శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'సైకో జగన్ పారిపోయారు, అలవెన్స్‌లు తీసుకోవద్దు, పవన్ కళ్యాణ్ నీ మాటేమిటి'

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉత్తరాంధ్ర ప్రజలు తరిమి కొట్టాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రజలను ఆదివారం కోరారు. జగన్ ఇప్పటి వరకు టిట్లీ తుఫాను బాధితులను పరామర్శించలేదని విమర్శించారు.

ఎదురుపడిన చంద్రబాబు-పవన్ కళ్యాణ్: 'నేను చిరంజీవిని కాదని వస్తే, మీరేం చేశారు!'ఎదురుపడిన చంద్రబాబు-పవన్ కళ్యాణ్: 'నేను చిరంజీవిని కాదని వస్తే, మీరేం చేశారు!'

సైకోలా మారిన వైయస్ జగన్ ప్రజల ఇబ్బందులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. అదే సమయంలో ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన కూడా విమర్శలు గుప్పించారు. ఉత్తారంధ్ర గురించి పదేపదే మాట్లాడే పవన్ తుఫాను బాధితుల గురించి ఒక్క మాట మాట్లాడలేదన్నారు. కాగా, పవన్ ఈ నెల 17, 18 తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు.

విజయసాయి రెడ్డికి పిచ్చి, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు

విజయసాయి రెడ్డికి పిచ్చి, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డికి పిచ్చి పట్టినట్లుగా ఉందని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతామని హెచ్చరించారు.

Recommended Video

కవాతుకు సిద్ధమౌతున్న జనసేన..!
జగన్ పారిపోయారు

జగన్ పారిపోయారు

ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న జగన్ టిట్లీ బాధితులను పరామర్శించలేదని, కాబట్టి ఆయనకు పాదయాత్ర చేసే అర్హత లేదని బుద్ధా వెంకన్న అన్నారు. ప్రజా సమస్యలపై స్పందించలేనటువంటి, ప్రజలు కష్టాల్లో ఉంటే హైదరాబాద్ పారిపోయినటువంటి జగన్‌కు ఎలాంటి అర్హత ఉందని ప్రజల గురించి మాట్లాడుతారని నిలదీశారు.

 మేం ఏసీ గదుల్లో కూర్చుంటే నిలదీయాలి

మేం ఏసీ గదుల్లో కూర్చుంటే నిలదీయాలి

వైయస్ జగన్ ప్రతిపక్ష నాయకుడు అని, అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష నేతగా జగన్‌కు అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంటుందని బుద్ధా వెంకన్న అన్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి మేం ఏదైనా తప్పులు చేస్తే, అధికారంలో ఉన్న మేం శ్రీకాకుళం వెళ్లకుండా ఏసీ రూముల్లో పడుకుంటే దానిని నిలదీయాల్సింది ప్రతిపక్ష నేత అన్నారు.

అలవెన్సులు తీసుకోవద్దు

అలవెన్సులు తీసుకోవద్దు

కానీ ఇవాళ ప్రతిపక్ష నేత జగన్ పారిపోయి, అధికారంలో ఉన్న చంద్రబాబు వెళ్లారని, కాబట్టి జగన్‌కు ప్రతిపక్ష నేతగా ఉంటే అర్హత లేదని బుద్ధా వెంకన్న అన్నారు. ఆయన వెంటనే ప్రతిపక్ష నాయకుడిగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా వచ్చే అలవెన్సులు కూడా తీసుకోవద్దని చెప్పారు. ప్రజలపై అభిమానం ఉంటే జగన్ ఇలా చేయాలన్నారు.

English summary
YSR Congress Party chief YS Jagan Mohan Reddy is behaving like psycho, Why Jana Sena chief Pawan Kalyan not visiting Srikakulam: Asks Buddha Venkanna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X