వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సారీ వద్దంటూ రోజాకు జగన్ హుకుం: వారి టార్గెట్ కొడాలి నానీ కూడా..

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: క్షమాపణ చెప్తే సస్పెన్షన్ ఎత్తివేస్తామంటూ ప్రభుత్వం సంకేతాలు ఇచ్చినప్పటికీ అందుకు రోజా సిద్ధపడకపోవడం వెనక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్టుదల ఉందని అంటున్నారు. తాజాగా, డివిజన్ బెంచీలో ఎదురు దెబ్బ తగిలినప్పటికీ వెనక్కి తగ్గవద్దని రోజాకు జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు.

క్షమాపణ చెప్తే సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవడానికి స్పీకర్ కోడెల శివప్రసాద రావు సముఖంగా ఉన్నట్లు అధికార తెలుగుదేశం పార్టీ సభ్యులు కూడా చెబుతున్నారు. ఆయన సభలో మాట్లాడిన తీరు కూడా అదే విషయాన్ని పట్టిస్తోంది.

వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్సెన్సన్‌పై సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసినట్లు సమాచారం ఉందని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని స్పీకర్ కోడెల శివప్రసాద్ మంగళవారం సభలో అన్నారు. సభ్యులంతా సభా గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏది ఏమైనప్పటికీ గతం గతహా అంటూ ముందుకు సాగాలని స్పీకర్ కోరారు.

YS Jagan suggests Roja not to say sorry

అయితే జగన్ మాత్రం కోర్టు తీర్పు వచ్చేంత వరకూ క్షమాపణ చెప్పాలనే ప్రతిపాదనపై ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని రోజాకు సూచించినట్లు తెలుస్తోంది. క్షమాపణ చెప్తే తప్పు ఒప్పుకున్నట్టే అవుతుందని జగన్ చెప్పినట్లు సమాచారం. కోర్టు తీర్పు రానే వచ్చింది.

ఇదిలావుంటే, అధికార తెలుగుదేశం పార్టీ టార్గెట్ రోజా, కొడాలి నానీ అని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు మాట్లాడిన తీరు ఆ విషయాన్ని పట్టిస్తోంది. కోర్టు తీర్పు మహిళలు గర్వించదగిన తీర్పు అని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ అభివర్ణించారు. తాను చేసిన వ్యాఖ్యలను సభలోనే ఉపసంహరించుకున్నానని ఉమ చెప్పారు.

రోజా, కొడాలి నానిపై ఏడాది పాటు వేటు వేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ఉదారంగా ఉండడం వల్లే మరోసారి ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరుకు అవకాశం కల్పించిందని బోండా స్పష్టం చేశారు. ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా వైసీపీ ఓటువేసినా నష్టం లేదని ఆయన తెలిపారు. వైసీపీ విప్‌కు విలువ లేదని బోండా ఉమ అన్నారు.

వైసీపీకి వ్యక్తులే తప్ప వ్యవస్థలు ముఖ్యంకాదని ప్రభుత్వ విప్ కూనరవికుమార్ మండిపడ్డారు. శాసనసభ స్పీకర్‌దే అంతిమ అధికారం అని హైకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. అవగాహన లేని ప్రతిపక్షనేత సభలో ఉండటం తమ దురదృష్టమని విమర్శించారు. అహంకారమే ఆయుధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని కూన రవికుమార్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

English summary
It is said that YSR Congress president YS Jagan has instructed MLA Roja not to say sorry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X