వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపి మంత్రుల‌ను క‌ల‌వరానికి గురి చేస్తున్న జ‌గ‌న్ హామీలు..!!

|
Google Oneindia TeluguNews

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దూసుకెళ్తున్నారు. అలుపెర‌గ‌ని సైనికుడిలా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తున్న యాత్ర‌కు ప్ర‌జ‌ల‌నుండి పెద్ద‌యెత్తున స్పంద‌న ల‌భిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపి పొలిటిక‌ల్ విజ‌న్ ఎలా ఉండ‌బోతోందో కూడా ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. వైసీపి అదికారంలోకి వ‌స్తే తాను ఎలాంటి ప్ర‌జోప‌యోగ కార్య‌క్రుమాలు చేప‌డ‌తాడో వివ‌రించ‌డంతో పాటు హామీల‌ను కూడా ప్ర‌క‌టిస్తున్నారు. దీంతో బ‌హిరంగ స‌భ‌ల‌కు వ‌స్తున్న ప్ర‌జ‌లు ఆస‌క్తిగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చెప్తున్న అంశాల‌ను ఆల‌కిస్తున్నారు. అంతే కాకుండా జ‌గ‌న్ ఇస్తున్న హామీలు తెలుగుదేశం పార్టీ ఓటు బాంకుకు ఎక్క‌డ గండి కొడ‌తాయోన‌ని తెలుగు త‌మ్ముళ్లు ఆందోళ‌న‌కు గురౌతున్న‌ట్టు తెలుస్తోంది.

ఏపిలో ప్ర‌తిప‌క్ష నేత హామీలు.. తెప్పిస్తున్నాయి మంత్రుల‌కు క‌న్నీళ్లు..!

ఏపిలో ప్ర‌తిప‌క్ష నేత హామీలు.. తెప్పిస్తున్నాయి మంత్రుల‌కు క‌న్నీళ్లు..!

ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇస్తున్న హామీల ప‌ట్ల అధికార పార్టీలోని మంత్రులు క‌ల‌వ‌ర‌పుడుతున్న‌ట్టు తెలుస్తోంది. కొందరు మంత్రలు జ‌గ‌న్ హామీల‌ను ఎవ‌రూ న‌మ్మ‌ర‌ని అంటుంటే, మ‌రికొంద‌రు హామీల అమ‌లుకు జ‌గ‌న్ నిధులు ఎక్క‌డి నుండి తెస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. జ‌గ‌న్ హామీలను జ‌నాలు న‌మ్ముతారో నమ్మరో గానీ మంత్రులు మాత్రం ఈ హామీలపై తెగ బాధపడిపోతున్నారని సమాచారం. ప్రస్తుతానికి జ‌గ‌న్ హామీల‌ను ఇస్తున్నారు, జ‌నాలు సానుకూలంగా స్పందిస్తున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో జ‌నాలు పాల్గొంటున్న విష‌యం గ‌మ‌నిస్తేనే ప్ర‌జ‌లు సానుకూలంగా ఉన్నార‌న్న విష‌యం అర్ధ‌మ‌వుతోందని విశ్లేషకులు అంటున్నారు.

పాద‌యాత్ర‌కు వెల్లువ‌లా జ‌నాలు..! ఓట్లు కురిపిస్తారా అనేదే సందేహం..!

పాద‌యాత్ర‌కు వెల్లువ‌లా జ‌నాలు..! ఓట్లు కురిపిస్తారా అనేదే సందేహం..!

