వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెండా వందనంలో భార్య, సిఎం కుర్చీలో బావమరిది: బాబుపై జగన్ పంచ్

By Pratap
|
Google Oneindia TeluguNews

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

తన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆయన బుధవారం నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు బస్టాండ్ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

నాలుగేళ్ల పాలనలో చంద్రగ్రహణం

నాలుగేళ్ల పాలనలో చంద్రగ్రహణం


నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టిందని, ఆకాశంలోని చంద్రగ్రహణం కొద్ది గంటల్లోనే వీగిపోతుండగా రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం మాత్రం గ్రామాల మొదలుకొని రాష్ట్రాన్ని పూర్తిగా అమ్మేసే వరకు వీడేలా కనిపించడం లేదని ఆయన అన్నారు.

 చంద్రగ్రహణం ఏ స్థాయిలో..

చంద్రగ్రహణం ఏ స్థాయిలో..

రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం ఏ స్థాయిలో ఉందంటే తొలిసారిర గణతంత్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రి జెండా వందనంలో కనిపించలేదని, ఎక్కడికో వెళ్లారని జగన్ అన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి అక్రమ నివాసంలో నివసిస్తూ ఉండగా ఆ అక్రమ నివాసంలో సిఎం భార్య జెండా వందనం చేశారని ఆయన అన్నారు.

బావమరిది సిఎం కుర్చీలో కూర్చున్నారు

బావమరిది సిఎం కుర్చీలో కూర్చున్నారు

ముఖ్యమంత్రి విదేశాలు వెళ్తే ఆయన బావమరిది సిఎం కుర్చీలో కూర్చున్నారని జగన్ బాలకృష్ణ సిఎం కుర్చీలో కూర్చుని సమీక్ష నిర్వహించడాన్ని ఉద్దేశించి అన్నారు. పూజారులు పూజలు చేయాల్సిన దుర్గమ్మ గుడిలో తాంత్రికులు, మాంత్రికులు పూజలు చేస్తున్నరని ఆయన అన్నారు

వారికి ఎరవేసి...

వారికి ఎరవేసి...

రూ. 20, 30 కోట్లు ఎరవేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా అధికార పార్టీలో చేర్చుకుంటున్నారని జగన్ చంద్రబాబును విమర్శించారు. వారితో రాజీనామా చేయించడానికి బదులు సిగ్గు లేకుండా వారికి మంత్రి పదవులు ఇస్తున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సినవాళ్లే దానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు.

రాష్ట్రపతి రాష్ట్రానికి వస్తే...

రాష్ట్రపతి రాష్ట్రానికి వస్తే...

రాష్ట్రానికి రాష్ట్రపతి వస్తే అక్రమ బోటులో, లైసెన్స్ లేని బోటులో సిగ్గు లేకుండా తిప్పారని జగన్ వ్యాఖ్యానించారు. పుష్కరాల సమయంంలో తన షూటింగ్ కోసం ముఖ్యమంత్రి అక్షరాల 29 మంది ప్రాణాలను బలితీసుకున్నారని అన్నారు.

ముఖ్యమంత్రిర అడ్డంగా దొరికిపోయారు...

ముఖ్యమంత్రిర అడ్డంగా దొరికిపోయారు...

రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం ఏ స్థాయిలో ఉందంటే ఓటుకు కోట్లు ఇతూ పక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ముఖ్యమంత్రి అడ్డంగా ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయారని జగన్ వ్యాఖ్యానించారు. నల్లధనం ఇస్తూ ఎవరైనా పట్టుబడితే ఉద్యోగంలోంచి పీకేస్తారని, కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి దొరికిపోయినా ఇంకా పదవిలో కొనసాగుతూనే ఉన్నారని అన్నారు. అది మన రాష్ట్రంలో కొనసాగుతోందని అన్నారు.

గట్టిగా అడగలేని పరిస్థితి...

గట్టిగా అడగలేని పరిస్థితి...

ఓటుకు నోటు కేసుతో రాష్ట్రాన్ని అడ్డగోలుగా ఆమ్మేసే పరిస్థితి వచ్చిందని జగన్ అన్నారు. ఆడియో, వీడియో టేపులతో సిఎం అడ్డంగా దొరికిపోవడంతో కేంద్రం నుంచి హక్కులను గట్టిగా అడగలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. సిబిఐ విచారణకు భయపడి ప్రత్యేక హోదాను ముఖ్యమంత్రి అమ్మేశారని ఆయన అన్నారు. ఇదే పెద్ద మనిషి ప్రత్యేక ప్యాకేజీ బాగుందంటూ ప్యాకేజీ పేరిట ప్రత్యేక హోదాను అమ్మేసినట్లు చెప్పాడని అన్నారు. నిస్సిగ్గుగా ప్యాకేజీ వల్ల ఒక్క రూపాయి కూడా మేలు జరగడం లేదని ఇప్పుడు అంటున్నారని చెప్పారు.

అరాచక ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారు...

అరాచక ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారు...

ఇసుక నుంచి రాజధాని వరకు అన్నింటా లంచాలే లంచాలని జగన్ అన్నారు. ఈ నాలుగేళ్లలో పర్మినెంట్ పేరుతో రాజధానిలో ఒక్క ఇటుక కూడా పెట్టలేదని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంద్రప్రదేశ్‌గా మార్చేశారని అన్నారు. రాష్ట్రాన్ని అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత చంద్రబాబుదేనని, నాలుగేళ్లలో రాష్ట్రాన్న్ి అరాచక ఆంధ్రప్రదేశ్‌గా, రాజ్యాంగం అమలు కాని ఆంధ్రప్రదేశ్‌గా, చట్టం అమలు కాని ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశాని అన్నారు.

English summary
YSR Congress party prsident YS Jagan in his Nellore district Praja Sankalpa yatra slammed at Andhra Pradesh CM Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X