వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ముందు వంగి వంగి! 23మంది సీఎంలుండగా ఇలానా? : బాబును ఏకేసిన జగన్

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి: కోనసమీ ఎంతో ఆహ్లాదకరమైనదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోమన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని పి. గన్నవరంలో ప్రజాసంకల్ప యాత్ర నిర్వహించిన ఆయన అక్కడి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కొబ్బరి రైతుల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు.

పనిచేయని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రజలు తిట్టుకుంటున్నారని జగన్ అన్నారు. నగరం గ్రామాన్ని స్మార్ట్ విలేజ్ చేస్తామన్న హామీ ఏమైందని చంద్రబాబును ప్రశ్నించారు.

 అవి ‘లోకేష్ ర్యాంపులు'.. బాబు దోపిడీ ఇలా

అవి ‘లోకేష్ ర్యాంపులు'.. బాబు దోపిడీ ఇలా

ఇక్కడ కొనసాగుతున్న ఇసుక మాఫియాకు లోకేష్ ర్యాంపు అని పేరు పెట్టారని అన్నారు. దీంతో పోలీసులు, అధికారులు ఎవరూ అక్కడికి వెళ్లడం లేదని అన్నారు.

మట్టిని, ఇసుకను దోచుకుంటున్నారని, కాంట్రాక్టర్లు, విద్యుత్ కొనుగోళ్లు అవినీతికి పాల్పడ్డారని, రాజధాని, విశాఖ భూముల్లో కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
చంద్రబాబు తన స్థాయిలో అవినీతికి పాల్పడుతుంటే.. గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీలు దోపిడీకి పాల్పడుతున్నాయని జగన్ ఆరోపించారు. మరుగుదొడ్డికి కూడా డబ్బులు అడుగుతున్నారని మండిపడ్డారు. ఇళ్ల పట్టాలు, స్థలాలు ఇవ్వకుండా.. ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటున్నారని అన్నారు.

చంద్రబాబు రోజుకో సినిమా

చంద్రబాబు రోజుకో సినిమా

లంక గ్రామాలకు బ్రిడ్జి అడిగితే ఇప్పటికీ కాలేదని అన్నారు. వందలాది మంది చనిపోతున్నా.. రహదారులను మాత్రం విస్తరించడం లేదని మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం అడిగి అడిగి ప్రజలు అలసిపోయారని అన్నారు.

తమ ప్రభుత్వం వస్తే లంచం అనే మాటే ఉండదని జగన్ అన్నారు. ప్రతి పేదవాడికి తామే ఇల్లు కట్టి ఇస్తామని చెప్పారు. అవసరమున్న చోట బ్రిడ్జీలను నిర్మిస్తామని చెప్పారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రోజుకో సినిమా, రోజుకో నటన ఉంటోందని, బాబు ఏం చేసినా ఎల్లో మీడియా తందనా అన్నట్లు వ్యవహరిస్తోందని అన్నారు.

మోడీ ముందు వంగి వంగి..

మోడీ ముందు వంగి వంగి..

చంద్రబాబు నీతి ఆయోగ్ సమావేశం కోసం ఢిల్లీకి వెళితే.. ప్రధాని నరేంద్ర మోడీని కడిగేస్తారని.. అడిగేస్తారని.. యుద్ధం ప్రకటిస్తారంటూ ఎల్లో మీడియా కథనాలు రాసిందని అన్నారు. అయితే, చంద్రబాబువన్నీ ఉత్తరకుమారుడి ప్రగల్భాలేనని తేలిపోయిందన్నారు. మోడీ స్పీచ్ బైకాట్ చేస్తారంటూ కథనాలు రాస్తే.. వంగి వంగి మోడీకి షేకాండ్ ఇచ్చారని.. మోడీ షేకాండ్ ఇవ్వకున్నా చంద్రబాబు ఆయన ఎడమచేయిని పట్టుకున్నారని అన్నారు.

బీజేపీపై యుద్ధమంటూనే..

బీజేపీపై యుద్ధమంటూనే..

రక్షణమంత్రి మొగుడ్ని చంద్రబాబు పక్కన పెట్టుకుంటూనే బీజేపీతో యుద్ధమంటారని జగన్ విమర్శించారు. మహారాష్ట్ర బీజేపీ మంత్రి భార్యకు టీటీడీ సభ్యత్వం ఇచ్చారని అన్నారు. బాలకృష్ణ సినిమా షూటింగ్‌లకు బీజేపీ నేతలు వెళ్లారని అన్నారు. బీజేపీని కేంద్రమంత్రి పదవులకు రాజీనామా టీడీపీ ఎంపీలు ఇప్పటికీ పొగుడుతూనే ఉన్నారని అన్నారు. చంద్రబాబు మాత్రం అన్నీ బిల్డప్‌లు ఇస్తుంటారని అన్నారు.

