వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపికి షాక్: భూమా బ్రహ్మానంద రెడ్డి వింత లెక్కలు, విస్తుపోతున్న జనం!

నంద్యాలలో అధికార పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి ఎన్నికల వ్యయానికి సంబంధించి చూపుతున్న లెక్కలు విస్తుగొలుపుతున్నాయని వైసిపి అధినేత జగన్‌కు చెందిన సాక్షిలో వార్తలు వస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాలలో అధికార పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి ఎన్నికల వ్యయానికి సంబంధించి చూపుతున్న లెక్కలు విస్తుగొలుపుతున్నాయని వైసిపి అధినేత జగన్‌కు చెందిన సాక్షిలో వార్తలు వస్తున్నాయి.

ఆ దెబ్బకు జగన్ భయపడ్డారా, ఎదురుతిరిగిన టిడిపి: బాబుపై బిజెపి ఆగ్రహంఆ దెబ్బకు జగన్ భయపడ్డారా, ఎదురుతిరిగిన టిడిపి: బాబుపై బిజెపి ఆగ్రహం

భూమా ఖర్చు రూ.6.49 లక్షలేనా

భూమా ఖర్చు రూ.6.49 లక్షలేనా

ఎన్నికల్లో గెలిచేందుకు రూ.కోట్లు వెదజల్లిన టిడిపి తమ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి ఖర్చును కేవలం రూ.6.49 లక్షలే అని పేర్కొనడంపై జనాలు నివ్వెరపోతున్నారని పేర్కొంది.

సాక్షాలు ఉన్నాయని..

సాక్షాలు ఉన్నాయని..

ఉప ఎన్నికల్లో గెలిచేందుకు టిడిపి డబ్బులు పారించిందని పేర్కొంది. వందల కోట్ల రూపాయలను టిడిపి నేతలు ఖర్చు పెట్టినట్లుగా ఆరోపించింది. ఇందుకు సంబంధించి సాక్షాలు కూడా చూపించామని పేర్కొంది.

ఆశ్చర్యానికి గురి చేస్తోందని..

ఆశ్చర్యానికి గురి చేస్తోందని..

ఉప ఎన్నికల్లో టిడిపి పార్టీ మద్యాన్ని ఏరులై పారించిందని పేర్కొంది. మద్యం ఖర్చు రూ. కోట్లలో ఉందని ఆరోపణలు గుప్పించింది. కానీ టిడిపి అభ్యర్థి ఖర్చును కేవలం రూ.6 లక్షల 49 వేలు మాత్రమే చూపించడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని అభిప్రాయపడింది.

కాంగ్రెస్ అభ్యర్థి ఖర్చు కంటే..

కాంగ్రెస్ అభ్యర్థి ఖర్చు కంటే..

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంటే దాదాపు కేవలం రూ.20వేలు మాత్రమే ఎక్కువ ఖర్చును చూపించారని పేర్కొంది. నామినేషన్ రోజు పోలింగ్‌కు రెండు రోజుల ముందు వరకు టిడిపి అభ్యర్థి ఖర్చు చాలా తక్కువ ఉండటాన్ని ప్రశ్నించింది. ముఖ్యమత్రి చంద్రబాబు రెండు రోజుల పర్యటన ఖర్చే రూ.కోటి వరకు ఉంటుందని అభిప్రాయపడింది. ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా పర్యటించారని గుర్తు చేసింది.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy's Sakhi daily on Telugu Desam Party leader and Nandyal winner Bhuma Brahmananda Reddy's elections expenditure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X