వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్గెట్ 2019: యువ ఓటర్లే లక్ష్యం, టిడిపి తరహలోనే జగన్ ప్లాన్ ఇదే!

యువ ఓటర్లను ఆకర్షించేందుకు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న వైసీపీ యువ ఓటర్లను ఆకర్షిస్తే రాజకీయంగా ప్రయోజనంగా ఉంటుందని భావిస్తోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:యువ ఓటర్లను ఆకర్షించేందుకు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న వైసీపీ యువ ఓటర్లను ఆకర్షిస్తే రాజకీయంగా ప్రయోజనంగా ఉంటుందని భావిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాలేజీల్లో యువభేరీలను నిర్వహిస్తోందని ఆ పార్టీ వర్గాలు అబిప్రాయంతో ఉన్నాయి.

2019 ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ పలు కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది. ఈ నెల 6వ, తేది నుండి వైఎస్ జగన్ పాదయాత్ర నిర్వహించనున్నారు.

పాదయాత్రతో పాటు పార్టీ ముఖ్య నేతలంతా గ్రామల్లో పల్లెనిద్ర చేయనున్నారు. అంతేకాదు గ్రామాల్లో ప్రజల సమస్యలను తెలుసుకొనే ప్రయత్నం చేయాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. అదే సమయంలో యువ ఓటర్లను లక్ష్యంగా చేసుకొని ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. ప్రత్యేక హోదా కోసం పేరుతో కాలేజీల్లో యువభేరీ సమావేశాలను నిర్వహిస్తోంది.

యువ ఓటర్లకు గాలం వేసేందుకు

యువ ఓటర్లకు గాలం వేసేందుకు

రాష్ట్ర వ్యాప్తంగా యువ ఓటర్లను ఆకర్షించేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా జగన్ యువభేరీ సమావేశాలు నిర్వహించారు.దీంతో పాటుగా ఎక్కడికక్కడే స్థానిక నేతలంతా యువభేరీ సమావేశాలను నిర్వహించాలని వైసీపీ చీప్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. 2014 ఎన్నికల సమయంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన హమీలు అమలు చేసిందా లేదా అనే విషయాలపై కాలేజీల్లోని విద్యార్థులకు అవగాహన కల్పించేలా వైసీపీ నేతలు ప్రచారం నిర్వహించనున్నారు.యువ ఓటర్లే లక్ష్యంగా ఈ ప్లాన్ వైసీపీ ఈ ప్లాన్ చేస్తోంది.

అధికారంలోకి వస్తే ఏ రకమైన అవగాహన

అధికారంలోకి వస్తే ఏ రకమైన అవగాహన

2019 అధికారంలోకి వస్తే ఏం చేయగమనే విషయమై వైసీపీ కాలేజీల్లో నిర్వహించే యువభేరీ సదస్సుల్లో అవగాహన కల్పించనున్నారు. ఇప్పటికే నవరత్నాలపై పాదయాత్రలో జగన్ విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. టిడిపి ఇచ్చిన హమీలు, అమలు తీరుపై ప్రచారం చేయనున్నారు. దీనికి తోడుగా నాడు వైఎస్ఆర్ సీఎంగా ఉన్న చేసిన పనులు తాము అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పనులపై కూడ వైసీపీ నేతలు విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.

ప్రత్యేక హోదాపై సెంటిమెంట్‌ను రగిల్చి

ప్రత్యేక హోదాపై సెంటిమెంట్‌ను రగిల్చి

ప్రత్యేక హోదాపై సెంటిమెంట్‌ను రగిల్చి రాజకీయంగా టిడిపిని దెబ్బతీయానే వ్యూహన్ని వైసీపీ అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక హోదాను ఏపీకి ఇవ్వకపోవడం వల్ల వచ్చిన నష్టాలు ఏమిటీ, ప్రత్యేక హోదా ఏపీకి ఇస్తే వచ్చే ప్రయోజనాలను వివరించనున్నారు. ప్రత్యేక హోదా కోసం తాము పోరాటం చేస్తామని వైసీపీ భరోసా కల్పించనుంది.

విద్యార్థులే టార్గెట్

విద్యార్థులే టార్గెట్

కాలేజీల్లో చదువుకొనే విద్యార్థులు కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకొన్నారు. అయితే కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకొన్నవారి నుండి మెజారిటీ ఓట్లను తమ వైపుకు తిప్పుకొనేందుకు వైసీపీ కాలేజీల్లో సదస్సులను నిర్వహిస్తోంది.టిడిపికి పట్టున్న జిల్లాల్లో వైసీపీ ఎక్కువగా యువ ఓటర్లపై కేంద్రీకరించింది.

టిడిపి తరహలోనే

టిడిపి తరహలోనే

2014 ఎన్నికలకు ముందు టిడిపి కూడ ఇదే తరహలో వ్యవహరించింది. కొత్త ఓటర్లకు టిడిపి పాలన గురించి తెలిసి రావాలనే ఉద్దేశ్యంతో యువ ఓటర్లను లక్ష్యంగా ఆ సమయంలో టిడిపి కార్యక్రమాలను నిర్వహించింది. ప్రస్తుతం వైసీపీ కూడ అదే తరహలో కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

English summary
YS Jagan will highlight the need for special category status to Andhra Pradesh and stress on the failure of the State and Central governments of not able to grant special status to the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X