వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతి పాలన, అబద్ధాల కోరు: చంద్రబాబుపై ధ్వజమెత్తిన జగన్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

కాకినాడ: మొత్తం రుణమాఫీ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఆరోపించారు. కాకినాడలో బుధవారం సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అన్ని వర్గాలను సీఎం చంద్రబాబు వంచించారని విమర్శించారు.

రాష్ట్రంలో మోసపూరిత పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. బుధవారం కాకినాడలో నిర్వహించిన బహిరంగ సభలో వైయస్ జగన్ సమక్షంలో మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, ఆయన కుమారుడు శశిధర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే కన్నబాబు వైసీపీలోకి చేరారు.

YS Jagan Speech in Public meeting at Kakinada

ఈ సందర్భంగా వైయస్ జగన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వైయస్ జగన్ మాట్లాడుతూ ఈరోజు అబద్ధాల కోరుతో పోరాటం చేస్తున్నామన్నారు. డ్వాక్రా మహిళలు, విద్యార్ధులను సైతం చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు జాబ్ రావాలంటే బాబు రావాలని ప్రచారం చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మమ్మల్ని నట్టేట ముంచారని విద్యార్ధులు చెప్పారన్నారు.

చంద్రబాబు నాయుడు పరిపాలన గురించి అవ్వా తాతలకు మైక్ ఇస్తే వారు కూడా మోసపోయామని చెప్పారన్నారు. సంబంధం లేని వ్యక్తులతో జన్మభూమి కమిటీలను వేశారన్నారు. వాళ్లంతా కూడా పెన్షన్లను తీసేయాలని చూస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఇళ్లు కట్టిస్తానన్న చంద్రబాబు రెండేళ్లు గడుస్తున్నా ఒక్క ఇళ్లు కూడా చంద్రబాబు కట్టించలేదని ఆరోపించారు.

ఇంతక ముందు కరెంట్ బిల్లు రెండొందలు వస్తే, ఇప్పుడు ఆరొందలు వస్తుందని ఓ అక్కా చెల్లెమ్మ చెప్పారన్నారు. ఏరోజుకు ఆరోజు గొంగళి మారుస్తున్నారన్నారు. రబీ మొదలైన ఇప్పటి వరకు నాట్లు వేయలేని పరిస్థితి ఉందన్నారు. ఇంతటి దారుణంగా చంద్రబాబు పరిపాలన ఉందన్నారు.

కమిషన్ కోసమే చంద్రబాబు పట్టిసీమ కట్టారు. కమిష్ల కోసం లంచాల కోసం ఇసుక నుంచి బొగ్గు దాకా, బొగ్గు నుంచి మద్యం వరకు కరెప్షన్ ఉందన్నారు. ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలన్నారు. మాటతప్పే ప్రభుత్వం ఇదన్నారు. ప్రతి అడుగులోనూ కమిషన్లు తీసుకుని అవినీతి పాలన చేస్తున్నారు.

ఈరోజు పార్టీలోకి చేరిన కన్నబాబుకు కాకినాడ రూరలో కోడ్ ఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఇక ముత్తా శశిధర్‌కు కాకినాడ కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించారు. ద్వారంపూడితో కలిసి పార్టీని బలపేతం చేయాలని కోరుతున్నానని వైయస్ జగన్ అన్నారు. మీ అందరి చల్లని ఆశీస్సులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలన్నారు.

అనంతరం కాకినాడ రూరల్ కోడ్ ఆర్డినేటర్‌‌గా నిమయతులైన కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి వైయస్ జగన్ అవసరమన్నారు. మా కోసం గళమెత్తే నాయకుడి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఇక ముత్తా గోపాలకృష్ణ మాట్లాడుతూ వైయస్ జగన్‌ను పోరాట యోధుడిగా భావిస్తున్నామన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపిస్తున్న సినిమా బాహుబలిని దాటిపోయిందని ఎద్దేవా చేశారు. అంతక ముందు సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో జగన్‌తో పాటు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

English summary
Ysr Congress President YS Jagan Speech in Public meeting at Kakinada .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X