వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త ట్విస్ట్‌లు: నిజమా.. జగన్ వద్ద చంద్రబాబు గురించి ఆరా తీసిన మోడీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీతో వైసిపి అధినేత జగన్ భేటీ ఏపీలో టిడిపి, వైసిపి, బిజెపిల మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తోంది. మోడీ - జగన్ భేటీ అంశంపై ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ భేటీ సందర్భంగా ప్రధాని సీఎం చంద్రబాబు వ్యాఖ్యల గురించి ఆరా తీశారు.

షాకింగ్: కంటతడి పెట్టారు.. మోడీతో జగన్ భేటీ వెనుక రహస్యం ఇదీ!!షాకింగ్: కంటతడి పెట్టారు.. మోడీతో జగన్ భేటీ వెనుక రహస్యం ఇదీ!!

ఈ విషయాన్ని స్వయంగా ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు చెబుతున్న పెట్టుబడుల లెక్కపై ప్రధాని మోడీ.. జగన్ నుంచి ఆరా తీశారు.

చంద్రబాబుపై ఆరా

చంద్రబాబుపై ఆరా

రూ.4 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబు చెబుతున్నారని, రూ.10 లక్షల కోట్లు ఎంఓయూలు జరిగాయని అన్నారని, నిజమా జగన్‌... అని ప్రధాని తనను ప్రశ్నించారని జగన్ చెప్పారు. దీనిని బట్టే ప్రధాని మోడీని చంద్రబాబు ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థమవుతోందన్నారు.

కొత్త ట్విస్ట్

కొత్త ట్విస్ట్

ప్రధాని మోడీ - ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ భేటీలో కొత్త కొత్త ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. కేసుల మాఫీ కోసమే జగన్ ప్రధానిని కలిశారని టిడిపి నేతలు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ప్రత్యేక హోదాపై జగన్ వెనుకడుగు వేయడమే అందుకు కారణమని అంటున్నారు. హోదా ఇవ్వకవంటే మోడీ తన ఎంపీలతో రాజీనామా చేయిస్తారా లేదా, ఎప్పుడు చేయిస్తారో చెప్పాలని అంటున్నారు.

ఆ లేఖ ఇప్పటిది కాదని..

ఆ లేఖ ఇప్పటిది కాదని..

చంద్రబాబు అన్ని వ్యవస్థల్నీ, మీడియానీ ప్రభావితం చేస్తున్నారని, తచాను ఫిబ్రవరి 17న లేఖ రాస్తే వాళ్ల నుంచి సమాధానం కూడా వచ్చిందని, మే 10న కలిసేందుకు వెళ్తూ పాత లేఖ తీసుకువెళ్తానా? ఓ పత్రిక ఈ నెల 10న ఇచ్చిన లేఖను పక్కనపెట్టి ఫిబ్రవరి 17న రాసిన లేఖను ప్రస్తావించారని జగన్ విమర్శించారు.

ఎవరో చెప్పాలని..

ఎవరో చెప్పాలని..

ఏ ఈడీ అధికారి లేఖ ఇచ్చారో ఆ పత్రికనే చెప్పాలని జగన్ నిలదీశారు. ఈడీ అధికారులు గాంధీ, ఉమాశంకర్ గౌడ్‌లు టిడిపి చెప్పినట్లు నడుచుకుంటున్నారని జగన్ గతంలో ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు. అయితే, ఇక్కడ జగన్.. మోడీతో కాళ్ల బేరానికి వెళ్లారా లేదా అనేది ఇక్కడ అసలు ప్రశ్న అని, లేఖ ఎప్పటిది అన్నది ముఖ్యం కాదని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.

English summary
YS Jagan says PM Modi asks about Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X