నాంపల్లి కోర్టులో జగన్: షేక్ హ్యాండ్ ఇచ్చిన గాలి, కళ్లతోనే పలకరించిన సబితా..
హైదరాబాద్: అక్రమాస్తుల కేసుకు సంబంధించి వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఈరోజే ఓబులాపురం గనుల కేసు విచారణ కూడా ఉండటంతో గాలి జనార్దన్ రెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు.
పాదయాత్ర?: జగన్‌కు మినహాయింపు వద్దంటూ కోర్టులో సీబీఐ కీలక వాదనలు
జగన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమ్మడి ఏపీ మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కూడా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్, సబితా ఇంద్రారెడ్డి కోర్టు ప్రాంగణంలో ఒకరికొకరు ఎదురుపడ్డారు. దీంతో వీరిద్దరు కంటి సైగలతోనే పలకరించుకున్నట్లు తెలుస్తోంది.

ఇక గాలి జనార్దన్ రెడ్డి మాత్రం జగన్ వద్దకు వచ్చి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీఐపీలు కోర్టుకు రావడంతో కోర్టు ప్రాంగణంలోకి న్యాయవాదులను మినహా ఎవరినీ లోపలికి రానివ్వడం లేదు.
కాగా, వైఎస్ అధికారంలో ఉన్న సమయంలో కొందరు మంత్రులు, ప్రభుత్వాధికారుల సహకారంతో జగన్ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారనేది ప్రధాన అభియోగం. బెయిల్ రద్దు పిటిషన్‌పై
జగన్ కు ఊరట లభించినప్పటికీ.. కోర్టుకు హాజరయ్యే విషయంలో మాత్రం ఆయనకు మినహాయింపు లభించలేదు. దీంతో ప్రతీ శుక్రవారం ఆయన కోర్టు ఎదుట హాజరుకాక తప్పని పరిస్థితి.