వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోషల్ మీడియాలో పవన్, జగన్ అభిమానుల తిట్ల యుద్దం, వెంకట్‌రెడ్డి అరెస్ట్, పోలీసుల నిఘా

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, వైసీపీ పార్టీల అభిమానుల మద్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్దం సాగుతోంది. పవన్,జగన్ అభిమానులు తమ నేతలను సమర్ధించుకొంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పవన్‌కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో తీవ్రమైన ఆరోపణలు చేసిన వెంకట్‌రెడ్డి అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆసక్తికరం: 'బాబు హీరోగా, నేను కమెడియన్‌గా నాటకం, టెన్త్‌ వరకు క్లాస్‌మేట్స్'ఆసక్తికరం: 'బాబు హీరోగా, నేను కమెడియన్‌గా నాటకం, టెన్త్‌ వరకు క్లాస్‌మేట్స్'

టార్గెట్ 2019: అనంతపురంలో జనసేన ఆఫీస్, టిడిపికి చెక్ పెట్టే ప్లాన్ ఇదేటార్గెట్ 2019: అనంతపురంలో జనసేన ఆఫీస్, టిడిపికి చెక్ పెట్టే ప్లాన్ ఇదే

ఏపీ రాష్ట్రంలో ఇటీవల జిల్లాల పర్యటన సందర్భంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వైసీపీ చీఫ్ జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై జగన్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.

పవన్ కళ్యాణ్‌తో పరిచయమే లేదు, చిరంజీవికి సలహ ఇచ్చా:పరిటాల రవిపవన్ కళ్యాణ్‌తో పరిచయమే లేదు, చిరంజీవికి సలహ ఇచ్చా:పరిటాల రవి

జగన్ అభిమానుల స్పందనపై పవన్ అభిమానులు కూడ ఘాటుగానే స్పందిస్తున్నారు. ఎవరికి వారు తమ నేతలను సమర్థించుకొంటూ సోషల్ మీడియాలో పోష్టులు పెడుతున్నారు.

పవన్‌ను బెదిరించిన వెంకట్‌రెడ్డి అరెస్ట్

పవన్‌ను బెదిరించిన వెంకట్‌రెడ్డి అరెస్ట్


జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ను సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా విమర్శలు గుప్పించిన గుంటూరు జిల్లాకు చెందిన వెంకట్‌రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.జగన్ కు గొప్ప అభిమాని. రెండు మర్డర్ కేసుల్లో ప్రధాన నిందితునిగా ఉండి బెయిల్ పై ఉన్న వెంకటరెడ్డి .. జగన్మోహన్ రెడ్డిపై.. పవన్ కల్యాణ్ విమర్శలు చేయడాన్ని తట్టుకోలేకపోయారు. పవన్‌కు సోషల్ మీడియా ద్వారా... హెచ్చరికలు పంపారు.. వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు. రౌడీషీట్ ఓపెన్ చేస్తామని ప్రకటించారు.

జగన్ అభిమానులకు పవన్ అభిమానుల కౌంటర్

జగన్ అభిమానులకు పవన్ అభిమానుల కౌంటర్

పవన్ కళ్యాణ్‌పై జగన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు పంపుతున్నారు.జగన్‌కు అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు.అదే స్థాయిలో జనసేన పార్టీ అభిమానులు కూడ జగన్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.పవన్ కల్యాణ్ అభిమానులు మాత్రం ... జగన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు వెనుకాడటం లేదు. పవన్ ను వ్యక్తిగతంగా దూషిస్తూ సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు.

సోషల్ మీడియాపై పోలీసుల నిఘా

సోషల్ మీడియాపై పోలీసుల నిఘా


సోషల్ మీడియాలో జగన్, పవన్ అభిమానులు చేసుకొంటున్న ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నారు.సోషల్ మీడియా వేదికగా చోటు చేసుకొంటున్న తిట్ల దండకంపై పోలీసులు అప్రమత్తమయ్యారు. సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసేందుకు కూడ వెనుకాడబోమని పోలీసులు వెంకట్ రెడ్డి ఉదంతం ద్వారా సంకేతాలు ఇచ్చారు.

ఎన్నికల వాతావరణం

ఎన్నికల వాతావరణం

ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉంది. కానీ, ఏపీలో అప్పుడే ఎన్నికల వాతావరణం నెలకొంది. పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటన సందర్భంగా పలు పార్టీలపై చేసిన ఆరోపణల నేపథ్యంలో అభిమానులు ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకోవడంతో పరిస్థితులు మరింత హీటెక్కుతున్నాయి.

English summary
Ysrcp chief Jagan supporters and janasena chief pawan kalyan fans made allegations each and other. Both groups have been criticized as a social media platform.Tiyagura Venkat Reddy, a fan of YSRCP President YS Jaganmohan Reddy has been arrested for threatening to kill Jana Sena chief Pawan Kalyan for his alleged remarks against Jagan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X