ప్రధాని, 23మంది సీఎంల ముందు ఇలానా?

ప్రధాని, 23మంది సీఎంల ముందు ఇలానా?

చంద్రబాబు చెప్పేదొకటి చేసేదొకటని జగన్ విమర్శించారు. 25ఎంపీలు ఒకేసారి రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వస్తుందని తెలిసినా టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించలేదని అన్నారు. నీతి ఆయో‌గ్ సమావేశంలో చంద్రబాబు మాట్లాడిన మాటలతో హోదా రావద్దని ఆయన కోరుకుంటున్నట్లు అర్థమైందని అన్నారు.

రాష్ట్రం బ్రహ్మాండంగా ఉందని, 10.5శాతం వృద్ధిరేటుతో అభివృద్ధి చెందుతోందని, దేశం వృద్ధిరేటుకంటే మెరుగ్గా ఉన్నామని చంద్రబాబు చెప్పారని తెలిపారు. ఇలా చెప్తే కేంద్రం హోదా ఎలా ఇస్తుందని జగన్ ప్రశ్నించారు. ప్రధాని, 23మంది సీఎంలు ఉన్న వేదిక మీద ఉండగా ఇలాంటి మాటలా? అని జగన్ నిలదీశారు.

Recommended Video

తమాషాలు చేస్తున్నారా..? : క్షురకులపై ఆగ్రహంతో ఊగిపోయిన చంద్రబాబు
గల్లాపట్టి అడగండి..

గల్లాపట్టి అడగండి..

రాష్ట్రంలో నాలుగేళ్లుగా వ్యవసాయంలో ఒక్క పంటకు కూడా గిట్టుబాట ధర లేదని అన్నారు. ఉద్యోగాలు లేవు, రుణమాఫీ లేదని అన్నారు. బెల్టు షాపులు తీసేయిస్తామని చెప్పి.. ఇప్పుడు ప్రతీ గ్రామంలో పెట్టించారని మండిపడ్డారు. బాబు హైటెక్ పాలనలో ఫోన్ కొడితే మందుబాటిల్ ఇంటికి వస్తుందని అన్నారు. పొదుపు సంఘాల రుణమాఫి ఏదని ప్రశ్నించారు. ఉద్యోగాల కోసం గల్లాపట్టి అడగాలని యువతకు పిలుపునిచ్చారు. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని అన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు ప్రతి ఇంటికీ రూ.లక్ష బాకీ ఉన్నారని అన్నారు. కోటి 70లక్షల ఇళ్లను పదిలక్షలకు తగ్గించారని జగన్ ఆరోపించారు. ఇంత మోసం చేసిన వారు ప్రపంచంలో ఉంటారా? అని ప్రశ్నించారు.

మన ప్రభుత్వం వస్తే..: జగన్

పేదవాడి భూములు లాక్కున్నారని, పింఛన్లు ఇవ్వడం లేదని అన్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నిరుద్యోగభృతి, పింఛన్లు పెంచుతామని అంటున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబును పొరపాటున క్షమిస్తే రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తారని జగన్ అన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు వచ్చి 98శాతం హామీలు అమలు చేశానని మొట్టమదటి అబద్ధం చెబుతారని జగన్ అన్నారు. తమ ప్రభుత్వం వస్తే 9గంటలపాటు పగటిపూట ఉచిత కరెంటు రైతులకు ఇస్తామని చెప్పారు. రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. బోర్లు కూడా ఫ్రీగా వేయిస్తామని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. గిడ్డంగులు నిర్మిస్తామన్నారు. 90శాతం సబ్సిడీతో పాడిపశువులను కొనిస్తామని అన్నారు. కరువుల నుంచి రైతులను ఆదుకునేందుకు కాలమిటి రిలీఫ్ ఫండ్ రూ.4వేల కోట్లతో ఏర్పాటు చేస్తామన్నారు. మరణించిన రైతు కుటుంబానికి రూ.5లక్షల సాయం అందిస్తామని చెప్పారు. సాగు ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు. చంద్రబాబుకు సాగు ప్రాజెక్టుల్లో నీళ్లకు బదులు డబ్బే కనిపిస్తోందని అన్నారు.

English summary
YSRCP president YS Jaganmohan Reddy on Monday takes on Andhra Pradesh CM Chandrababu Naidu for fraud promises.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X