వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు రాక్షసుడు, బీజేపీని ఓడించాలని ప్రయత్నం, అందుకే ప్లాన్ ప్రకారం అమిత్ షాపై దాడి: జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. 13 జిల్లాల్లో 250 కిలోమీటర్ల మేర ఆయన యాత్ర కొనసాగనుంది. జగన్ పాదయాత్ర సోమవారం వెంకటాపురం వద్ద 2 వేల కిలో మీటర్ల మైలు రాయిని దాటనుంది. అక్కడ 40 అడుగుల పైలాన్‌ను ఆవిష్కరిస్తారు.

కాగా, అంతకుముందు రోజు జగన్ తన పాదయాత్రలో చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు రాక్షసుడు అని, ఆయనను రాజకీయంగా బంగాళాఖాతంలో కలపాలన్నారు. ఆయన పొరపాటున మనిషిగా పుట్టాడని, ఆయన పాలన చూస్తే ఇలాగే అనిపిస్తోందన్నారు. అమిత్ షా కాన్వాయ్ పైన కావాలనే రాళ్ల దాడి చేశారన్నారు.

జగన్‌కు హ్యాండ్!: ఆనం రామనారాయణ యూటర్న్, చక్రం తిప్పిన మంత్రులుజగన్‌కు హ్యాండ్!: ఆనం రామనారాయణ యూటర్న్, చక్రం తిప్పిన మంత్రులు

అమిత్ షాకు చురక, చంద్రబాబుపై విమర్శ

అమిత్ షాకు చురక, చంద్రబాబుపై విమర్శ

కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకే తిరుపతి వెంకన్న దర్శనానికి వచ్చిన బీజేపీ అధ్యక్షులు అమిత్‌ షాపై ముఖ్యమంత్రి చంద్రబాబు పథకం ప్రకారం దాడి చేయించారని జగన్‌ ఆరోపించారు. అక్కడ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పని చేశారని విమర్శించారు.

టీటీడీ బోర్డులో పదవి ఇచ్చి, అమిత్ షాపై రాళ్ల దాడి

టీటీడీ బోర్డులో పదవి ఇచ్చి, అమిత్ షాపై రాళ్ల దాడి

బీజేపీకి చెందిన మహారాష్ట్ర ఆర్థిక మంత్రి భార్యకు టీటీడీ బోర్డులో చంద్రబాబు సభ్యత్వం ఇచ్చి, కొండ దిగువన అమిత్ షాపై రాళ్ల దాడి చేయించారని విమర్శించారు. త్వరలో ఎన్నికలు రానున్నందున ప్లేటు పిరాయించి ప్రత్యేక హోదా అంటూ జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. చంద్రబాబువి ఉత్తర కుమార ప్రగల్భాలు అని, యుద్ధభూమికి వెళ్తే చెమటలు పడుతాయని, డైలాగులకు ఎక్కువ, సైకోకు తక్కువ అన్నారు.

చంద్రబాబుకు కేసుల భయం

చంద్రబాబుకు కేసుల భయం

నాలుగేళ్లలో దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడిన చంద్రబాబుకు ఇప్పుడు కేసుల భయం పట్టుకుందని జగన్ ఆరోపించారు. అందుకే ముందు ముందు తనకు ఏం జరిగినా ప్రజలే కాపాడాలని కోరుతున్నారన్నారు. అవినీతికి పాల్పడిన వారిని ప్రజలు రక్షించాలా అని ప్రశ్నించారు.

ఎమ్మెల్సీ పదవి ఇస్తా

ఎమ్మెల్సీ పదవి ఇస్తా


టీడీపీ, బీజేపీలు నాలుగేళ్లు కలిసి పని చేసినా చంద్రబాబుకు ఏనాడు కైకలూరు గుర్తుకు రాలేదన్నారు. కానీ ఇప్పుడు విడిపోవడంతో కొల్లేరు సమస్య, ప్రత్యేక హోదా గుర్తుకు వస్తున్నాయని జగన్ విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వస్తే కొల్లేరు సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఇక్కడి సమస్యలపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్నారు.

English summary
YSRCP chief YS Jagan Mohan Reddy says AP CM Nara Chandrababu Naidu behind stone pelting on BJP chief Amit Shah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X