వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఎస్కార్ట్ వాహనాలను అడ్డుకున్నారు: పవన్ విగ్రహానికి క్షీరాభిషేకం

జగన్ ఎస్కార్టు వాహనాలను పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకున్నారు. కాగా, పవన్ కల్యాణ్ విగ్రహానికి మోహన్ చంద్ అనే వ్యక్తి క్షీరాభిషేకం చేసి దీక్షకు కూర్చున్నారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ప్రత్యేక హోదా కోసం తలపెట్టిన ఆందోళనను తిప్పికొట్టడానికి పోలీసులు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఎస్కార్ట్ వాహనాలను పోలీసులు లంకపాలెం వద్ద అడ్డుకుని పరవాడ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

వైయస్ జగన్ గురువారంనాడు విశాఖలో జరిగే ర్యాలీలో పాల్గొంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు గాను హైదరాబాదు నుంచి జగన్ ఎస్కార్టు వాహనాలను విశాఖపట్నం బయలుదేరాయి. వాటిని పోలీసులు అడ్డుకున్నారు.

YS Jagan's escort vehicles seized

ఇదిలావుంటే, జనసేన అధినే పవన్ కల్యాణ్ విగ్రహానికి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అభిమానులు క్షీరాభిషేకం చేశారు. మోహన్ చంద్ అనే వ్యక్తి అక్కడే మౌనదీక్షకు దిగారు. మరోవైపు, ఆంధ్ర యువతకు చెందిన కార్యకర్తలు జాతీయ జెండాలను చేబూని ఆర్కె బీచ్ వైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

ఇదిలావుంటే, తిరుపతిలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. వైసిపి విద్యార్థి విభాగం కార్యకర్తలను అరెస్టు చేశారు. వైసిపి నేతలు మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు.

English summary
YSR Congress party escort vehicles have been stopped by Visakhapatnam police at Lanka Palem.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X