వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'వైఎస్సార్ జగనన్న శాశ్వత భూమి హక్కు' సమగ్ర భూ రీసర్వే .. ఏపీలో జనవరి నుండి ప్రారంభం

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టిన నాటి ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలు తీసుకుని వివిధ శాఖల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా రాష్ట్రంలో దాదాపు 120 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భూముల సమగ్ర రీ సర్వేకు రంగం సిద్ధమైంది . జనవరి ఒకటవ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న సమగ్ర భూముల రీ సర్వేకు వైయస్సార్ జగనన్న శాశ్వత భూమి హక్కు అనే పేరు పెట్టారు . ఇక దీనికి సంబంధించి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రకు మూడేళ్ళు ... 10 రోజుల పాటు రోజుకో పథకం అందించాలని సీఎం ఆదేశం వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రకు మూడేళ్ళు ... 10 రోజుల పాటు రోజుకో పథకం అందించాలని సీఎం ఆదేశం

2021 జనవరి నుండి ప్రారంభించి 2023 జూన్ నాటికి ఈ సర్వే పూర్తి చెయ్యాలనే లక్ష్యం

2021 జనవరి నుండి ప్రారంభించి 2023 జూన్ నాటికి ఈ సర్వే పూర్తి చెయ్యాలనే లక్ష్యం

2021 జనవరి నుండి ప్రారంభించి 2023 జూన్ నాటికి ఈ సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది .

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూములను రీ సర్వే చేయడం కోసం 4,500 సర్వే టీమ్ లను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక సమగ్ర భూ సర్వే కోసం దాదాపు వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించినట్లుగా సమాచారం. భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు, గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

భూ వివాదాల పరిష్కారానికి మొబైల్ కోర్టులు .. 15 వేల మంది సర్వే సిబ్బంది

భూ వివాదాల పరిష్కారానికి మొబైల్ కోర్టులు .. 15 వేల మంది సర్వే సిబ్బంది


దాదాపు 120 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ భూ సర్వే చేయబోతున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది.

డ్రోన్ లు, రోవర్లు 70 బేస్ స్టేషన్ల ద్వారా నిర్వహించనున్న ఈ సర్వేలో మొత్తం పదిహేను వేల మంది సర్వేయర్లు పాల్గొననున్నారు. ఒక్కో మండలంలో సర్వే నిర్వహణకు నాలుగు నెలలు పట్టనుంది. సర్వే సమయంలో వచ్చే భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక మొబైల్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సర్వే చేసిన ప్రతి భూమికి యూనిట్ నెంబర్ ఇవ్వడంతో ఆ భూమికి సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా నమోదయి ఉంటాయి. ఎలాంటి భూ వివాదాలకు ఆస్కారం లేకుండా ఉంటుంది.

భూసర్వే కు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ .. ఆమోదించిన ఆర్ధిక శాఖ

భూసర్వే కు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ .. ఆమోదించిన ఆర్ధిక శాఖ

ఈ సర్వే కోసం 987.46 కోట్ల రూపాయల ఈ మేరకు ఖర్చు కానున్నట్లు తెలుస్తోంది. సర్వేలో వినియోగించే డ్రోన్ల కోసం 81 కోట్ల రూపాయలు వ్యయం కానున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జగనన్న భూ రక్షణ పేరుతో డిజిటల్ బౌండరీ మార్కర్, ఫిజికల్ బౌండరీ మార్కర్ లను ఏర్పాటు చేయనున్నారు. హద్దు రాళ్ళ ఏర్పాటు కోసం 600 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి శిక్షణ కోసం 21. 21 కోట్లు, లాజిస్టిక్స్ కోసం 2.59 కోట్ల రూపాయలు, రికరింగ్ పధకం కింద 182.04 కోట్లు ఖర్చవుతుందని సర్వే శాఖ ప్రతిపాదించగా ఆర్థిక శాఖ దీనికి ఆమోదం తెలిపింది.

జగన్ ప్రజా సంకల్ప యాత్ర హామీ నెరవేర్చేందుకు సర్వం సిద్ధం

జగన్ ప్రజా సంకల్ప యాత్ర హామీ నెరవేర్చేందుకు సర్వం సిద్ధం

సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు భూ సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసిన సమయంలోనే రీ సర్వే చేయిస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ హామీ మేరకు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భూముల సమగ్ర రీసర్వే కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. భూముల సమగ్ర రీసర్వే, భూ యజమానులకు శాశ్వత భూహక్కుల కల్పన బిల్లును అసెంబ్లీలో పెట్టి ఆమోదింపజేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు రెవెన్యూ, సర్వే సెటిల్‌మెంట్‌ విభాగాల అధికారులు సర్వే సిబ్బందికి శిక్షణ ఇచ్చి ఏపీలో భూముల సమగ్ర రీసర్వే నిర్వహించనున్నారు .

English summary
The government aims to complete the land survey from January 2021 to June 2023. It seems that 4,500 survey teams are being prepared to re-survey lands in rural and urban areas. It is learned that around Rs 1,000 crore has been earmarked for a comprehensive land survey. Information that mobile courts will be set up to resolve land issues and steps will be taken to ensure that registrations take place within the village secretariat itself.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X