వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ప్రపంచంలో చేయలేని పనులు, జగన్ సీఎం కాలేరు, రాజారెడ్డి నుంచి ఇదే'

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ జన్మలో ముఖ్యమంత్రి కాలేరని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సి గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ జన్మలో ముఖ్యమంత్రి కాలేరని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సి గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. త్వరలో ఎన్నికలు వస్తాయని, సీఎం అవుతానని జగన్ పగటి కలలు కంటున్నారన్నారు.

2019లో జరిగే ఎన్నికలలోను నారా చంద్రబాబు నాయుడే మరోసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. ప్రపంచంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని పనులు ఏపీలో చంద్రబాబు చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉండటం మన దురదృష్టకరమన్నారు.

జగన్‌పై నమ్మకం లేక..

జగన్‌పై నమ్మకం లేక..

రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు తమ పార్టీలో చేరుతున్నారని గాలి ముద్దుకృష్ణమ అన్నారు. ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, నాయకులకు జగన్ పైన పూర్తి నమ్మకం పోయిందని చెప్పారు.

రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు తమ పార్టీలో చేరుతున్నారని గాలి ముద్దుకృష్ణమ అన్నారు. ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, నాయకులకు జగన్ పైన పూర్తి నమ్మకం పోయిందని చెప్పారు.

రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు తమ పార్టీలో చేరుతున్నారని గాలి ముద్దుకృష్ణమ అన్నారు. ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, నాయకులకు జగన్ పైన పూర్తి నమ్మకం పోయిందని చెప్పారు.

వైసిపి అధినేత జగన్ తాత రాజారెడ్డి నుంచి మనువడు జగన్ వరకు అందరూ దళిత వ్యతిరేకులేనని మంత్రి రావెల కిషోర్ ధ్వజమెత్తారు.

రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని, జన చైతన్య యాత్రలు కూడా విజయవంతమయ్యాయని చెప్పారు. వీటిని ఓర్చుకోలేకనే జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడన్నారు. రాష్ట్రంలో ఎన్నికల్లో వైసిపి తుడిచి పెట్టుకుపోతుందన్నారు. అందుకే జగన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

జగన్ చర్చకు రావాలి

జగన్ చర్చకు రావాలి

కాగా, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని జగన్‌కు టిడిపి యువనేత నారా లోకేశ్‌ సవాల్‌ విసిరారు. టిడిపి ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీల అమలుపై చర్చించేందుకు సిద్ధమన్నారు.

జగన్‌పై తీవ్ర విమర్శలు

జగన్‌పై తీవ్ర విమర్శలు

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో జరిగిన గ్రామదేవత ప్రతిష్ట ఉత్సవంలో పాల్గొన్న లోకేశ్‌ జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణలో నివాసం ఉంటూ ఆంధ్రలో అభివృద్ధి జరగడంలేదని మాట్లాడుతున్నారన్నారు.

ఏపీలో గ్రామాలకు వచ్చి అభివృద్ధి చూడాలన్నారు. కుటుంబాన్ని కూడా వదిలి సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి సమర్థమైన సీఎం, ప్రభుత్వం ఉన్నాయని, కానీ ప్రతిపక్ష నేత మాత్రం సరైనవారు లేరన్నారు.

English summary
YS Jagan never become Chief Minister of AP, says AP Ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X