వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమర్నాథ్ దీక్ష: వారి ప్రతివ్యూహానికి జగన్ విలవిల! (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు కేజీహెచ్ ఆసుపత్రిలో పార్టీ నేత గుడివాడ అమర్నాథ్ దీక్షను విరమింప చేశారు. అమర్నాథ్ విశాఖ రైల్వే జోన్ కోసం నాలుగు రోజుల పాటు దీక్ష చేశారు.

ఆదివారం సాయంత్రం పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు. సోమవారం జగన్ ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. అమర్నాథ్ దీక్ష పోలీసుల వ్యూహానికి భగ్నమైంది. కార్యక్రమానికి అద్భుతమైన ముగింపు ఇవ్వాలన్న ఆ పార్టీ నేతల వ్యూహాలను పోలీసులు తిప్పి కొట్టారు.

దీంతో, జగన్ వచ్చి మొక్కుబడిగా దీక్షను విరమింప చేసి వెళ్లిపోయారని అంటున్నారు. పోలీసులు దీక్షను భగ్నం చేశాకు.. ఆసుపత్రికి వచ్చి జగన్ దీక్షను విరమింప చేయడం చర్చనీయంగా మారింది. జగన్ రాక సందర్భంగా పోలీసులు కేజీహెచ్ వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

రైల్వే జోన్ కోసం దీక్ష

రైల్వే జోన్ కోసం దీక్ష

పోలీసుల ముందస్తు జాగ్రత్తలు ఇవీ రోగులు, ఆసుపత్రి ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేశాయి. ఆదివారం రాత్రి నుంచే పోలీసులు కేజీహెచ్‌ను స్వాధీనంలోకి తీసుకున్నారు. మెన్స్‌స్పెషల్‌ వార్డుకు వెళ్లే నలుచెరుగులా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

రైల్వే జోన్ కోసం దీక్ష

రైల్వే జోన్ కోసం దీక్ష

పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి ప్రతీ ఒక్కర్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఇద్దరు ఏసీపీల ఆధ్వర్యంల పలువురు ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు భద్రతా ఏర్పాట్లు చేశారు. రోగులతో పాటు ఉద్యోగులను సైతం వదల్లేదు.

 రైల్వే జోన్ కోసం దీక్ష

రైల్వే జోన్ కోసం దీక్ష

విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ గత ఐదురోజుల నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తోన్న జిల్లా వైసిపి అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్‌ను ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సోమవారం మధ్యాహ్నం పరామర్శించారు. అనంతరం దీక్షను విరమింప చేశారు.

 రైల్వే జోన్ కోసం దీక్ష

రైల్వే జోన్ కోసం దీక్ష

జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దీక్షకు దిగిన అమర్‌నాథ్‌ను ఆదివారం రాత్రి పోలీసులు అరెస్టు చేసి కేజీహెచ్‌కు తరలించారు. అయితే వైద్య సహాయం తీసుకోవడానికి అమర్నాథ్‌ నిరాకరిస్తూ వచ్చారు. వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్స్‌ను ఎక్కించాలని భావించినా వైసిపి నేతల విజ్ఞప్తి మేరకు మధ్యాహ్నం వరకు ఆగారు.

 రైల్వే జోన్ కోసం దీక్ష

రైల్వే జోన్ కోసం దీక్ష

హైదరాబాద్‌ నుంచి సోమవారం మధ్యాహ్నం విశాఖకు చేరుకున్న జగన్‌ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా కేజీహెచ్‌కు వచ్చారు. ముందుగా అమర్‌నాథ్‌ను పరామర్శించి, అతని ఆరోగ్యస్థితిని వైద్యాధికారులు డాక్టర్‌ మధుసూదనబాబు, డాక్టర్‌ శాస్త్రి, డాక్టర్‌ జయధీర్ బాబులను అడిగి తెలుసుకున్నారు.

 రైల్వే జోన్ కోసం దీక్ష

రైల్వే జోన్ కోసం దీక్ష

తదుపరి అమర్‌నాథ్‌కు శీతలపానీయం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. అనంతరం అమర్నాధ్‌కు వైద్యులు ఫ్లూయిడ్స్‌ ఎక్కించారు. జగన్‌ గంటసేపు అక్కడే ఉన్నారు. అమర్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

 రైల్వే జోన్ కోసం దీక్ష

రైల్వే జోన్ కోసం దీక్ష

పార్టీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... దీక్ష పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని జగన్‌కు వివరించారు. అమర్నాథ్‌ ఆరోగ్య స్థితి నిలకడగా ఉందని, మంగళవారం ఇంటికి పంపుతామని డాక్టర్‌ మధుసూదనబాబు చెప్పారు.

రైల్వే జోన్ కోసం దీక్ష

రైల్వే జోన్ కోసం దీక్ష

కాగా, జగన్‌ రాక నేపథ్యంలో కేజీహెచ్‌ వద్ద పోలీసులు తీసుకున్న ముందుజాగ్రత్త చర్యల వల్ల రోగులు, ఆసుపత్రి ఉద్యోగులు అవస్థలు పడ్డారు. గత రాత్రి నుంచే పోలీసులు తమ స్వాధీనంలోకి కేజీహెచ్‌ను తీసుకున్నారు.

 రైల్వే జోన్ కోసం దీక్ష

రైల్వే జోన్ కోసం దీక్ష

అంతకుముందు, జగన్ సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు సమయంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వైసిపి నాయకలు మళ్ల విజయప్రసాద్‌, తైనాల విజయ్‌కుమార్‌, గొల్ల బాబురావు, స్థానిక నాయకలు, కార్యకర్తలు విమానాశ్రయానికి వచ్చి స్వాగతం పలికారు.

English summary
YS Jagan makes Amarnath end fast in Visakha, slams Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X