అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబూ! ఈ లెక్క ప్రకారం ఆల్ రెడీ నెం.1, టార్గెట్ 2029 ఎందుకు: జగన్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కలు చూస్తుంటే ప్రపంచంలోనే ఏపీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు లెక్క అని వైసిపి అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం అన్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కలు చూస్తుంటే ప్రపంచంలోనే ఏపీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు లెక్క అని వైసిపి అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం అన్నారు.

ప్రపంచంలోనే దేశాల సగటు జీడీపీ 3.1గా ఉందని చెప్పారు. భారత దేశంలో జీడీపీ వృద్ధి రేటు 7.1గా ఉందన్నారు. బడ్జెట్ లెక్కలు చూస్తుంటే యావత్ ఆంధ్రప్రదేశ్ ఆశ్చర్యపోయేలా ఉందన్నారు.

అసత్య ప్రచారాలతో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. 11.61 జీడీపీ వృద్ధి రేటుతో ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తోందని చెప్పారన్నారు. ప్రత్యేక హోదా ఎవరికీ ఇవ్వట్లేదంటూ చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

<strong>నేను నిప్పులో దూకమంటే వాళ్లు దూకేవారు, మీరు మాత్రం!: చంద్రబాబు</strong>నేను నిప్పులో దూకమంటే వాళ్లు దూకేవారు, మీరు మాత్రం!: చంద్రబాబు

YS Jagan says according to Chandrababu AP is No one

వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలన్నింటి అభివృద్ధితోనే మొత్తం వృద్ధి రేటు ముడిపడి ఉంటుందన్నారు. ఈ మూడు రంగాల్లో అభివృద్ధి కనిపిస్తే ముందుకెళ్లిందని, లేకపోతే తిరోగమనంలో ఉందంటారు.

2022, 29, 50 వరకు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన లెక్కలు కూడా చంద్రబాబు చూపించారన్నారు. అప్పటికి దేశంలో అత్యధికంగా వృద్ధి రేటు చెందిన రాష్ట్రం అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు.

ఏపీలో ఏకంగా 11.61 శాతం నమోదు చేసిందంటే ప్రపంచంలో ఇప్పటికే మనం నెంబర్ వన్‌గా ఉన్నట్లు లెక్క అని, అలాంటప్పుడు 2020, 2029, 2050 నాటికి లక్ష్యాలు పెట్టుకోవడం ఎందుకని నిలదీశారు.

English summary
YSRCP chief YS Jaganmohan Reddy on Wednesday said that according to CM Chandrababu Naidu ap is already number one.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X