వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేం డిఫెన్స్‌లో పడలేదు: పెద్దిరెడ్డి, జగన్ కోపం తగ్గేందుకు డొక్కా సలహా

నందిగామ ఆసుపత్రిలో తమ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలతో తాము ఎలాంటి డిఫెన్సులో పడలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గురువారం నాడు అన్నా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నందిగామ ఆసుపత్రిలో తమ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలతో తాము ఎలాంటి డిఫెన్సులో పడలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గురువారం నాడు అన్నారు.

ఐఏఎస్ అధికారుల తీరు సరికాదని పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారులు దిగజారి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగానిది అదే బాట అని దుయ్యబట్టారు.

<strong>ఇదీ చంద్రబాబు కోపాల చిట్టా!</strong>ఇదీ చంద్రబాబు కోపాల చిట్టా!

కలెక్టర్‌కు ఉదయం నుంచి ప్రమాద స్థలంలో ఏం పని అని నిలదీశారు. జగన్ వ్యాఖ్యలతో తాము డిఫెన్సులో పడలేదన్నారు. జగన్‌ను అవమానించేలా కలెక్టర్ వ్యవహరించారని ఆగ్రహించారు. బస్సు యాజమాన్యాన్ని ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తోందన్నారు.

YS Jagan should practice yoga, says TDP leader

జగన్ యోగా నేర్చుకోవాలి: డొక్కా

వైసిపి అధినేత వైయస్ జగన్ తన తీరు మార్చుకోకుంటే రాజకీయ మనుగడ సాధించలేరని టిడిపి నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. కోపం తగ్గించుకునేందుకు జగన్ యోగా నేర్చుకోవాలని సూచన చేశారు.

జగన్ తీరు మారాలి: పోలీసు సంఘం
జగన్‌ అధికారులపై దుర్భాషలాడటం మంచి పద్ధతి కాదని ఏపీ పోలీసు అధికారుల సంఘం నేతలు అన్నారు. నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జగన్‌ వ్యవహరించిన తీరును ఖండించారు.

విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రశ్నించడం తప్పుకాదని, ప్రశ్నించే విధానమే తప్పు అన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాకు తగ్గి ప్రవర్తించకూడదని హితవు పలికారు.

పోలీసుల సమస్యలపై పోరాడతామని వైసిపి నేతలు చెబుతున్నారని, పోలీసుల సమస్యలపై ఏనాడైనా జగన్‌ ప్రస్తావించారా అని నిలదీశారు. పోలీసులంతా అవినీతిపరులేనని, అందరినీ జైలుకు పంపిస్తానని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు.

English summary
Telugudesam Party leader Dokka Manikya Vara Prasad on Thursday suggested YSRCP chief YS Jaganmohan Reddy should practise Yoga.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X