విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి: మంత్రులకు భద్రత పెంపు

|
Google Oneindia TeluguNews

Recommended Video

అరకు ఎమ్మెల్యే కాల్చివేత నేపథ్యంలో జగన్ కు భద్రత పెంపు

అరకు/విశాఖపట్నం: మావోయిస్టుల దాడిలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరు సోము మృతి చెందడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఆయన ఈ దాడిని ఖండించారు. ఆయన ప్రజా సంకల్ప యాత్రలో ఉన్నారు.

నక్సల్స్ ఘాతుకం: ఎమ్మెల్యే కిడారి దారుణ హత్య, మాజీ ఎమ్మెల్యే కూడా మృతి, చంద్రబాబు దిగ్భ్రాంతినక్సల్స్ ఘాతుకం: ఎమ్మెల్యే కిడారి దారుణ హత్య, మాజీ ఎమ్మెల్యే కూడా మృతి, చంద్రబాబు దిగ్భ్రాంతి

ఈ హత్యలపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులను మావోయిస్టులు కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో హింసకు, హత్యలకు తావు లేదన్నారు. కిడారి, సోమ కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

YS Jagan responds on MLA and Former MLA murder by Naxals

మంత్రులకు భద్రత, ప్రభుత్వం హెచ్చరిక

మావోయిస్టుల దాడి నేపథ్యంలో ఏపీవ్యాప్తంగా హై అలర్డ్ విధించారు. నేతలు రక్షణ లేకుండా బయటకు వెళ్లవద్దని ప్రభుత్వం సూచనలు చేసింది. ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. జిల్లాలోని మంత్రులకు భద్రతను పెంచారు. రంపచోడవరం, చింతూరు డివిజన్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు.

పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. మావోయిస్టుల దాడిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఏపీ డీజీపీని ఆదేశించింది. డుంబ్రీగుడ మండలం లివిటిపుట్ట వద్ద మావోయిస్టులు వారిని కాల్చి చంపిన విషయం తెలిసిందే.

English summary
YSR Congress party chief YS Jagan Mohan Reddy responded on MLA Kidari Sarveswara Rao and former MLA Siveri Soma murder by Naxals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X