వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్గెట్ 2019: పాదయాత్రతో పవర్‌లోకి, పార్టీ నేతలతో జగన్ భేటీ

పాదయాత్రపై పార్టీ నేతలతో వైసీపీ చీఫ్ జగన్ అక్టోబర్ 11న, కీలక సమావేశంపాదయాత్ర తీరుతెన్నులపై పార్టీ నేతలతో చర్చించనున్న జగన్2019 ఎన్నికలే లక్ష్యంగా జగన్ ప్లాన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నవంబర్ 2వ, తేది నుండి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్రకు సన్నాహలు చేస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 11వ, తేదిన పార్టీ నేతలతో వైఎస్ జగన్ కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు.

వైసీపీ చీప్ వైఎస్ జగన్ పాదయాత్ర చేయాలని భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టేందుకు గాను వైసీపీ చీఫ్ జగన్ వ్యూహలను రచిస్తున్నారు. ఈ మేరకు పాదయాత్రను అస్త్రంగా ఎంచుకొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వైసీపీ చీఫ్ జగన్ పాదయాత్రను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.అయితే జగన్ పాదయాత్రపై పార్టీ నేతలపై చర్చించనున్నారు.

 పాదయాత్రపై పార్టీ నేతలతో జగన్ కీలక సమావేశం

పాదయాత్రపై పార్టీ నేతలతో జగన్ కీలక సమావేశం

పాదయాత్ర నిర్వహణ తీరుతెన్నులపై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పార్టీ నేతలతో చర్చించనున్నారు. ఈ మేరకు ఈ నెల 11వ, తేదిన పార్టీ సీనియర్లు, ముఖ్యులు, పార్టీకి చెందిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిశీలకులు, నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశం కానున్నారు.

ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు

ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు

వైఎస్‌ జగన్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పాదయాత్ర ఏర్పాట్లు, భవిష్యత్‌ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలకు ఎంపీ విజయసాయిరెడ్డి సమాచారం అందించారు.ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను పాదయాత్రలో ప్రజలకు వివరించనున్నారు వైసీపీ నేతలు. అంతేకాదు వైసీపీ ఇచ్చిన నవరత్నాల హమీని కూడ వైసీపీ నేతలు పాదయాత్రలో విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.

2019 ఎన్నికలే లక్ష్యంగా

2019 ఎన్నికలే లక్ష్యంగా

2019 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ భావిస్తున్నారు.2014 ఎన్నికల్లో చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా వైసీపీ జాగ్రత్తలు తీసుకొంటోంది.క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులకు అనుగుణంగా వైసీపీ తన వ్యూహలను మార్చుకొంటుంది. ఈ మేరకు ప్రశాంత్ కిషోర్ నివేదికలకు అనుగుణంగా పార్టీ వ్యూహలను సిద్దం చేస్తోంది.

పాదయాత్రలతో వపర్‌లోకి

పాదయాత్రలతో వపర్‌లోకి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్రలు నిర్వహించిన రాజకీయ నేతలు అధికారాన్ని చేపట్టిన చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సుదీర్ఘంగా పాదయాత్ర నిర్వహించి 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. మరోవైపు 2012లో చంద్రబాబునాయుడు పాదయాత్ర నిర్వహించి ఏపీ రాష్ట్రంలో 2014లో ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ జగన్ ప్రస్తుతం పాదయాత్రకు సిద్దమౌతున్నారు. గత చరిత్రను పునరావృతం చేస్తారా, లేదా అనేది 2019 ఎన్నికల ఫలితాలు నిర్ణయిస్తాయి.

English summary
Ysrcp chief ys Jagan will conduct meeting with party leaders on Oct 11, 2017. jagan will discussion in this meeting about paadayatra .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X