వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుట్టా రేణుకపై వేటు: మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు టిడిపిలోకి?

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

పార్టీ మారడంపై అన్నీ చెబుతా: బుట్టా రేణుక ఆసక్తికర వ్యాఖ్యలు | Oneindia Telugu

కర్నూల్: కర్పూల్ ఎంపీ బుట్టా రేణుకపై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సస్పెన్షన్ వేటు వేశారు. అక్టోబర్ 17వ, తేదిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో బుట్టా రేణుక టిడిపిలో చేరనున్నారు.బుట్టా రేణుకతో పాటు మాజీ ఎమ్మెల్యేలు గుర్నాథ్‌రెడ్డి, కొత్తకోట ప్రకాష్‌రెడ్డిలు టిడిపిలో చేరనున్నారని సమాచారం.

జగన్‌కు షాక్: భరోసా ఇచ్చిన బాబు, టిడిపిలోకి బుట్టా రేణుక?జగన్‌కు షాక్: భరోసా ఇచ్చిన బాబు, టిడిపిలోకి బుట్టా రేణుక?

కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకొన్నారు. గత కొంతకాలంగా ఆమె టిడిపిలో చేరుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి బుట్టా రేణుక తెరదించారు. అక్టోబర్ 17న, బుట్టా రేణుక వైసీపీకి గుడ్‌బై చెప్పనున్నారు.

జగన్ ప్లాన్: గెలుపు గుర్రాలకే టిక్కెట్లు, విశాఖ నుండి ప్రయోగం?జగన్ ప్లాన్: గెలుపు గుర్రాలకే టిక్కెట్లు, విశాఖ నుండి ప్రయోగం?

2014 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిశారు. అయితే ఈ విషయమై అప్పట్లోనే సంచలనం కల్గించింది.అయితే ఆనాటి నుండి పలుమార్లు రేణుక టిడిపిలో చేరుతారనే ప్రచారం సాగింది. ఎట్టకేలకు ఆ ప్రచారాన్ని అక్టోబర్ 17వ, తేదిన రేణుక నిజం చేయనున్నారు.

బుట్టా రేణుకపై సస్పెన్షన్ వేటు

బుట్టా రేణుకపై సస్పెన్షన్ వేటు

కర్నూల్ ఎంపీ బుట్టా రేణుకపై వైసీపీ సస్పెన్షన్ వేటేసింది. 2014 ఎన్నికల్లో కర్నూల్ ఎంపీగా వైసీపీ అభ్యర్థిగా బుట్టా రేణుక విజయం సాధించారు. అయితే వైసీపీ నుండి విజయం సాధించిన రేణుక ఆ పార్టీని వీడి మంగళవారం నాడు టిడిపిలో చేరనున్నారు. దీంతో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ బుట్టా రేణుకపై సస్పెన్షన్ వేటు వేశారు. బుట్టా రేణుక భర్త నీలకంఠ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత టిడిపిలో చేరారు. అప్పటి నుండి ఆయన టిడిపిలోనే ఉంటున్నారు.

టిడిపిలో చేరేందుకు ముహుర్తం

టిడిపిలో చేరేందుకు ముహుర్తం

కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక టిడిపిలో చేరేందుకు ముహుర్తం కుదిరింది. మంగళవారం నాడు ఉదయం పది గంటలకు బుట్టా రేణుక టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు సమక్షంలో టిడిపిలో చేరనున్నారు. మంగళవారం నాడు ఉదయం 9 గంటలకు చంద్రబాబునాయుడుతో బుట్టా రేణుక సమావేశం కానున్నారు. ఉదయం పది గంటలకు ఆమె టిడిపిలో చేరనున్నారు.

మాజీ ఎమ్మెల్యేలు గుర్నాద్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డిలు టిడిపిలోకి

మాజీ ఎమ్మెల్యేలు గుర్నాద్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డిలు టిడిపిలోకి

మాజీ ఎమ్మెల్యేలు గుర్నాద్‌రెడ్డి, కొత్తకోట ప్రకాష్‌రెడ్డిలు కూడ కర్నూల్ ఎంపీ బుట్టా రేణుకతో కలిసి టిడిపిలో చేరనున్నారనే ప్రచారం సాగుతోంది. కొంత కాలం నుండి వైసీపీ నేతలు టిడిపిలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలోనే వైసీపీ నేతలు టిడిపిలోకి చేరకుండా వైసీపీ నాయకత్వం చర్యలు తీసుకొన్నా ఫలితం లేకుండాపోయింది. గుర్నాద్ రెడ్డి వర్గీయులు అనంతపురంలో జరిగిన పార్టీ సమావేశంలో గందరగోళం సృష్టించారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.

మరికొందరు వైసీపీ నేతలు టిడిపిలోకి

మరికొందరు వైసీపీ నేతలు టిడిపిలోకి


ఏపీ రాష్ట్రంలోని వైసీపీ నేతలు , ప్రజాప్రతినిధులు కొందరు టిడిపిలో చేరేందుకు సన్నాహలు చేసుకొంటున్నారని టిడిపి నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఇటీవలనే ఏపీ మంత్రి నారా లోకేష్ కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. టిడిపిలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని ఆయన చెప్పారు.పాదయాత్ర సమయానికి ఇంకా వైసీపీ నుండి ఎమ్మెల్యేలు, నేతలు పార్టీలో చేరే అవకాశం ఉందని టిడిపి నేతలంటున్నారు.

English summary
Ysrcp chief Ys Jagan suspended kurnool Mp Butta Renuka from Ysrcp on Monday.fomer mlas Gurunath reddy and kothakota prakash reddy may join in Tdp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X