• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సీఎంగా వైఎస్ జగన్ అరుదైన ఘనత -దేశంలోనే తొలి వ్యక్తి -అపరిచితుడు కూడా: విష్ణుకుమార్ రాజు

|

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీని ఆగం పట్టించి, ప్రతిపక్ష స్థానం తనదేనని చాటుకోడానికి ఉవ్విళ్లూరుతోన్న బీజేపీ.. అధికార వైసీపీపై అదే పనిగా విమర్శలు సంధిస్తున్నది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యక్తిత్వం, మతాలపై కమలనాథులు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు తాజాగా విశాఖపట్నానికి చెందిన కీలక నేత, ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు.. సీఎంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

బ్యాగు సర్దేసిన సీఎం జగన్ -జనవరి 10 నుంచి విశాఖలో దుకాణం -చర్చిలో ప్రమాణం: ఎంపీ రఘురామబ్యాగు సర్దేసిన సీఎం జగన్ -జనవరి 10 నుంచి విశాఖలో దుకాణం -చర్చిలో ప్రమాణం: ఎంపీ రఘురామ

 దేశంలో ఏకైక సీఎం

దేశంలో ఏకైక సీఎం

అవినీతి అక్రమాలకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై 31 కేసులు, 11 సీబీఐ, 5 ఈడీ కేసులున్నాయని, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ మీద కూడా ఈ స్థాయిలో కేసులు లేవని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు గుర్తుచేశారు. కోర్టులు వెంటనే తీర్పు నిచ్చే పరిస్థితి లేదు కాబట్టే జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడని, ఒకే ఒక్క తీర్పు వస్తే గనుక జగన్ తాను ఉండాల్సిన నిజమైన చోటు జైలుకు వెళ్లడం పక్కా అని తిట్టిపోశారు. ప్రస్తుతం దేశంలో కోర్టు బెయిల్‌పై ఉండి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఏకక వ్యక్తి జగన్ ఒక్కడే అని, ఆ విధంగా ఆయనది అరుదైన ఘనతే అని బీజేపీ నేత ఎద్దేవా చేశారు. అంతేకాదు..

జగన్‌లో అపరిచితుడు..

జగన్‌లో అపరిచితుడు..

‘‘అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ లోని విచిత్రమైన మనిషి బయటకు వచ్చాడు. నిజానికి జగన్‌లో ఒక అపరిచితుడు కూడా దాగి ఉన్నాడన్న సంగతి నాకు ముందే తెలుసు. జగన్ వ్యక్తిత్వం, మనస్తత్వం గురించి ముందునుంచే నాకు అవగాహన ఉంది. ఆమధ్య ఆయన పిలిస్తే బలవంతం మీద వెళ్లి కలిశాను తప్ప.. జగన్ అంటే ఇష్టంతో కానేకాదు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నన్ని అన్యాయాలు, దౌర్జన్యాలు దేశంలో మరెక్కడా జరగడంలేదు. వైసీపీ దక్కిన 151 సీట్లు ఆ పార్టీ బలం అనుకుంటే పొరపాటు అవుతుంది. అది ముమ్మాటికి వాపు మాత్రమే. అసలు..

 నెత్తిన చేయి.. నుదుటిపై ముద్దు

నెత్తిన చేయి.. నుదుటిపై ముద్దు

ఎన్నికలకు ముందు ప్రజలపై జగన్ దొంగ ప్రేమ చూపించారు. కనబడిన ఎవ్వరినీ వదలకుండా నెత్తి మీద చెయ్యి వేసి, మొహం మీద ముద్దులు పెట్టి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని వేడుకున్నారు. సరేలే, ఆయనేదో అద్భుతమైన పాలన అందిస్తారనుకుని నమ్మి ఓట్లేస్తే.. ప్రజల నెత్తి మీద జగన్ వేసిన చెయ్యి భస్మాసుర హస్తం అని ఇప్పటికిగానీ తెలిసిరాలేదు.

 బోల్డులతో పోయేదానికి బుల్డోజరా?

బోల్డులతో పోయేదానికి బుల్డోజరా?

ఎన్నికలకు ముందు ఒకలా, ఎన్నికల తర్వాత మరోలా వ్యవహరిస్తోన్న జగన్ అధికారంలోకి వస్తూనే విధ్వంసాలకు దిగాడు. విజయవాడలోని ప్రజా వేదిక అనేది ఒక సెమీ ఇంజనీరింగ్ బిల్డింగ్. అంటే, నట్లు, బోల్టులు విప్పేసి వేరొక చోటికి ఈజీగా తరలించుకోవచ్చు. కానీ జగన్ లోని విచిత్రమైన మనిషి.. ఆ బిల్డింగ్ ను బుల్డోజర్లతో కూలగొట్టేదాకా ఊరుకోలేదు. ప్రజాధనంతో నిర్మించిన భవనాలు కూల్చేసిన సీఎం కూడా జగన్ ఒక్కడే'' అని విష్ణుకుమార్‌ రాజు పేర్కొన్నారు.

year ender 2020: సెక్స్ కలాపాలు -పట్టపగలే జోరుగా రతిక్రీడ -కండోమ్స్ వాడకంలో హైదరాబాద్ టాప్year ender 2020: సెక్స్ కలాపాలు -పట్టపగలే జోరుగా రతిక్రీడ -కండోమ్స్ వాడకంలో హైదరాబాద్ టాప్

English summary
andhra pradesh bjp state vice president, farmer mla vishnu kumar raju slams cm jagan and ysrcp. speaking to media at visakhapatnam on tuesday, raju alleges that jagan is the only chief minister in india who is ruling the state on court bail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X