వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంగంలోకి అనిల్: వ్యూహం మార్చిన జగన్, వైసీపీ తాజా ప్లాన్ ఇదే!

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఇటీవల కాలంలో వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు జగన్ ప్రతి అవకాశాన్ని వినియోగించుకొనేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే జగన్ బంధువు బ్రదర్ అనిల్ కుమార్ కూడ రంగంలోకి దిగారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ సీఎం అయ్యేందుకు తన వంతు సహయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

జగన్‌కు షాక్: భరోసా ఇచ్చిన బాబు, టిడిపిలోకి బుట్టా రేణుక?జగన్‌కు షాక్: భరోసా ఇచ్చిన బాబు, టిడిపిలోకి బుట్టా రేణుక?

2019 ఎన్నికల్లో అధికారం చేపట్టేందుకు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ నవంబర్ రెండవ తేది నుండి పాదయాత్రను నిర్వహించనున్నారు. పాదయాత్రను విజయవంతం కావాలని తిరుపతికి వెళ్ళనున్నారు వైఎస్ జగన్.

జగన్‌కు షాక్: పాదయాత్రకు ముందే చెక్, బాబు మైండ్ గేమ్జగన్‌కు షాక్: పాదయాత్రకు ముందే చెక్, బాబు మైండ్ గేమ్

అంతేకాదు ఇటీవలనే త్రిదండి చినజీయర్ స్వామిని కూడ జగన్ కలిశారు. గతంలో పలుమార్లు కొందరు పీఠాధిపతులను జగన్ కలిశారు. 2014 ఎన్నికల ముందు చోటుచేసుకొన్న తప్పులను పునరావృతం కాకుండా జగన్ జాగ్రత్తలు తీసుకొంటున్నారు.అన్ని వర్గాలు తనకు సమానమనే సంకేతాలు పంపేందుకు వైఎస్ జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మారిన జగన్ వ్యూహం

మారిన జగన్ వ్యూహం

2014 ఎన్నికల్లో చోటు చేసుకొన్న తప్పులను తిరిగి చేయకుండా వైఎస్ జగన్ ప్రయత్నాలను ప్రారంభించారు.ఇటీవ‌ల హిందువుల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు స్వామీజీల చుట్టూ ప్ర‌ద‌క్ష‌ణ‌లు చేస్తున్న జ‌గ‌న్ త‌మ‌కు సాంప్ర‌దాయంగా ఉన్న క్రిస్టియ‌న్ల‌ను దూరం కాకుండా చూసుకునే బాధ్య‌త‌ను బ్ర‌దర్ అనీల్‌కు జ‌గ‌న్ అప్ప‌జెప్పిన‌ట్లు ప్రచారం సాగుతోంది.

అందరికీ ఒకే రకమైన సంకేతాలు

అందరికీ ఒకే రకమైన సంకేతాలు

అందరిని తాను ఒకే రకంగా చూస్తానన్న సంకేతాలను వైఎస్ జగన్ ఇస్తున్నారు.ఓ మతానికి దూరమైతే మరో మతానికి దగ్గర కాకుండా ఉండేందుకుగాను జగన్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. జగన్ బంధువు అనిల్ కుమార్ తన వంతు సహయం చేస్తున్నారనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమకు సంప్రదాయంగా అండగా ఉంటున్న వారిని కాపాడేందుకు అనిల్ చర్యలు చేపట్టారనే ప్రచారం సాగుతోంది.

సినీ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మతో సమావేశం

సినీ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మతో సమావేశం

ఎన్‌టిఆర్‌పై సినిమా తీయనున్నట్టు సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రకటించారు. అయితే ఈ సినిమాపై ఇప్పటికే వివాదం సాగుతోంది. అయితే ఈ వివాదాస్పద దర్శకుడు వర్మతో బ్రదర్ అనిల్ సమావేశం కావడం కూడ రాజకీయంగా కలకలాన్ని రేపుతోంది. వైఎస్ జగన్‌ను సీఎం చేసేందుకు తనకు కలిసివచ్చే ప్రతి అవకాశాన్ని అనిల్ వినియోగించుకొంటున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.వైఎస్ హయంలో చోటుచేసుకొన్న పరిణామాలపై సినిమా తీయాలని బ్రదర్ రామ్‌గోపాల్ వర్మను కోరినట్టు ప్రచారం కూడ సాగుతోంది.

జిల్లాల వారీగా అనిల్ సమావేశాలు

జిల్లాల వారీగా అనిల్ సమావేశాలు

ఏపీ రాష్ట్రంలో జిల్లాల వారీగా తనకున్న పరిచయాలను వైసీపీని బలోపేతం చేసేందుకు అనిల్ ప్రయత్నిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై స్పష్టత లేదు. గత ఎన్నికల సమయంలో వైసీపీ నేత జగన్ సోదరి షర్మిల విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ దఫా అనిల్ కూడ రంగంలోకి దిగారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

English summary
There is a spreading a rumour Ysrcp chief Ys Jagan relative Anil kumar trying to help for Ysrcp. brother Anil Kumar met director Ramgopal varma for cinema.Ys Jagan planning to win in 2019 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X