• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

"హ్యాపీ బర్త్‌ డే ఫేక్ సీఎం"- జగన్‌ పుట్టినరోజున టీడీపీ, జనసేన ట్రోలింగ్‌

|

ఏపీలో అధికారపక్షం వర్సెస్‌ విపక్షంగా సాగుతున్న రాజకీయాలు పతాక స్దాయికి చేరుకున్నాయి. ప్రభుత్వం పనితీరుపై ఆగ్రహంగా ఉన్న విపక్షాలు ఇవాళ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో భారీ ఎత్తున నెగెటివ్‌ క్యాంపెయిన్‌కు తెరతీశాయి. ముఖ్యంగా జగన్‌పై తాజాగా మొదలుపెట్టిన ఫేక్‌ సీఎం పదాన్ని విస్తృతంగా ఉపయోగిస్తూ టీడీపీ, జనసేన నేతలు ఈ క్యాంపెయిన్‌ సాగిస్తున్నారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో అన్నీ ఫేకే కాబట్టి ఆయన కూడా ఫేక్‌ సీఎం అంటూ వీరి ట్రోలింగ్‌ సాగుతోంది. దీంతో టాప్‌ ట్రెండింగ్‌ టాపిక్‌ల్లో ఇది కూడా చేరిపోయింది.

 పుట్టిన రోజున జగన్‌పై ట్రోలింగ్‌

పుట్టిన రోజున జగన్‌పై ట్రోలింగ్‌

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ను టార్గెట్‌ చేస్తూ విపక్ష టీడీపీ, జనసేన నేతలు ట్రోలింగ్ చేస్తున్నారు. పుట్టినరోజుకు ముందే ఆయన్ను ఎలా ట్రోల్‌ చేయాలో వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టులు పెట్టిన ఇరు పార్టీల నేతలు ఇవాళ ఉదయం నుంచీ ఈ క్యాంపెయిన్‌కు తెరదీశారు. జగన్ సర్కారు ఈ ఏడాదిలో ఎలా విఫలమైందో, జగన్‌ నిర్ణయాలు దానికి ఎలా కారణమయ్యాయో వివరిస్తూ టీడీపీ, జనసేన నేతలు సోషల్‌ మీడియాలో హోరెత్తిస్తున్నారు. "హ్యాపీ బర్త్‌డే ఫేక్ సీఎం" పేరుతో సాగిస్తున్న ఈ నెగెటివ్‌ క్యాంపెయిన్‌ కూడా టాప్‌ ట్రెండింగ్‌ టాపిక్‌ల్లో ఒకటిగా మారిపోయింది.

జగన్‌ బర్త్‌ డే గిఫ్ట్‌ ఇదేనంటూ..

జగన్‌ బర్త్‌ డే గిఫ్ట్‌ ఇదేనంటూ..

జగన్ పుట్టినరోజున హ్యాపీ బర్త్‌డే చెబుతున్నట్లుగా సూచిస్తూనే.. మోస్ట్‌ హేటెడ్‌, కరప్ట్‌, స్టుపిడ్‌, ఫేక్ సీఎం జేఎంఆర్‌ అంటూ టీడీపీ, జనసేన నేతలు ట్రోలింగ్‌ సాగిస్తున్నారు. ఇదే జగన్‌కు తామిచ్చే బర్త్‌ డే గిఫ్ట్‌ అంటూ వీరు ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా జగన్‌ నిర్ణయాలను అందులో ప్రస్తావిస్తూ వీరు టార్గెట్‌ చేస్తున్నారు. సెంటు భూమిలో పేదలు ఇల్లు కట్టుకోమంటూ, సెంటున్నర లో తన బాత్రూం కట్టుకొని.. ఆదర్శంగా నిలిచిన.. జలగన్నకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఓ ట్వీట్‌లో పెట్టారు. రాజులా బ్రతికే మమ్ము తరాజులోపెట్టి కొలిచి హేళన చేస్తూ కుళ్లు రాజకీయాలతో అభివృద్ధిని ఆపినందుకా పుట్టిన రోజు సంబరాలు అంటూ మరో మహిళ ట్వీట్‌ పెట్టింది.. అమరావతి విషయంలో జగన్‌ నిర్ణయాలను కూడా ఇందులో ప్రధానంగా టార్గెట్‌ చేస్తున్నారు.

జగన్‌ నిర్ణయాలపై ట్రోలింగ్‌

జగన్‌ నిర్ణయాలపై ట్రోలింగ్‌

జగన్‌ ప్రభుత్వ హయాంలో అమరావతి, రాజధానులు, ఇసుక, వైసీపీ రంగులు, ఇంగ్లీష్‌ మీడియం, కియో మోటార్స్‌, ఇళ్ల స్ధలాలు, కరోనా వంటి అంశాల్లో పలు నిర్ణయాలు తీసుకుంది. వీటన్నింటినీ ప్రస్తావిస్తూ ఇప్పుడు టీడీపీ, జనసేన నేతలు జగన్‌ను ట్రోల్ చేస్తున్నారు. చివరికి ఎన్నికలకు ముందు జగన్‌ హిందూమతంలోకి మారి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఓట్లేసిన జనాన్ని మోసం చేస్తున్నారని మరో అంశంలో ట్రోల్‌ చేస్తున్నారు. ఇలా ఎక్కడ చూసినా ఇప్పుడు జగన్‌ ను హ్యాపీ బర్త్‌డే ఫేక్‌ సీఎం ట్యాగ్‌తో ట్రోల్‌ చేసేస్తున్నారు. దీంతో ట్విట్టర్‌లో ఈ టాపిక్‌ ట్రెండింగ్‌ పెరుగుతోంది.

  CM KCR Phone Call To AP Farmer over best Farm Methods ఆంధ్రా రైతుకు సీఎం కేసీఆర్ ఫోన్‌‌...!!
  జగన్‌ బర్త్‌డే విషెస్‌కు కౌంటర్‌..

  జగన్‌ బర్త్‌డే విషెస్‌కు కౌంటర్‌..

  ఓవైపు సీఎం, వైసీపీ అధినేతగా ఉన్న వైఎస్‌ జగన్‌కు పుట్టినరోజు సందర్భంగా లక్షల సంఖ్యలో శుభాకాంక్షలు వచ్చిపడుతుంటే వాటికి కౌంటర్‌గా టీడీపీ, జనసేన సోషల్ సైన్యాలు వ్యక్తిగతంగా ఫేక్‌ సీఎం పోస్టులతో ఊదరగొడుతున్నాయి. ముఖ్యంగా జగన్‌కు శుభాకాంక్షలు పెట్టేందుకు పెట్టిన పోస్టులకు సైతం రిప్లైల్లో ఫేక్‌ సీఎం అని పేర్కొంటూ కౌంటర్‌ ఇస్తున్నారు. దీంతో ఓవైపు జగన్‌ బర్తెడే గ్రీటింగ్స్‌, మరోవైపు హ్యాపీ బర్త్‌డే టూ ఫేక్‌సీఎం క్యాంపెయిన్‌ రెండూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై తెగ వైరల్‌ అవుతున్నాయి. ఉదయం నుంచి సాగుతున్న ఈ నెగెటివ్‌ క్యాంపెయిన్‌ను సాయంత్రం వరకూ కొనసాగించాలని వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టులు కూడా పెడుతున్నారు.

  English summary
  on the eve of andhra pradesh chief minister ys jagan's birthday, opposition tdp and janasena leaders are holding "HBDFakeCM" campaign in social media.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X