఐఏఎస్‌లను ముంచాడు

రాయలసీమలో హైకోర్టు కోసం లాయర్లు పోరాడుతున్నారని ఆదినారాయణ రెడ్డి చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఐఏఎస్ అధికారులను ప్రలోభ పెట్టి, భయపెడ్డి జగన్ వారిని ముంచాడని మండిపడ్డారు. అలాంటి వారు ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరమన్నారు.

కేసులున్న విజయసాయి రెడ్డి విమర్శలు చేయడమా

కేసులున్న విజయసాయి రెడ్డి విమర్శలు చేయడమా

ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు, ఇతర అధికారులపై వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి వ్యాఖ్యలు సరికాదని ఆదినారాయణ రెడ్డి అన్నారు. 13 కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్, విజయసాయి రెడ్డిలు అధికారులపై విమర్శలు చేయడమా అని ప్రశ్నించారు.

ఇలాంటి వారు బయటపడినట్లు చరిత్రలే లేదు

ఇలాంటి వారు బయటపడినట్లు చరిత్రలే లేదు

తాను అనని మాటలను, వక్రీకరించి విజయ సాయి రెడ్డి పిచ్చిప్రేలాపనలు పేలుతున్నారని ఆదినారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. ఇన్ని కేసులు ఉన్న వ్యక్తులు బయటపడినట్లు చరిత్రలోనే లేదని జగన్, విజయ సాయి రెడ్డిలను ఉద్దేశించి అన్నారు.

జగన్‌వి ఊరపంది ఆలోచనలు

జగన్‌వి ఊరపంది ఆలోచనలు

ఇన్ని కేసులు ఉన్న వైసీపీ అధినేత జగన్‌ను భారతీయ జనతా పార్టీ దగ్గరకు రానివ్వదని ఆదినారాయణ రెడ్డి అన్నారు. జగన్‌వి ఊరపంది ఆలోచనలు అన్నారు. తమను విమర్శించే శక్తిని జగన్ ఎప్పుడో కోల్పోయారన్నారు. ఇప్పటికే ఏ2 నిందితుడు విజయసాయి రెడ్డికి రాజ్యసభ అవకాశం కల్పించారని, ఈసారి ఏ3కి అవకాశమిస్తారా అని ప్రశ్నించారు.

English summary
Andhra Pradesh TDP leader and Minister Adinarayana Reddy on Friday make hot comments on YSRCP chief YS Jagan Mohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X