India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు ప్లేస్ జగన్ తో భర్తీ ? కేటీఆర్ వ్యాఖ్యల వెనుక దూరదృష్టి ! బూమరాంగ్ తాత్కాలికమే!

|
Google Oneindia TeluguNews

ఏపీ అభివృద్ధిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. గతంలో ఇతరత్రా అంశాలపై విమర్శలు చేసినా ఏపీలో అభివృద్ధిపై మాత్రం కేటీఆర్ ఎప్పుడూ కామెంట్స్ చేయలేదు. కానీ ఈసారి ఆయన చేసిన కామెంట్స్ ఏపీ ప్రభుత్వాన్ని సూటిగా తాకాయి. అంతే మంత్రులు, సలహాదారులు వరుసగా విరుచుకుపడ్డారు. దీంతో పగలు చేసిన కామెంట్స్ కు అర్ధరాత్రి ట్వీట్ రూపంలో ఆయన వివరణ ఇచ్చుకున్నారు. అయితే దీని వెనుక ఏముందనే ఆసక్తికర చర్చ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో సాగుతోంది.

కేటీఆర్ కామెంట్స్ చిచ్చు

కేటీఆర్ కామెంట్స్ చిచ్చు

గతంలో ఏపీ,తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టేలా పలు వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్. ఈసారి ఏపీ ప్రభుత్వం పరువు తీసేలా వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రోడ్లు లేవు, కరెంటు లేవు, నీళ్లు లేవంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. క్రెడాయ్ సదస్సులో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం మండిపడింది.

వెంటనే మంత్రులు రంగంలోకి తీవ్ర పదజాలంతో కౌంటర్లు ఇచ్చేశారు. మరికొందరైతే కేటీఆర్ వ్యాఖ్యల్ని వక్రీకరించి మరీ కౌంటర్లు వేశారు. చివరికి కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి అర్ధరాత్రి ట్వీట్ లో వివరణ ఇచ్చారు. దీంతో ఈ దుమారం ముగిసినట్లేనా అంటే కాదనే అనుకోవచ్చు.

కేటీఆర్ వ్యాఖ్యలవెనుక?

కేటీఆర్ వ్యాఖ్యలవెనుక?

తెలంగాణ సీఎం కేసీఆర్ తరహాలోనే కేటీఆర్ కూడా ముందస్తు వ్యూహం లేకుండా ఏదీ మాట్లాడరు. ఏదో కారణం లేకుండా సగటు రాజకీయ నేతల్లా వ్యాఖ్యలూ చేయరు. ముందుగా పెట్టుకున్న టార్గెట్ ప్రకారమే వ్యాఖ్యలు చేస్తారనే పేరు ఆయనకు ఉంది. అది సెంటిమెంట్ అయినా రాజకీయమైనా ఏదైనా సరే కేటీఆర్ వ్యాఖ్యలు చేశారంటూ దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతూనే ఉంటుంది.

తాజాగా కేటీఆర్ కామెంట్స్ పై ఏపీ మంత్రుల స్పందన కూడా అలాంటిదే. కేటీఆర్ ఓ వ్యాఖ్య చేశారంటే అది ఏదో ఉద్దేశంతో చేసిందే అని ప్రత్యర్ధులు భావిస్తుండమే దానికి కారణం. ఇప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వెనుక ఏముందనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో సాగుతోంది.

ఎన్నికల అజెండాలో భాగంగా

ఎన్నికల అజెండాలో భాగంగా

తెలంగాణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఎన్నికల ఏడాదిలోకి వచ్చేశారన్న మాట. దీంతో మరికొన్ని నెలల్లోనే ఎన్నికల నగారా మోగడం ఖాయం. దీంతో ఇప్పటి నుంచే ఎన్నికల అజెండా సెట్ చేసే పనిలో కేసీఆర్, కేటీఆర్ తండ్రీ కొడుకులు బిజీగా ఉన్నట్లు కనిపిస్తున్నారు.

తండ్రి కేసీఆర్ జాతీయ స్ధాయిలో బీజేపీని టార్గెట్ చేసే పనిలో బిజీగా ఉంటే.. కొడుకు కేటీఆర్ బీజేపీతో అంటకాగుతున్న జగన్ ను ఇలా టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా వచ్చే ఎన్నికలకు బీజేపీ టార్గెట్ గా అజెండా సెట్ చేసుకోవడంలో భాగంగానే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు స్ధానంలో జగన్?

చంద్రబాబు స్ధానంలో జగన్?

గతంలో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఎంట్రీ, కాంగ్రెస్ తో పొత్తుతో టీఆర్ఎస్ కు ఊపిరి పోశారు. అంతవరకూ ఎన్నికల్లో గట్టి అజెండా లేక ఇబ్బందులు పడుతున్న టీఆర్ఎస్ ను చంద్రబాబు కాంగ్రెస్ పొత్తుతో గట్టెక్కించారు. దీంతో చంద్రబాబును, కాంగ్రెస్ ను ఒకేసారి టార్గెట్ చేస్తూ టీడీపీ-కాంగ్రెస్ కూటమి గెలిస్తే ఆంధ్రా పార్టీలు తెలంగాణలో చక్రం తిప్పుతాయంటూ ఓటర్లను భయపెట్టి ఆ ఎన్నికల గట్టెక్కారు.

ఇప్పుడు చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో అంత క్రియాశీలకంగా కనిపించడంలేదు. కాబట్టి ఈసారి చంద్రబాబు స్ధానంలో జగన్ ను టార్గెట్ చేయడం ద్వారా ఎన్నికల అజెండా సెట్ చేసే పనిలో టీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా ముందుగానే జల వివాదాలతో జగన్ కు దూరమైన కేసీఆర్.. జాతీయ స్ధాయిలో బీజేపీతో పోరాడుతూనే, మరోవైపు వారి మిత్రుడైన జగన్ ను కూడా టార్గెట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే కేటీఆర్ యథాలాపంగా అన్నారని చెప్తున్న వ్యాఖ్యలు ఆయన నోటివెంట వచ్చినట్లు తెలుస్తోంది.

English summary
telangana minister ktr's comments on andhrapradesh developments creates treamours in telugu state political circles but it indicates his foresight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X