జగన్ సంచలన వ్యాఖ్యలు: సంతలో గొర్రెల్లా అంటూ చంద్రబాబుకు సవాల్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి. శనివారం గవర్నర్ నర్సింహన్‌ను పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
సంతలో గొర్రెల్లా తమ పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబునాయుడు కొంటున్నారని మండిపడ్డారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 నుంచి 30 కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబునాయుడు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు.
అవినీతి సొమ్ముతోనే చంద్రబాబునాయుడు తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని వైయస్ జగన్ ఆరోపించారు. జీవో 22తో కాంట్రాక్టర్లకు రూ. కోట్లలో లబ్ధి చేకూరుస్తున్నారని అన్నారు.

డబ్బులు దండుకునేందుకే ప్రాజెక్టుల అంచనాలు పెంచుతున్నారుని ఆరోపించారు. ఇసుక మాఫీయాలో ఎమ్మెల్యేలు, మంత్రులు వాటాలు పంచుకుంటున్నారని వైయస్ జగన్ ఆరోపించారు.
రాజధాని భూముల నుంచి ఇసుక రీచ్‌ల వరకు రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. పార్టీ ఫిరాయింపులపైనా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
చంద్రబాబుకు దమ్ముంటే టీడీపీలో చేర్పించుకున్న తమ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. తమ పార్టీ నుంచి 12మంది ఎమ్మెల్యేలు వెళ్లినంత మాత్రాన నష్టమేమీ లేదని చెప్పారు. తమ పార్టీ నుంచి మరో ముగ్గురు నలుగురు వెళ్లినా తేడా ఏమీ రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications