వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'నోరి జారితే వెనక్కి తీసుకో': జడ్జిమెంట్‌పై మాట్లాడుతా.. జగన్ సవాల్, గందరగోళం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయగలరని వైసిపి అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై సభలో సోమవారం దుమారం చెలరేగింది. దీనిపై స్పీకర్ కోడెల శివప్రసాద రావు మాట్లాడుతూ... ఇలాంటి వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. జగన్ తెలిసి మాట్లాడారో, తెలియక మాట్లాడారో కానీ విచారం వ్యక్తం చేయాలన్నారు.

దానికి జగన్ మాట్లాడుతూ... నేను వ్యవస్థ అనలేదని, వ్యవస్థలు అన్నానని చెప్పారు. రికార్డ్ చూడాలని, నేను వ్యవస్థ అంటే రాజీనామా చేస్తానని, వ్యవస్థలు అంటే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు. తన సవాల్‌కు ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. తన వ్యాఖ్యలు వక్రీకరించారని జగన్ సవాల్ చేశారు.

స్పీకర్ కోడెల మాట్లాడుతూ.. మీరే వ్యవస్థలు అని ఒప్పుకున్నారని, వ్యవస్థలు అంటే అన్నీ వస్తాయన్నారు. బుకాయించే ప్రయత్నాలు చేయవద్దన్నారు.

YS Jagan hot comments in AP Assembly

యనమల మాట్లాడుతూ.. జగన్ ఇష్టారీతిగా మాట్లాడటం సరికాదన్నారు. స్పీకర్ వ్యవస్థలు అంటే పూర్తిగా అర్థం చెప్పారన్నారు. వ్యవస్థల విషయంలో ఇష్టారీతిన మాట్లాడటం సరికాదన్నారు. జగన్ తాను అనుకున్నదే జరగాలనుకుంటున్నారన్నారు.

బిజెపి సభ్యుడు ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ.. జగన్ నాలుక జారారని, దానిపై విచారణ వ్యక్తం చేయాలన్నారు.

యనమల మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యవస్థలను కించపర్చిన, రాజ్యాంగాన్ని అవమానపర్చిన ప్రతిపక్ష నాయకుడు సభలో ఉన్నప్పుడు చర్చకు ఆస్కారం లేదన్నారు. ఆయన కచ్చితంగా క్షమాపణ చెప్పాలన్నారు. కావాలని కామెంట్ చేసే వ్యక్తిని ఈ సభ క్షమించకూడదన్నారు.

జగన్ మాట్లాడుతూ.. జడ్జిమెంటుల పైన కూడా మాట్లాడే హక్కు ఉందని వ్యాఖ్యానించారు. కావాలంటే రూల్స్ చూసుకోవాలన్నారు.

మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదన్నారు. జగన్ కొవ్వెక్కి అలా మాట్లాడుతున్నారన్నారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైసిపి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. తాను అన్ పార్లమెంటరీ పదం వాడితే వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. అయితే, న్యాయవ్యవస్థపై వ్యాఖ్యానించినందుకు జగన్ పైన చర్యలు తీసుకోవాలన్నారు.

దూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. జగన్‌‍కు బాధ కలిగితే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారని, కానీ అదే జగన్ ఎందుకు తగ్గడం లేదన్నారు. జగన్ కచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు. యనమల మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాక గందరగోళం ఎందుకు చేస్తున్నారు. వారి గొడవలో అర్థం లేదన్నారు. సభలో గందరగోళం ఏర్పడటంతో సభ పది నిమిషాలు వాయిదా పడింది.

English summary
YSRCP chief YS Jagan hot comments in AP Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X