'నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డికి జగన్ దెబ్బ, బ్రహ్మానంద రెడ్డిదే గెలుపు'
నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాప చుట్టేయడం ఖాయమని మంత్రి పత్తిపాటి పుల్లారావు జోస్యం చెప్పారు. ఈ రెండు ఫలితాల తర్వాత వైసిపిలో ముసలం ఖాయమని అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్: నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాప చుట్టేయడం ఖాయమని మంత్రి పత్తిపాటి పుల్లారావు జోస్యం చెప్పారు. ఈ రెండు ఫలితాల తర్వాత వైసిపిలో ముసలం ఖాయమని అభిప్రాయపడ్డారు..

బెదిరించి ఓట్లు వేయించుకోవాలని
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు కూడా కరువు అవుతారని పత్తిపాటి చెప్పారు. జగన్ ఓటమి ఒత్తిడితో ప్రజలను కూడా బెదిరించి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని పత్తిపాటి ఆరోపించారు.
Recommended Video


నంద్యాలలో వైసిపి గ్రాప్ పడిపోతుంది
నంద్యాలలో రోజు రోజుకు పడిపోతున్న గ్రాఫ్ చూసి వైసిపి నేతలు అసహనంతో అరాచకాలు చేయాలని చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అరాచకవాదులకు ఓటు వేయాలో, అభివృద్ధికి ఓటు వేయాలో నంద్యాల, కాకినాడ ప్రజలకు బాగా తెలుసునని చెప్పారు.

జగన్ ప్రచారమే శిల్పా మోహన్ రెడ్డికి నష్టం చేసింది
నంద్యాల ఎన్నికల్లో జగన్ సెల్ఫ్‌గోల్ చేసుకున్నారని, అక్కడ టిడిపి గెలవబోతోందని టిడిపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతున్నారని చెబుతున్నారు. జగన్ ప్రచారమే వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి నష్టం చేసిందన్నారు.

శిల్పాకు అదే దెబ్బ
ముఖ్యమంత్రిని కాల్చి చంపాలని, ఉరి తీయాలంటూ జగన్ చేసిన ప్రచారమే వారికి శిల్పాకు బెడిసి కొట్టిందన్నారు. నంద్యాల ప్రజలు ఓటు అనే ఆయుధంతో వైసిపికి బుద్ధి చెప్పబోతున్నారని అన్నారు. పట్టిసీమ నిర్మించి రాయలసీమకు నీరిస్తే ఇప్పటికీ జగన్ దాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications