హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యే రోజాకు గాయం: నిమ్స్‌కు తరలింపు, పరామర్శించిన జగన్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైసీపీ ఎమ్మెల్యే రోజా అరెస్ట్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ తప్పుబట్టారు. రోజాను అరెస్ట్ చేసిన నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాంపల్లి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎమ్మెల్యే రోజాను వైయస్ జగన్ పరామర్శించారు.

ఈ సందర్భంలో పోలీసు ఉన్నతాధికారులకు, వైఎస్ జగన్‌కు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఉన్నా రోజాను అరెస్టు చేస్తారా? ఓ ఎమ్మెల్యే పట్ల ప్రవర్తించే తీరు ఇదేనా? అని జగన్ మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా అరెస్టు సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్తత నెలకొంది.

సస్పెండైన ఎమ్మెల్యేను అసెంబ్లీ ఆవరణలోకి కూడా రానివ్వరా, సస్పైండైతే సభలోకి రాకూడదు గానీ అసలు అసెంబ్లీ ప్రాంగణంలోకి కూడా రానివ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. అరెస్టు విషయంలో పోలీసుల దారుణంగా వ్యవహరించారని వైసీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ys jagan mohan reddy meets mla roja in nampally police station

తాను నిరసన వ్యక్తం చేయడానికి రాలేదని, వైఎస్ఆర్‌సీఎల్పీ కార్యాలయాలనికి వెళ్లేందుకే వచ్చానని చెప్పినా వినకుండా రోజాను బయటకు గెంటేశారని ఆయన అన్నారు. మార్షల్స్ వ్యవహరించిన తీరును వైసీపీ ఎమ్మెల్యేలంతా తప్పుబట్టారు. ఎమ్మెల్యే రోజాను అరెస్టు సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో ఓ సమయంలో ఆమె స్పృహ కోల్పోయింది.

ఈ సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలకు, పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. అరెస్టు సమయంలో కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో రోజా కింద పడిపోయారు. ఈ తోపులాటలో ఎమ్మెల్యే రోజా కాలుకి గాయమైంది. స్టేషన్‌కు వెళ్లేలోపే ఆమె స్పృహతప్పి పడిపోయారు.

దాంతో ఆమెను పోలీసు స్టేషన్ నుంచి అంబులెన్సులో నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దీంతో తీవ్రంగా గాయపడిన నగరి ఎమ్మెల్యే రోజాను నాంపల్లి పోలీసు స్టేషన్ నుంచి నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

English summary
ys jagan mohan reddy meets mla roja in nampally police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X