వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు పార్ట్‌నర్! మోడీపై అవిశ్వాసానికి రె'ఢీ': పవన్‌ను దులిపిన జగన్, జెఎఫ్‌సీపై తీవ్రవ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ప్రకాశం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై నేరుగా విరుచుకుపడ్డారు. అలాగే, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు సూచలు, సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామని చెప్పారు.

చదవండి: తప్పు మీదే.. తేల్చండి! ఏపీకి పెండింగులో ఈ మూడే: బాబుకు హరిబాబు కౌంటర్

జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ఆయన పాదయాత్ర 91వ రోజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పవన్ చెప్పినట్లుగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. చంద్రబాబు తానా అంటే పవన్ తందానా అంటున్నారన్నారు.

చదవండి: వారితో చర్చలేమిటి: పవన్ కళ్యాణ్ తీరుతో బాధపడ్డ టీడీపీ, 'జగన్‌కు ముహూర్తం ఎందుకు'

పవన్ కళ్యాణ్ అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధం

పవన్ కళ్యాణ్ అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధం

పవన్ కళ్యాణ్ శనివారం మాట్లాడుతూ.. టీడీపీ, వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చు కదా అని చెప్పారు. దీనిపై జగన్ తన పాదయాత్రలో స్పందించారు. పవన్ చెప్పినట్లుగా తాము అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధమని ప్రకటించారు.

పవన్ కళ్యాణ్! స్వాగతిస్తున్నా

పవన్ కళ్యాణ్! స్వాగతిస్తున్నా

చంద్రబాబు పార్ట్‌నర్ పవన్ కళ్యాణ్‌కు నేను ఒక్కటే చెబుతున్నానని, మీరు చెప్పినట్లు అవిశ్వాసం పెట్టేందుకు మేం సిద్ధమని, మరి మీరు చంద్రబాబును ఒప్పించాలని జనసేనానికి సూచించారు. అవిశ్వాసం పెట్టాలన్న మీ ప్రకటనను నేను స్వాగతిస్తున్నానని చెప్పారు. కానీ అవిశ్వాస తీర్మానానికి 54 మంది మద్దతిస్తున్నామని చెప్పారు.

వవన్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీపై తీవ్ర విమర్శలు

వవన్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీపై తీవ్ర విమర్శలు

పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ కమిటీతో ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు. ఫ్యాక్ఠ్ ఫైండింగ్ కమిటీ తీరు కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లుగా ఉందని మండిపడ్డారు. ప్యాకేజీ అంశాన్ని పక్కన పెట్టి మనం హోదా కోసం పోరాడుదామన్నారు.

డబ్బు తీసుకోండి ఓటు మాత్రం

డబ్బు తీసుకోండి ఓటు మాత్రం

రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు ప్యాకేజీ అంశాన్ని పక్కన పెట్టాలన్నారు. వచ్చే ఎన్నికల్లో డబ్బులిస్తే తీసుకోండని, ఓటు మాత్రం మనస్సాక్షి ప్రకారం వేయండని జగన్ చెప్పారు. 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగి వస్తుందని చెప్పారు.

టీడీపీకి సవాల్

టీడీపీకి సవాల్

టీడీపీకి సవాల్ విసురుతున్నానని, కేంద్రంపై అవిశ్వాసం మేం పెడతాం మీరు మద్దతిస్తారా లేదా మీరు అవిశ్వాస తీర్మానం పెడతామన్నా మేం మద్దతిస్తామని చెప్పారు. మార్చిలో పెడతామన్నారు. ఏప్రిల్ 6న తమ ఎంపీలు రాజీనామా చేస్తారని, టీడీపీ కలిసి వస్తే కేంద్రం లొంగుతుందని చెప్పారు. హోదా కోసం చంద్రబాబు, పవన్ పోరాడాలన్నారు. ఏపీకి మంచి జరుగుతుందంటే తాము దేనికైనా సిద్ధమన్నారు. హోదాను చంద్రబాబు కేంద్రానికి తాకట్టు పెడుతున్నారని మండిపడ్డాహరు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy, replied to Jana Sena chief Pawan Kalyan, on Sunday said that he is ready to no confidence motion on Central Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X