అయితే పాద‌యాత్ర‌లో పాల్గొన్న జ‌నాలంతా రేప‌టి ఎన్నిక‌ల్లో వైసిపికి ఓట్లేస్తార‌ని ఎవరూ భ‌రోసా ఇవ్వ‌లేరు కూడా. కాగా పాద‌యాత్ర‌లో పాల్గొంటున్న జ‌నాల‌ను చూసిన త‌ర్వాతే మంత్రుల్లో ఆందోళన పెరిగిపోతోంద‌న్న విష‌యం వ్యక్తమవుతోంది. సాధారణంగా ఏ రాజ‌కీయ పార్టీ అధినేత అయినా ఏదైనా కార్య‌క్ర‌మం చేపడితే ప్ర‌త్య‌ర్ధుల‌పై విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేయ‌టం స‌హ‌జ‌ం. దాంతో పాటు తాను అధికారంలోకి వ‌స్తే ఏమి చేస్తార‌నే విష‌యంపై జ‌నాల‌కు స్ప‌ష్ట‌తనిస్తారు. అదే స‌మ‌మంలో కొన్ని హామీల‌నూ ఇస్తారు. జ‌గ‌న్ ఇపుడు అదే చేస్తున్నారు.
వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం అప్ప‌గిస్తే హామీల‌ను నెర‌వేరుస్తారనే న‌మ్మ‌క‌ముంటేనే జ‌నాలు జ‌గ‌న్ కు అధికారం అప్ప‌గిస్తారు.లేక‌పోతే లేదు. అది జ‌నాల స‌మ‌స్య‌. మ‌ధ్య‌లో మంత్రుల‌కెందుకు అంత ఉలికిపాటు అనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.

చంద్ర‌బాబు హామీల‌పై ప్ర‌భావం.. జ‌గ‌న్ హామీల‌ను ప్ర‌జ‌లు న‌మ్మితే టీడిపికి ప్ర‌మాద‌మే..!

చంద్ర‌బాబు హామీల‌పై ప్ర‌భావం.. జ‌గ‌న్ హామీల‌ను ప్ర‌జ‌లు న‌మ్మితే టీడిపికి ప్ర‌మాద‌మే..!

గ‌త‌ ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌న్నింటినీ నెర‌వేరుస్తాడ‌నే ఉద్దేశంతోనే జనాలు చంద్ర‌బాబుకు ప‌ట్టం క‌ట్టారనే విష‌యం తెలిసిందే. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఇచ్చిన హామీల‌ను ఎంత వ‌రకు చంద్ర‌బాబు నెర‌వేర్చింది అంద‌రికీ తెలిసిన అంశ‌మే. అందుకే ఇపుడు జ‌గ‌న్ ఇస్తున్న హామీల‌ను జ‌నాలు న‌మ్మి వైసిపికి ఎక్క‌డ అధికారం అప్ప‌గిస్తారోనని మంత్రులు ఆందోళన పడిపోతున్నట్టు తెలుస్తోంది. కాగా జగన్ పిల్లలను బడికి పంపితే ఏడాదికి రూ.15వేలు ఇస్తాం. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ను ఉచితంగా చదివిస్తాం. హాస్టల్‌ ఫీజు కోసం ఏడాదికి రూ.20వేలు ఇస్తాం. అధికారంలోకి వస్తే పెన్షన్లను రూ.2వేలకు పెంచుతాం. పెన్షన్‌దారుల వయసు 45 ఏళ్లకు తగ్గిస్తాం. పేదలందరికీ ఇల్లు కట్టిస్తాం అంటూ ప్ర‌జారంజ‌క హామీలు గుప్పిస్తున్నారు.

జ‌గ‌న్ వి అమ‌లు కాని హామీలు..! కొట్టిపారేస్తున్న ఏపి స‌ర్కార్..!

జ‌గ‌న్ వి అమ‌లు కాని హామీలు..! కొట్టిపారేస్తున్న ఏపి స‌ర్కార్..!

అలాగే 2019లో అధికారంలోకి వస్తే 2024 లోగా సంపూర్ణ మద్యపాన నిషేధం లాంటి హామీలు కూడా ఇచ్చారు. ఒకప్పుడు సాధ్యంకాని హామీలు ఇవ్వను అని చెప్పుకొచ్చిన జగన్ ఇప్పుడు ఇలాంటి హామీలు ఎందుకు ఇస్తున్నారా అని సొంత పార్టీ వారే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే 2019 ఎన్నికలు ఆ పార్టీకి జీవన్మరణ సమస్య అని అందుకే జగన్ ఇలాంటి హామీలు ఇస్తున్నారని పార్టీ ముఖ్య‌నేత‌లు అంటున్నారు.

English summary
ysrcp chief jagan mohan reddy giving promises for ap people. jagan targeting in 2019 elections. thats why he is giving abnormal promises to the ap public. ruling party ministers and leaders afriding of jagan's promises.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X