వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పాదయాత్రకు ఏర్పాట్లు: 'వైయస్ హయంలో ఎక్కువ లబ్ధి పొందింది ఆయనే'

వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు పార్టీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం నేతలు ఇడుపులపాయలో ఏర్పాట్లను పరిశీలించారు. గురువారం అధినేత... నేతలతో భేటీ అయ్యారని తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు పార్టీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం నేతలు ఇడుపులపాయలో ఏర్పాట్లను పరిశీలించారు. గురువారం అధినేత... నేతలతో భేటీ అయ్యారని తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం, ఇరకాటంలో టీడీపీ: బాబుపై జగన్‌కు ఛాన్స్రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం, ఇరకాటంలో టీడీపీ: బాబుపై జగన్‌కు ఛాన్స్

Recommended Video

అసెంబ్లీలో టిడిపి వ్యూహం : వైసీపీ నేతల గురించి మాట్లాడకూడదని ఇలా...! | Oneindia Telugu
 బీసీలను ఓటు వేసే యంత్రాలుగా

బీసీలను ఓటు వేసే యంత్రాలుగా

బీసీల ఓట్లతో అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని విస్మరించిందని వైసిపి బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు జంగ కృష్ణమూర్తి బుధవారం కర్నూలులో విమర్శించారు. బీసీలను కేవలం ఓట్లువేసే యంత్రాలుగా చూస్తున్నారని, 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నేటికీ నెరవేర్చలేదన్నారు.

 టీడీపీ వైఫల్యాలను ప్రచారం చేయాలి

టీడీపీ వైఫల్యాలను ప్రచారం చేయాలి

టీడీపీ హయాంలో బీసీల ఆర్థిక స్థితిగతుల్లో ఎలాంటి మార్పు రాలేదని కృష్ణమూర్తి అన్నారు. వెనుకబడిన తరగతుల్లో కొన్ని కులాలను ఎస్టీల్లో చేరుస్తామన్న ప్రభుత్వం బీసీ ఫెడరేషన్‌ ఏర్పాటు చేసి గొప్పలు చెప్పుకుంటోందన్నారు. టీడీపీ వైఫల్యాలను ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.

 జగన్‌కు వినతిపత్రాలు ఇవ్వాలి

జగన్‌కు వినతిపత్రాలు ఇవ్వాలి

జగన్‌ చేపట్టనున్న ప్రజాసంకల్ప పాదయాత్రకు ప్రజలు ఘనస్వాగతం పలకాలని, ఏవైనా సమస్యలుంటే వినతిపత్రాలను అందించాలని కృష్ణమూర్తి అన్నారు. ఈ యాత్ర పూర్తయ్యాక బీసీ గర్జన నిర్వహిస్తామన్నారు.

 వైయస్ హయాంలో ఎక్కువ లబ్ధి పొందిన వ్యక్తి

వైయస్ హయాంలో ఎక్కువ లబ్ధి పొందిన వ్యక్తి

జగన్‌ను విమర్శించే అర్హత పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి లేదని విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో అందరికంటే ఎక్కువగా లబ్ధిపొందిన వ్యక్తి రఘువీరా అని అలాంటి వ్యక్తి జగన్ పైన ఈ రకంగా విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు.

English summary
YSR Congress Party President YS Jagan Mohan Reddy’s Padayatra is scheduled to start from November 6. in this regard, YS Jagan is making plans to meet all the leaders and people during the Padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X