వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్: జగన్‌పై పార్టీలో అసంతృప్తి? మార్చి 21 డెడ్‌లైన్, రెండింట్లో ఏది?

|
Google Oneindia TeluguNews

Recommended Video

Jagan Confused On Pawan Challenge

అమరావతి: కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. అవిశ్వాసం పెడదామా, పెడితే వచ్చే లాభమేమిటి, నష్టమేమిటి అనే అంశాలపై తర్జన భర్జన పడుతున్నారని తెలుస్తోంది.

సంక్షోభంలో ఉన్నాం, మాట్లాడొద్దు: బాబు కీలక వ్యాఖ్యలు, అఖిల పక్షం కాదు.. ట్విస్ట్సంక్షోభంలో ఉన్నాం, మాట్లాడొద్దు: బాబు కీలక వ్యాఖ్యలు, అఖిల పక్షం కాదు.. ట్విస్ట్

అవిశ్వాస తీర్మానంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సవాల్ విసరడం, దానికి వైసీపీ వెంటనే స్పందించడం, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు దీనిపై వెనక్కి తగ్గడం.. ఇన్ని పరిణామాల నేపథ్యంలో మనమే స్వీకరించిన సవాల్‌పై మౌనంగా ఉంటే బాగుండదని పార్టీలో చర్చ సాగుతోందట.

 ఇప్పుడు మౌనంగా ఉండలేం

ఇప్పుడు మౌనంగా ఉండలేం

వైసీపీ, టీడీపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చు కదా పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. దానికి వెంటనే జగన్ సై అన్నారు. అందుకు తగ్గ మద్దతును తాను కూడగడతానని పవన్ ధీటుగా స్పందించారు. దీంతో ఇప్పుడు మనం మౌనంగా ఉండటం సరికాదని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది.

 జగన్ ఇరకాటంలో పడేశారని

జగన్ ఇరకాటంలో పడేశారని

పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా పవన్ ప్రకటనకు స్పందించి ఆవేశపడ్డారనే చర్చ కూడా వైసీపీలో సాగుతోందట. ఇతర నేతలు స్పందిస్తే దానిని పవన్ సీరియస్‌గా తీసుకోకపోయి ఉండేవారని, జగనే స్వయంగా చెప్పడమే ఇరకాటంలో పడేసిందని అంటున్నారట.

 ముహూర్తం ఖరారయిందా?

ముహూర్తం ఖరారయిందా?

ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ తాను ఎంపీల మద్దతు కూడగడతానని చెప్పారు. దీనిపై జగన్ పార్టీ నేతలతో చర్చిస్తున్నారని తెలుస్తోంది. మార్చి 21వ తేదీన అవిశ్వాస తీర్మానం పెడతామని అంబటి రాంబాబు మంగళవారం ప్రకటించారు. ఇదే ముహూర్తమని చెబుతున్నారు. అయితే, టీడీపీని కూడా కలిసి రావాలని, అందుకు పవన్ ఒప్పించాలని మెలిక పెట్టడం గమనార్హం.

 రాజీనామా చేస్తారా, అవిశ్వాసం పెడతారా?

రాజీనామా చేస్తారా, అవిశ్వాసం పెడతారా?

ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలు ఏప్రిల్ 6వ తేదీన రాజీనామా చేస్తారని జగన్ ప్రకటించారు. అదే సమయంలో మార్చి 21న అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పారు. ఇందులో ఏదో ఒకటే జరుగుతుందా లేక రెండు జరుగుతాయా అనేది ఆసక్తికరంగా మారింది.

English summary
It is said that YSR Congress Party chief YS Jagan Mohan Reddy in dilemma on No Confidence Motion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X